Megastar Chiranjeevi-CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మెగాస్టార్ చిరంజీవి అభినందనలు.. మంత్రులకు శుభాకాంక్షలు..

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజు (డిసెంబర్ 7న) ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై ఆయనతో ప్రమాణం చేయించగా.. ఈ వేడుకకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీతోపాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరయ్యారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు.

Megastar Chiranjeevi-CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మెగాస్టార్ చిరంజీవి అభినందనలు.. మంత్రులకు శుభాకాంక్షలు..
Megastar Chiranjeevi, Reven
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 07, 2023 | 3:05 PM

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా  రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజు (డిసెంబర్ 7న) ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై ఆయనతో ప్రమాణం చేయించగా.. ఈ వేడుకకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీతోపాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరయ్యారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. రేవంత్ రెడ్డితోపాటు 11 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. అలాగే సీఎంగా ముందుగా ఆరు గ్యారంటీల తొలిఫైల్ పై రేవంత్ సంతకం చేశారు. అంతేకాకుండా దివ్యాంగురాలు రజినీకి ఉద్యోగ నియామక పతకం సంతకం చేశారు. ఈ క్రమంలోనే తెలంగాణ కొత్త సీఎం రేవంత్ రెడ్డికి మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలిపారు. అలాగే మంత్రులుగా బాధ్యతలు స్వీకరిస్తున్నవారికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.

“తెలంగాణ కొత్త సీఎం రేవంత్ రెడ్డి.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు కొత్త ప్రభుత్వంలోని మెంబర్స్ అందరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ నాయకత్వంలో రాష్ట్రం మరింత అత్యున్నత స్థాయికి వెళ్లాలని .. మరింత అభివృద్ధి చెందుతుందని కోరుకుంటున్నాను” అంటూ ట్వీట్ చేశారు చిరంజీవి. ప్రస్తుతం ఆయన ట్వీట్ సోషల్ మీడియాలో వైరలవుతుంది.

ఇక చిరు సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో తన కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్ అనౌన్స్ చేయని ఈ మూవీలో హీరోయిన్ త్రిష మరోసారి చిరు జోడిగా నటించనుందని తెలుస్తోంది. ఇక సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న న్యూస్ ప్రకారం ఈ మూవీకి విశ్వంభర అనే టైటిల్ ఖరారు చేసే యోచనలో ఉన్నారట మేకర్స్. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ మారేడుమిల్లి అడవులలో జరుగుతుంది. సోషియో ఫాంటసీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీ సా్టోరీ పంచభూతాలు చూట్టూ తిరుగుతుందని అంటున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన విషయాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.