AP Inter Exams 2024: మార్చి 1 నుంచి ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు.. త్వరలో టైం టేబుల్‌ విడుదల

రాష్ట్రంలో ఇంటర్మీడిట్‌ పబ్లిక్‌ పరీక్షలు వచ్చ ఏడాది మార్చి ఒకటో తేదీ నుంచి నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రాథమికంగా నిర్ణయించింది. ప్రాక్టికల్స్‌, వొకేషనల్‌, థియరీ పరీక్షలను మార్చి 20లోపు పూర్తి చేసేలా షెడ్యూల్‌ రూపొందించారు. ఇంటర్‌ పరీక్షల అనంతరం పదో తరగతి పరీక్షలు మార్చి 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఏపీ సాధారణ ఎన్నికల నోటిఫికేషన్‌ మార్చిలో వచ్చే అవకాశం ఉంది..

AP Inter Exams 2024: మార్చి 1 నుంచి ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు.. త్వరలో టైం టేబుల్‌ విడుదల
AP Inter Exams 2024
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 10, 2023 | 9:33 PM

అమరావతి, డిసెంబర్‌ 10: రాష్ట్రంలో ఇంటర్మీడిట్‌ పబ్లిక్‌ పరీక్షలు వచ్చ ఏడాది మార్చి ఒకటో తేదీ నుంచి నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రాథమికంగా నిర్ణయించింది. ప్రాక్టికల్స్‌, వొకేషనల్‌, థియరీ పరీక్షలను మార్చి 20లోపు పూర్తి చేసేలా షెడ్యూల్‌ రూపొందించారు. ఇంటర్‌ పరీక్షల అనంతరం పదో తరగతి పరీక్షలు మార్చి 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఏపీ సాధారణ ఎన్నికల నోటిఫికేషన్‌ మార్చిలో వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పరీక్షల షెడ్యూల్‌పై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌ కుమార్‌ మీనాతో అధికారులు చర్చిస్తున్నారు. పదో తరగతి పరీక్షల్లో మొత్తం ఏడు పేపర్లకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఒక పరీక్ష పూర్తయిన మరుసటిరోజు సెలవు ఇవ్వాలా, వద్దా అనేదానిపై బోర్డు నుంచి స్పష్టత రావాల్సి ఉంది.

క్లాట్‌-2024 ఫలితాలు విడుదల.. ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌ (క్లాట్‌) 2024 ఫలితాలు ఆదివారం (డిసెంబర్‌ 10) విడుదయ్యాయి. పరీక్ష రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో అప్లికేషన్‌ లేదా అడ్మిట్‌ కార్డు నంబర్‌, పుట్టిన తేదీ వివరాలతో స్కోరు కార్డు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. డిసెంబర్‌ 3వ తేదీన దేశ వ్యాప్తంగా 139 కేంద్రాల్లో పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. క్లాట్‌ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు డిసెంబర్‌ 12 నుంచి 22 వరకు ఆన్‌లైన్‌లో కౌన్సెలింగ్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. క్లాట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా దేశవ్యాప్తంగా 22 ప్రధాన లా యూనివర్సిటీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. కాగా నేషనల్‌ లా స్కూల్స్, యూనివర్సిటీలు ఆలిండియా స్థాయిలో ప్రవేశాలకు ఏటా కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌ (క్లాట్‌)ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో మెరుగైన ర్యాంకులు సాధించిన విద్యార్థులకు యూజీ, పీజీ కోర్సుల్లో (ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం) ప్రవేశాలు కల్పిస్తారు. క్లాట్‌-2024 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

డిసెబర్ 11 నుంచి తెలంగాణ లాసెట్‌ చివరి విడత కౌన్సెలింగ్‌

తెలంగాణ లాసెట్‌ 2023 చివరి విడత కౌన్సెలింగ్‌ రేపట్నుంచి (డిసెంబర్‌ 11వ తేదీ నుంచి) ప్రారంభం కానుంది. డిసెంబర్‌ 13వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. డిసెంబర్‌ 14 నుంచి 16వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. డిసెంబర్‌ 19న సీట్లు కేటాయింపు ఉంటుందని లాసెట్‌ ప్రవేశాల కన్వీనర్‌ ప్రొఫెసర్‌ పి రమేశ్‌బాబు తెలిపారు. మూడేళ్లు, అయిదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సులు, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో కన్వీనర్‌ కోటా సీట్లు మొత్తం 6,894 అందుబాటులో ఉండగా.. వీటిల్లో 5,912 మందికి తొలి విడతలో సీట్లు దక్కాయి. వారిలో 65 శాతం మంది వరకు సీట్లు పొందిన కాలేజీల్లో చేరారు. చివరి విడతలో 40 శాతం సీట్లు అందుబాటులో ఉండొచ్చని సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.