Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cow Urine: గోమూత్రం నిజంగానే రోగాలను నయం చేస్తుందా? సైన్స్‌ ఏం చెబుతుందంటే..

గోమూత్రంపై నేతలు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. ఆ సమయాల్లో వివిధ ప్రకటనలు చేస్తూ ఉంటారు. గోమూత్రం ఆరోగ్యానికి ప్రయోజనకరమని ఆయుర్వేదం చెబుతోంది. నేటికాలంలో ప్రపంచంలో ప్రతి ఆరో మరణం క్యాన్సర్ కారణంగా సంభవిస్తుంది. ఆవు మూత్రంతో కాన్సర్‌ చికిత్స సాధ్యమవుతుందని చాలా మంది చెబుతున్నారు. అయితే నిజంగానే గోమూత్ర రోగాలను నయం చేస్తుందా? ఈ విషయంపై సైన్స్ ఏమి చెబుతుంది? వంటి విషయాలు మీకోసం..

Cow Urine: గోమూత్రం నిజంగానే రోగాలను నయం చేస్తుందా? సైన్స్‌ ఏం చెబుతుందంటే..
Cow Urine
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 08, 2023 | 8:23 PM

గోమూత్రంపై నేతలు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. ఆ సమయాల్లో వివిధ ప్రకటనలు చేస్తూ ఉంటారు. గోమూత్రం ఆరోగ్యానికి ప్రయోజనకరమని ఆయుర్వేదం చెబుతోంది. నేటికాలంలో ప్రపంచంలో ప్రతి ఆరో మరణం క్యాన్సర్ కారణంగా సంభవిస్తుంది. ఆవు మూత్రంతో కాన్సర్‌ చికిత్స సాధ్యమవుతుందని చాలా మంది చెబుతున్నారు. అయితే నిజంగానే గోమూత్ర రోగాలను నయం చేస్తుందా? ఈ విషయంపై సైన్స్ ఏమి చెబుతుంది? వంటి విషయాలు మీకోసం..

ఆవు మూత్రంతో క్యాన్సర్‌ను నయం చేయడం సాధ్యం అవుతుందా?

మెడికల్ అండ్ పీడియాట్రిక్ ఆంకాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ వెంకట్రామన్ రాధాకృష్ణన్ దీనిపై మాట్లాడుతూ.. గోమూత్రం ప్రయోజనకరమని చెప్పారు. ఆవు మూత్రంతో క్యాన్సర్‌ను నయం చేయడం సాధ్యం కాదు. కేవలం గోమూత్రం తాగి కేన్సర్ లాంటి వ్యాధి నుంచి బయటపడిన రోగిని తాను తన సర్వీస్‌లో ఇంత వరకూ చూడలేదని తన వ్యక్తిగత అనుభవాన్ని వెల్లడించారు. ఆవు మూత్రంలో క్యాన్సర్‌ను నిర్మూలించే మూలకం ఏదీ లేదని రాధాకృష్ణన్ తెలిపారు. ఆవు మూత్రంలో 95% నీటితో పాటు పొటాషియం, సోడియం, ఫాస్పరస్, క్రియాటినిన్ వంటి ఖనిజాలు ఉంటాయని ఆయన చెప్పారు. వీటిలో ఏవీ క్యాన్సర్‌ను నిరోధించే కారకాలు కావని ఆయన స్పష్టం చేశారు. పంటలను మరింత సారవంతం చేసేందుకు పొలాల్లో గోమూత్రాన్ని ఉపయోగిస్తారు. ఇది పంటలకు ఉపయోగపడుతుంది. కానీ క్యాన్సర్‌కు ఔషధంగా ఏమాత్రం పనికి రాదన్నారు.

ఆయుర్వేదం ఏం చెబుతోంది?

ఆయుర్వేదం ప్రకారం గోమూత్రంతో ఊబకాయాన్ని తగ్గించుకోవచ్చు. ఆవు మూత్రంలో విటమిన్లు ఉంటాయి. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. దీనితో పాటు, ఆవు మూత్రం జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఆవు మూత్రాన్ని చర్మ సంరక్షణకు కూడా ఉపయోగించవచ్చు. ఆయుర్వేదం ప్రకారం, మొటిమలు, ఇతర చర్మ సంబంధిత సమస్యలలో గోమూత్రాన్ని ఉపయోగించవచ్చు. అలాగే ఆవు మూత్రం రింగ్‌వార్మ్, గజ్జి వంటి చర్మ వ్యాధులను నయం చేయడానికి కూడా ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

సైన్స్‌ ఏం చెబుతోందంటే..

బరేలీకి చెందిన ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (IVRI) పరిశోధకులు ఆవు మూత్రంలో హానికరమైన బ్యాక్టీరియా ఉందని, దీనిని సేవించడం మనుషులకు అత్యంత ప్రమాదకరమని తమ అధ్యయనాల్లో పేర్కొన్నారు. ఇది మానవ వినియోగానికి తగినది కాదని పునరుద్ఘాటించారు. అధ్యయనం గురించి తెలుసుకోవలసినది మరియు అది కనుగొన్నది ఇక్కడ ఉంది. తాజా ఆవు మూత్రంలో కనీసం 14 రకాల బ్యాక్టీరియాలు ఉంటాయని. కరోనావైరస్ సహా ఏ ఇన్ఫెక్షన్లలోనూ ఇది ప్రయోజనకారి కాదని పేర్కొంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.