AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: బాబోయ్ మిర్చి దొంగలు.. రాత్రికి రాత్రే లక్షల పంట మాయం.. రైతులూ జర జాగ్రత్త!

ఈ ఘటనపై స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్ లో రైతు శీను ఫిర్యాదు చేయగ అక్కడికి చేరుకున్న పోలీసులు సమీపంలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్‌లను పరిశీలించగా రాత్రి గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు అక్కడికి వచ్చినట్లు, కాసేపటికి పరుగెత్తిన దృశ్యాలను గుర్తించారు. అసలే వర్షాలు సరిగా లేక అంతంత మాత్రమే పంటలు పండాయని, ఇలాంటి కరువు సమయంలో పండిన పంటను దొంగలు ఎత్తుకుపోవటంతో రైతులు బోరున విలపిస్తున్నారు. తమను ఆదుకోవాలంటూ దాతల సాయం కోసం రైతు శీను వేడుకుంటున్నాడు.

Andhra Pradesh: బాబోయ్ మిర్చి దొంగలు.. రాత్రికి రాత్రే లక్షల పంట మాయం.. రైతులూ జర జాగ్రత్త!
Mirchi Crop Robbery
Follow us
J Y Nagi Reddy

| Edited By: Jyothi Gadda

Updated on: Dec 11, 2023 | 9:46 AM

దొంగతనాలకు కాదేదీ అనర్హం అంటే ఇదేనేమో. గత కొంతకాలంగా మిర్చి దొంగలు మితిమీరిపోతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను రాత్రికి రాత్రే మాయం చేస్తూ రైతుల ఉసురు పోసుకుంటున్నారు. కళ్లాల్లో ఆరబోసిన పంటను అర్ధరాత్రి దాటిన తర్వాత దోచేసుకుంటున్నారు.. చీడపీడలకే సగం పంట నాశనమవగా.. మిగిలిన సగం ఈ రకంగా దొంగలపాలవుతోందని మిర్చి రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పంటకు కాపలాగా ఉన్న రైతు.. చలికి తట్టుకోలేక కాస్త దుప్పటి కప్పుకొని కునుకు తీసి లేచే లోగా పంట మాయం కావడంతో లబోదిబో మంటున్నారు.

రైతులు శ్రమించి ఆరు కాలం ఎంతో కష్టపడి పండించిన ఎండు మిర్చి పంట దొంగల పాలవుతుంది. కళ్లంలో పంట అమ్ముకునేందుకు ఆరబెట్టిన మిర్చీను అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దొంగలించిన సంఘటన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో చోటు చేసుకుంది. కలుగట్ల గ్రామానికి చెందిన రైతు శ్రీను మూడు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని అందులో నాలుగు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి మిరప పంటను సాగు చేశాడు. చేతికి వచ్చిన పంటను అమ్ముకునేందుకు కోత కోసి ఆరబోశాడు. రెండు రోజులుగా కర్నూలు రోడ్డులోని గ్రాండ్ మహల్ వద్ద ఎండకు ఆరబెట్టాడు. అయితే, ప్రస్తుతం మార్కెట్‌లో మిరప అమ్మకాలకు మంచి రేటు పలుకుతుండటంతో మిరపపై దొంగల దృష్టి పడింది. రైతు శ్రీను ఆరబెట్టిన ఎండు మిర్చిపై కొంతమంది దొంగల కన్ను పడింది.

అర్ధరాత్రి దోపిడీకి తెగబడ్డ దొంగలు సుమారు ఐదు క్వింటాల మిరప ను ఎత్తుకెళ్లరని ఆవేదనతో పోలీసులను ఆశ్రయించాడు. ఆ దొంగలించిన మిరప విలువ సుమారు లక్ష ముప్పై వేల రూపాయలు ఉంటుందని తెలిపారు. ఈ ఘటనపై స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్ లో రైతు శీను ఫిర్యాదు చేయగ అక్కడికి చేరుకున్న పోలీసులు సమీపంలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్‌లను పరిశీలించగా రాత్రి గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు అక్కడికి వచ్చినట్లు, కాసేపటికి పరుగెత్తిన దృశ్యాలను గుర్తించారు.

ఇవి కూడా చదవండి

అసలే వర్షాలు సరిగా లేక అంతంత మాత్రమే పంటలు పండాయని, ఇలాంటి కరువు సమయంలో పండిన పంటను దొంగలు ఎత్తుకుపోవటంతో రైతులు బోరున విలపిస్తున్నారు. తమను ఆదుకోవాలంటూ దాతల సాయం కోసం రైతు శీను వేడుకుంటున్నాడు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..