Telangana: అసెంబ్లీ ఎన్నికల ఎఫెక్ట్.. ఆ రెండు సెగ్మెంట్లపై ఎంఐఎం స్పెషల్ ఫోకస్!
పాత బస్తీలో తమ విజయం నల్లేరుపై నడకేనని భావించిన ఎంఐఎం అధిష్టానానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఓ రకంగా షాక్ ఇచ్చాయని చెప్పకోవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రాబోయే పార్లమెంట్ ఎన్నికలపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చిరకాలంగా హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
తెలంగాణలో ఎంఐఎం 9 చోట్ల పోటీ చేసి 7 సిట్టింగ్ స్థానాల్లో తిరిగి విజయం సాధించింది. అయితే ఈ ఎన్నికల్లో ఎంఐఎంకు ఒకటి రెండుచోట్ల అతితక్కువ మెజార్టీ వచ్చింది. ఓటింగ్ శాతం కూడా భారీగా తగ్గిపోయింది. దరాబాద్ మహానగరంలోని కీలకమైన యాకుత్‌పురా, నాంపల్లిలో ఎంఐఎం పార్టీకి ఈసారి చాలా తక్కువ ఓట్లు వచ్చాయి. చివరి నిమిషంలో అక్కడి అభ్యర్థులు గెలిచారు. మొత్తానికి చావు తప్పి కన్నులొట్టపోయిన పరిస్థితి నెలకొంది. పాత బస్తీలో తమ విజయం నల్లేరుపై నడకేనని భావించిన ఎంఐఎం అధిష్టానానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఓ రకంగా షాక్ ఇచ్చాయని చెప్పకోవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రాబోయే పార్లమెంట్ ఎన్నికలపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చిరకాలంగా హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పాత బస్తీ ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా చూసుకోవాలని ఎంఐఎం పెద్దలు ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మరీ ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కువగా ప్రజల్లోనే తిరుగుతూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. గెలిచిన తర్వాత ఆ పార్టీ ఎమ్మెల్యేలు వరుసగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. వాడవాడలా తిరుగుతూ ప్రజలను పలకరిస్తున్నారు. అక్కడి సమస్యలను పరిష్కరిస్తామంటూ హామీలు ఇచ్చి సముదాయిస్తున్నారు.
పాతబస్తీలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి పనుల్లేవని ప్రజలు ఎంఐఎం నేతలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఎన్నికల సమయంలోనే వచ్చి హడావుడి చేసి ఓట్లు వేయించుకుని గెలిచిన తర్వాత ఇటువైపు రావడం లేదంటూ స్థానికులు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా వచ్చిన ఎంఐఎం ఎమ్మెల్యేలను నిలదీశారు. నియోజకవర్గంలో కనీసం పిల్లలకు పాఠశాలలు లేవని, ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లాలంటే అధిక ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.