Telangana: శాసనమండలిలో బీఆర్‌ఎస్‌దే ఆధిపత్యం.. సీఎం రేవంత్ రెడ్డి వ్యూహంపై సర్వత్రా ఆసక్తి

సంపూర్ణ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గెలిచి తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. క్యాబినెట్ ఏర్పడింది పరిపాలన మొదలైంది. అయితే శాసన మండలిలో మాత్రం ఇంకా భారత రాష్ట్ర సమితి మెజారిటీ సభ్యులతో హవా కొనసాగించనుంది. మొత్తం తెలంగాణ కౌన్సిల్‌ లో 40 సీట్లు ఉన్నాయి. అందులో కాంగ్రెస్ ఉన్నది ఒకే ఒక్క సీటు

Telangana: శాసనమండలిలో బీఆర్‌ఎస్‌దే ఆధిపత్యం.. సీఎం రేవంత్ రెడ్డి వ్యూహంపై సర్వత్రా ఆసక్తి
CM Revanth Reddy
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Dec 11, 2023 | 6:42 AM

సంపూర్ణ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గెలిచి తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. క్యాబినెట్ ఏర్పడింది పరిపాలన మొదలైంది. అయితే శాసన మండలిలో మాత్రం ఇంకా భారత రాష్ట్ర సమితి మెజారిటీ సభ్యులతో హవా కొనసాగించనుంది. మొత్తం తెలంగాణ కౌన్సిల్‌ లో 40 సీట్లు ఉన్నాయి. అందులో కాంగ్రెస్ ఉన్నది ఒకే ఒక్క సీటు.. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో గెలిచిన జీవన్ రెడ్డి మాత్రమే ఇప్పుడున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ. ఎంఐఎం కు రెండు సీట్లు, బీజేపీకి ఒక ఎమ్మెల్సీ, ఇండిపెండెంట్‌ గా మరో ఎమ్మెల్సీ ఉన్నారు. తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందింది నలుగురు ఎమ్మెల్సీలు. పళ్లా రాజేశ్వర్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి, కసిరెడ్డి నారాయణరెడ్డి లు ఎమ్మెల్యేలుగా గెలిచి తాజాగా ఎమ్మెల్సీలుగా రాజీనామా చేశారు. ఈ నాలుగు స్థానాలకు ఎన్నికలు రావాల్సి ఉంది. ఇందులో కూడా కడియం శ్రీహరి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. తాజాగా అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య ప్రకారం ఇందులో ఒకటి మాత్రమే కాంగ్రెస్‌ కు వస్తుంది మరోకటి బీఆర్‌ఎస్‌ కు వెళ్లే అవకాశం ఉంది. ఇక రెండు ఎమ్మెల్సీలు గవర్నర్ వద్ద ఖాళీగా ఉన్నాయి. అవి కూడా తాజాగా ఏర్పడిన ప్రభుత్వం సిఫారసుతో రెండు కాంగ్రెస్‌ కు వచ్చే అవకాశం ఉంది.

ఇక గ్రేటర్‌ ఎన్నికల్లో ఒకటి లోకల్ బాడీ ఎన్నికల్లో మరోకటి ఖాళీ అయింది. ఇవన్నీ పోను ఇప్పటికీ భారత రాష్ట్ర సమితికి 28 మంది ఎమ్మెల్సీలు కౌన్సిల్లో ఉన్నారు. 2025 వరకు కొత్తగా ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అయ్యే అవకాశం లేదు. గతంలో తెలంగాణ ఏర్పడిన కొత్తలో బీఆర్ఎస్‌కు ఇదే పరిస్థితి. అప్పటికే ఉన్న కాంగ్రెస్ టిడిపి ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకొని లెజిస్లేటివ్ పార్టీలను విలీనం చేసుకుంది బీఆర్ఎస్. ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్సీలను చేర్చుకుంటుందా లేక ఇంకేదైనా వ్యూహంతో ముందుకు వెళుతుంది అనేది ఆసక్తిగా కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్