Diabetes Diet: ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ డ్రింక్ తాగితే మధుమేహం మీ కంట్రోల్‌లో..!
ఈ నీటిని తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ అయిన హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇవి గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. శరీరం జీవక్రియను మెరుగుపరచడం ద్వారా, ఇవి బొడ్డు కొవ్వును తొలగించడంలో, బరువును తగ్గించడంలో సహాయపడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే మెంతి నీళ్లను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అలాగే చర్మం, జుట్టు ఆరోగ్యానికి మెంతి నీళ్లను ఆహారంలో చేర్చుకోవడం మంచిది.
మధుమేహ వ్యాధిగ్రస్తులు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఆహారంపై శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. డయాబెటిక్ పేషెంట్లకు మార్నింగ్ డైట్‌లో తీసుకోవాల్సిన కొన్ని ఆహారపదార్థలు ప్రత్యేకించి సూచిస్తారు వైద్యులు. డయాబెటిక్ రోగులు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్, తక్కువ స్టార్చ్, ఫైబర్, ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినాలి. డయాబెటిక్ పేషెంట్లకు మార్నింగ్ డైట్‌లో తీసుకునే కొన్ని డ్రింక్స్ కూడా అద్భుత ఫలితాలను అందిస్తాయి. అలాంటి డ్రింక్స్ ఏవో ఇక్కడ తెలుసుకుందాం..
ఉదయాన్నే ఖాళీ కడుపుతో మెంతి నీరు తాగడం వల్ల టైప్-2 మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. దీని కోసం మీరు ముందు రోజు ఉదయం ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ మెంతులను నానబెట్టాలి. ఆ మర్నాడు ఉదయాన్నే ఆ నీటిని తాగేయాలి. మెంతులు, మెంతికూరలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. మెంతి గింజలను నీటిలో నానబెట్టడం వల్ల వాటి ప్రయోజనాలు పెరుగుతాయి. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా మెంతి నీటిని తీసుకోవటం అలవాటుగా చేసుకుంటే చక్కలి ఫలితం ఉంటుంది.
మెంతులు నానబెట్టిన నీటిని తాగడం వల్ల జీర్ణ సమస్యలు, అసిడిటీ, కడుపు ఉబ్బరం, మలబద్ధకం తదితర సమస్యలు నయమవుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. మెంతుల్లో ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. కాబట్టి మెంతులతో మరిగించిన నీటిని తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ అయిన హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇవి గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.
శరీరం జీవక్రియను మెరుగుపరచడం ద్వారా, ఇవి బొడ్డు కొవ్వును తొలగించడంలో, బరువును తగ్గించడంలో సహాయపడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే మెంతి నీళ్లను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అలాగే చర్మం, జుట్టు ఆరోగ్యానికి మెంతి నీళ్లను ఆహారంలో చేర్చుకోవడం మంచిది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..