హైదరాబాద్‌ ఫిలింనగర్‌లో పట్టుబడ్డ డ్రగ్స్‌ ముఠా..! లక్షలు విలువ చేసే మాదక ద్రవ్యాలు సీజ్‌.. తీగ లాగితే..

విశాఖ ఏజెన్సీలో ఉన్న అరకు ప్రాంతం నుంచి లీటర్‌ రూ.80 వేలకు కొనుగోలు చేసిన ఈ ముఠా హైదరాబాద్‌లోని వినియోగదారులకు రూ.6 లక్షలకు విక్రయిస్తున్నట్టుగా టాస్క్‌ఫోర్స్‌ గుర్తించారు. నిందితులను కింగ్‌పిన్‌లు సయ్యద్‌ ముజఫర్‌ అలీ, అబుబకర్‌ బిన్‌ అబ్దుల్‌ అజీజ్‌, ట్రాన్స్‌పోర్టర్‌ మహ్మద్‌ ఖాసీమ్‌గా గుర్తించారు. నిందితులంతా కాలేజీ డ్రాపౌట్స్ కావడంతో కామన్ ఫ్రెండ్స్ ద్వారా డ్రగ్స్‌కు బానిసలయ్యారని తెలిసింది. వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా..

హైదరాబాద్‌ ఫిలింనగర్‌లో పట్టుబడ్డ డ్రగ్స్‌ ముఠా..! లక్షలు విలువ చేసే మాదక ద్రవ్యాలు సీజ్‌.. తీగ లాగితే..
Peddlers Of Hash Oil
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 11, 2023 | 12:03 PM

వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ శనివారం అర్థరాత్రి ఫిలింనగర్‌లో గంజాయి సంబంధిత మాదకద్రవ్యమైన హష్‌ ఆయిల్‌ విక్రయిస్తున్న ఒక మహిళతో సహా నలుగురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకుంది. వారి నుండి 310 మిల్లీలీటర్ల హషీష్ ఆయిల్, 70 గ్రాముల చరస్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలోని అరకు నుంచి అక్రమంగా సేకరించినట్లు పోలీసులు తెలిపారు. విశాఖ ఏజెన్సీలో ఉన్న అరకు ప్రాంతం నుంచి లీటర్‌ రూ.80 వేలకు కొనుగోలు చేసిన ఈ ముఠా హైదరాబాద్‌లోని వినియోగదారులకు రూ.6 లక్షలకు విక్రయిస్తున్నట్టుగా టాస్క్‌ఫోర్స్‌ గుర్తించారు.

నిందితులను కింగ్‌పిన్‌లు సయ్యద్‌ ముజఫర్‌ అలీ, అబుబకర్‌ బిన్‌ అబ్దుల్‌ అజీజ్‌, ట్రాన్స్‌పోర్టర్‌ మహ్మద్‌ ఖాసీమ్‌గా గుర్తించారు. నిందితులంతా కాలేజీ డ్రాపౌట్స్ కావడంతో కామన్ ఫ్రెండ్స్ ద్వారా డ్రగ్స్‌కు బానిసలయ్యారు. పెడ్లర్లు వ్యాపారంలో చేరడానికి ముందు వినియోగదారులుగా ప్రారంభమయ్యారని పోలీసులు తెలిపారు. ఈ ముఠాతో సంబంధం ఉన్న మరో ఇద్దరు నిందితులు జీషన్ నవీద్, సయ్యద్ అన్వరుల్లా హుస్సేనీ ఖాద్రీలు పరారీలో ఉన్నారు.

అయితే, మహ్మద్ ఖాసీం ఏజెన్సీ ప్రాంతానికి వెళ్లి, నిషిద్ధ వస్తువులను తీసుకొని ముజఫర్ అలీ, అబ్దుల్ అజీజ్‌లకు అప్పగించేవాడని పోలీసులు తేల్చారు. వారు దానిని చిన్న సాచెట్‌లుగా ప్యాక్ చేసి సరఫరా చేస్తారు.. వారు 5 ml పరిమాణానికి 3,500 రూపాయలకు మందును విక్రయిస్తున్నట్టుగా నిర్ధారించారు. అదుపులోకి తీసుకున్నవారిని తదుపరి చర్యల నిమిత్తం నిందితులందరినీ ఫిలింనగర్ పోలీసులకు అప్పగించారు. పరారీలో ఉన్న వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..