Iron Rich Foods: మహిళల్లో ఐరన్ లెవెల్స్ పెంచడానికి తప్పక తినాల్సిన ఆహారాలు ఇవి..

ముఖ్యంగా శాకాహారం తీసుకునే మ‌హిళ‌లు ఐర‌న్‌తో కూడిన ఆహారం తీసుకోవ‌డంపై అధికంగా దృష్టి సారించాల‌ని పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు. ఐరన్‌ లోపం కారణంగా అలసట, బలహీనత కలిగిస్తుంది. ప్రతినిత్యం మీరు తీసుకునే ఆహారంలో చిన్న‌పాటి మార్పుల ద్వారా ఐర‌న్ లెవెల్స్‌ను పెంచుకోవ‌చ్చు. మహిళల్లో ఐరన్ లెవెల్స్ పెరగాలంటే తినాల్సిన కొన్ని ఆహార పదార్థాలేంటో తెలుసుకుందాం...

Iron Rich Foods: మహిళల్లో ఐరన్ లెవెల్స్ పెంచడానికి తప్పక తినాల్సిన ఆహారాలు ఇవి..
Iron Rich Foods
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 10, 2023 | 12:55 PM

మహిళల్లో ఐరన్ లోపం ఎక్కువగా ఉంటుంది. రక్తహీనత అనేది శరీరంలో ఐరన్ పరిమాణం తగ్గిపోయే పరిస్థితి. శరీరానికి సరిపడా ఎర్ర రక్త కణాలు లేని పరిస్థితి ఇది. హిమోగ్లోబిన్ ఎర్ర రక్త కణాలు ఆక్సిజన్‌ను తీసుకువెళ్లడంలో సహాయపడే ప్రోటీన్. ఈ హిమోగ్లోబిన్ తయారీకి ఐరన్ అవసరం. ఐరన్ అనేది మన శరీరం సరైన పనితీరుకు అత్యంత అవసరం. ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి ఇవి ముఖ్యమైనవి. ర‌క్తహీనత ద‌రిచేర‌కుండా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండాలంటే శ‌రీరంలో త‌గినంత ఐర‌న్ లెవెల్స్ ఉండాలి. ముఖ్యంగా శాకాహారం తీసుకునే మ‌హిళ‌లు ఐర‌న్‌తో కూడిన ఆహారం తీసుకోవ‌డంపై అధికంగా దృష్టి సారించాల‌ని పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు. ఐరన్‌ లోపం కారణంగా అలసట, బలహీనత కలిగిస్తుంది. ప్రతినిత్యం మీరు తీసుకునే ఆహారంలో చిన్న‌పాటి మార్పుల ద్వారా ఐర‌న్ లెవెల్స్‌ను పెంచుకోవ‌చ్చు. మహిళల్లో ఐరన్ లెవెల్స్ పెరగాలంటే తినాల్సిన కొన్ని ఆహార పదార్థాలేంటో తెలుసుకుందాం…

శరీరంలో ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా లేక సరిపడా ఐరన్ లేకపోయినా కొన్ని లక్షణాలు కనబడతాయి. అందులో ముఖ్యంగా నీరసం, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది కలగడం వంటివి ఎదురవుతాయి. ​ఐరన్ డెఫిషియన్సీ వల్ల కంటి పై కూడా ఎఫెక్ట్ పడుతుంది. శరీరంలో ఐరన్ డెఫిషియెన్సీ కారణంగా కంటి భాగంలో ఉండేటువంటి టిష్యూలకు సరిపడ ఆక్సిజన్ అందదు. దాంతో కళ్ళ రంగు మారిపోతుంది. ఈ లక్షణాన్ని మీరు ఎదుర్కొంటున్నట్టయితే..వెంటనే వైద్యులను సంప్రదించాలి. మరింత జాగ్రత్త పడాలి.

దానిమ్మ..

ఇవి కూడా చదవండి

దానిమ్మ ఐరన్ పుష్కలంగా ఉండే పండు. దానిమ్మలో ఐరన్‌తో పాటు కాల్షియం, విటమిన్ సి, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. దానిమ్మలో ఉండే విటమిన్ సి శరీరంలో ఐరన్ శోషణను పెంచడం ద్వారా రక్తహీనతను నివారిస్తుంది.

బచ్చలికూర..

బచ్చలికూర ఇనుముకు అద్భుతమైన మూలం. బచ్చలికూరలో విటమిన్ సి కూడా ఉంటుంది. ఇది శరీరంలో ఐరన్ శోషణను పెంచుతుంది. ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనతను నివారించవచ్చు.

బీట్‌రూట్..

ఐరన్ పుష్కలంగా ఉండే బీట్‌రూట్ తినడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు పెరగడంతోపాటు రక్తహీనతను నివారించవచ్చు.

గుమ్మడికాయ గింజలు..

గుమ్మడికాయ గింజలు ఇనుము అద్భుతమైన మూలం. కాబట్టి వీటిని కూడా తినడం మంచిది.

(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..