Congress – MIM: పాత పొత్తు.. కొత్తగా పొడుస్తుందా..? ఎంఐఎం, కాంగ్రెస్ దోస్తీపై రాజకీయ వర్గాల్లో చర్చ..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి. సీఎంగా రేవంత్ రెడ్డి, కొత్త మంత్రులు కూడా ప్రమాణాస్వీకారం చేశారు. అసెంబ్లీలో కొత్తగా గెలుపొందిన ఎమ్మెల్యేలు సైతం ప్రమాణస్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం పార్టీకి చెందిన ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ రాజ్‌భవన్‌లో గవర్నర్ సమక్షంలో ప్రమాణస్వీకారం చేసి, అసెంబ్లీలో ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు బహిష్కరించారు. పాలిటిక్స్‌లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఎవరూ ఉండరన్నది జగమేరిగిన సత్యం.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి. సీఎంగా రేవంత్ రెడ్డి, కొత్త మంత్రులు కూడా ప్రమాణాస్వీకారం చేశారు. అసెంబ్లీలో కొత్తగా గెలుపొందిన ఎమ్మెల్యేలు సైతం ప్రమాణస్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం పార్టీకి చెందిన ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ రాజ్‌భవన్‌లో గవర్నర్ సమక్షంలో ప్రమాణస్వీకారం చేసి, అసెంబ్లీలో ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు బహిష్కరించారు. పాలిటిక్స్‌లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఎవరూ ఉండరన్నది జగమేరిగిన సత్యం. తాజాగా జరిగిన కీలక పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్- ఎంఐఎంల మధ్య పాత పొత్తు కొత్తగా పొడిచిందా..? అనే ఊహగానాలు వినిపిస్తున్నాయి. ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీని నియమించడంతోఆ పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపింది. మొన్నటి ఎన్నికల్లో నువ్వా.. నేనా..? అన్నట్టూ ఇరు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. పాతబస్తీ సెంట్రిక్‌గా రాజకీయాలు వ్యూహ, ప్రతి వ్యూహాలతో పిక్స్ చేరాయి. ఎలాగైనా కాంగ్రెస్‌ను దెబ్బకొట్టాలని కొన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టిందన్న ఆరోపణలు వినిపించాయి. ఫలితాలు కూడా అదే తీరుగా రావడం గమనార్హం. ఇంకో కోణంలో బీజేపీకి .. ఎంఐఎం బీ టీమ్ అంటూ సోషల్ మీడియలో వార్తలు వైరల్‌గా మారాయి. ఈ వార్తలను ఖండించిన అసదుద్దీన్ వీటిపై వివరణ ఇచ్చుకోవల్సి వచ్చింది..
తాజాగా జరిగిన ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తోందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినా.. రిజల్ట్స్ మాత్రం భిన్నంగా వచ్చాయి. అయితే ఆయా రాష్ట్రాల్లో ఎంఐఎం పోటీ చేసిందన్న ఆరోపణలు వినిపించాయి. కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తే ఒక విధంగా అది బీజేపీకి ప్లస్ అవుతుందని ఊహించిన ఆ పార్టీ సీనియర్లు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే బెటరంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు బహిరంగ మద్దతు ప్రకటించిన ఎంఐఎం, తాజాగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం అక్బరుద్దీన్ ఒవైసీని నియమించడంతో.. కొత్త పొత్తులకు క్లూ కావొచ్చంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలోనూ కాంగ్రెస్ తో దోస్తి చేయడంతో ఈ అనుమానాలు మరింత బల పడుతున్నాయి.
ఇదే నిజం అయితే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి పోటీ చేస్తే ఒకటి రెండు సీట్లు ఎంఐఎంకు పోగా.. మిగిలిన సీట్లలో ముస్లిం ఓట్లతో ఎక్కువ స్థానాలు గెలుచుకోవచ్చని అభిప్రాయంలో ఉంది కాంగ్రెస్. పొత్తు కుదిరితే కేంద్రంలో ఒకవేళ ఇండియా కూటమి అధికారంలోకి రాకున్నా.! తెలంగాణలో అధికారపార్టీతో పాలన కొనసాగించవచ్చని ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.. ఏది ఏమైనా పదేళ్ల నుంచి బీఆర్ఎస్‌తో స్నేహం చేసిన ఎంఐఎం ఆ పార్టీతోనే కొనసాగుతుందా? లేక ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీవైపు ఉంటుందా? వేరే పరిణామాలు ఏమైనా ఉంటాయా అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. వీటిపై క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..