Viral Video: ఆకతాయిల బరితెగింపు.. ఏనుగును రెచ్చగొడుతూ ప్రాణాలతో చెలగాటం! వీడియో వైరల్

అటవీ సంపద నానాటికీ క్షీణిస్తుండటంతో అడవి జంతువులు ఆహారం కోసం జన జీవనంలోకి ప్రవేశిస్తున్నాయి. అడవి నుంచి ఆహారం వెతుక్కుంటూ వస్తున్న ఏనుగులు పొలాల్లో ప్రవేశించి దాడులు చేస్తున్నాయి. ఓ అడవి ఏనుగు పంట పొలాల్లోకి వచ్చింది. కొందరు పోకిరీ వ్యక్తులు చెప్పులతో దానిని తరిమేందుకు ప్రయత్నించారు. అంతటితో ఆగకుండా తనదారిన అది వెళ్తుంటే అడ్డగించి మారీ ఏనుగును రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. కోపంతో చిర్రెత్తుకొచ్చిన ఏనుగు ఒక్కసారిగా..

Viral Video: ఆకతాయిల బరితెగింపు.. ఏనుగును రెచ్చగొడుతూ ప్రాణాలతో చెలగాటం! వీడియో వైరల్
Men Trying To Scare Charging Elephant
Follow us

|

Updated on: Dec 08, 2023 | 3:10 PM

అస్సాం, డిసెంబర్ 8: అటవీ సంపద నానాటికీ క్షీణిస్తుండటంతో అడవి జంతువులు ఆహారం కోసం జన జీవనంలోకి ప్రవేశిస్తున్నాయి. అడవి నుంచి ఆహారం వెతుక్కుంటూ వస్తున్న ఏనుగులు పొలాల్లో ప్రవేశించి దాడులు చేస్తున్నాయి. ఓ అడవి ఏనుగు పంట పొలాల్లోకి వచ్చింది. కొందరు పోకిరీ వ్యక్తులు చెప్పులతో దానిని తరిమేందుకు ప్రయత్నించారు. అంతటితో ఆగకుండా తనదారిన అది వెళ్తుంటే అడ్డగించి మారీ ఏనుగును రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. కోపంతో చిర్రెత్తుకొచ్చిన ఏనుగు ఒక్కసారిగా వారిపైకి దాడికి దిగుతుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మీరూ చూడండి..

భారీ సైజులో ఉన్న ఓ ఏనుగు గుట్టపై నిలబడి మనుషుల గుంపుపై దూకుడుగా రావడం వీడియోలో చూడవచ్చు. అందరూ తలోదిక్కు నుంచి చెప్పులు, రాళ్లతో ఏనుగు తరిమేందుకు ప్రయత్నించడం వీడియోలో కనిపిస్తుంది. వీరిలో ఒక వ్యక్తి చెప్పు చేతుల్లోకి తీసుకుని ఏనుగు వెంట పడతాడు. మిగతా అందరూ భయంతో గుట్ట కిందనే ఉండి తరమడానికి ప్రయత్నిస్తుంటారు. దీంతో ఏనుగు దాని మానన అది వెళ్లిపోతుంటే సదరు వ్యక్తి మాత్రం అత్యుత్సాహంతో గుట్టపైకి ఎక్కిమరీ ఏనుగును రెచ్చ కొట్టడం వీడియోలో కనిపిస్తుంది. దీంతో ఏనుగు కోపంతో గుంపుపైకి విరుచుకు పడుతుంది. గట్టిగా గర్జిస్తూ వారిపైకి రావడంతో వారంతా మళ్లీ గుట్టకిందకు దిగుతారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. దీనిపై పలువురు నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. అడవి ఏనుగును రెచ్చగొట్టడం వల్ల కలిగే నష్టాలను చెప్పుకొచ్చారు. వన్య ప్రాణులను అనవసరంగా కదిలించుకోవడం అంత మంచిది కాదంటూ హితవు పలికారు.

ఇవి కూడా చదవండి

కోపంతో ఊగిపోతున్న ఏనుగు గుట్ట కిందకు ఉంటే వారి ప్రాణాలు ఏమయ్యేవనేది ఊహిస్తేనే వెన్నులో ఒక్కసారిగా వణుకు పుడుతుంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారి పర్వీన్ కస్వాన్ షేర్ చేశారు. ‘ఇక్కడ అసలు జంతువు ఎవరు?’ అనే క్యాప్షన్‌తో ఆయన ఈ వీడియోను షేర్ చేశారు. యువత క్రేజ్ నిజంగానే డేంజర్ లెవల్‌కి వెళ్లిందని కొందరు, ఇలాంటి వారిని అరెస్టు చేయాలని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తే, ఇంకొందరమో తమ పంట పొలాలను కాపాడుకోవడానికి యువకులు చేసిన పనిలో తప్పేంటి అంటూ ప్రశ్నస్తున్నారు. ఏది ఒప్పు, ఏది తప్పు అనే నిర్ధారణకు వచ్చేకంటే ఆ పూటకు వారందరికీ అదృష్టం కలిసొచ్చి, ప్రాణాలు దక్కించుకున్నారనే చెప్పాలి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు