- Telugu News Photo Gallery Castor oil makes hair long and thick and reduce digestive problems Telugu News
Amudham: ఆముదం మొక్కకు సంబంధించిన ఈ రహస్యం మీకు తెలుసా..? అందంతో పాటు ఆరోగ్యం..
Castor Oil Benefits: మన చుట్టూ ఉన్న ప్రకృతిలో అనేక రకాలైన ఆయుర్వేద మొక్కలు కూడా ఉన్నాయి. అందులో ఆముదం మొక్క కూడా ఒకటి. ఈ మొక్కలు ఎన్నో రకాల ఔషధ గుణాలు నిండి ఉంటాయి. ఈ మొక్కను వివిధ రకాల అనారోగ్య సమస్యలకు వినియోగిస్తుంటారు ఆయుర్వేద వైద్యులు.
Updated on: Dec 10, 2023 | 2:32 PM

ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఈ మొక్కను పంచాంగుల, ఏరండ అని కూడా పిలుస్తారు. ఈ మొక్కలోని ప్రతిభాగం ఆయుర్వేద గుణాలతో నిండి ఉంటుంది. ఈ చెట్టు కాయల నుంచి వచ్చే గింజలతో నూనెను కూడా తీస్తారు. ఆముదం గింజలతో తయారు చేసే ఆయిల్‌ను ఆముదం నూనెగా పిలుస్తారు.

గతంలో వంటల్లో ఎక్కువగా ఈ ఆముదం నూనెను వినియోగించేవారు. ఆముదం నూనెతో తయారుచేసిన ఆహారాలను తినడం వల్ల కడుపులో తయారయ్యే నులి పురుగుల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది.

మూల వ్యాధులతో బాధపడేవారికి ఆముదం మొక్క ఆకులు ప్రభావంతంగా పనిచేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధితో బాధపడేవారు ఆకులను నూరి అందులోనే కర్పూరం కలిపి కట్టుకట్టడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు

ఆముదం నూనెను జుట్టుకు అప్లై చేయడం వల్ల తెల్ల జుట్టు సమస్యలు తగ్గుతాయి. జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరుగుతుంది. దాంతోపాటుగా జుట్టు రాలడం సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

ఆముదం నూనెలో వాటి ఆకులను బాగా వేడి చేసి నొప్పులు ఉన్న ప్రదేశాల్లో కట్టుకట్టడం వల్ల గొప్ప ఉపశమనం లభిస్తుంది. వాపు వంటి సమస్యలు సులభంగా దూరమవుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మోకాళ్ళ నొప్పులు కీళ్ల నొప్పులతో బాధపడేవారు ప్రతిరోజు ఈ ఆముదం నూనెను అప్లై చేసి మసాజ్ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.





























