AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes Early Symptoms: డయాబెటిస్ ప్రారంభ దశ లక్షణాలు ఇవి.. విస్మరిస్తే మొదటికే మోసం!

చేతులు లేదా కాళ్ళలో తిమ్మిరి లేదంటే జలదరింపు వంటివి అనుభూతి చెందుతారు. చిన్న పనులకే చాలా అలసటగా అనిపిస్తుంది. చర్మం పొడినట్టుగా ఉంటుంది. అందుకే, మధుమేహ బాధితులు తమ బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ని సాధారణ స్థాయిలో ఉంచడం చాలా ముఖ్యం. దీని కోసం మీరు ప్రతిరోజూ బ్లడ్‌షుగర్‌ని చెక్‌చేసుకోవటం మంచిది. మీ బ్లడ్‌ షుగర్‌లో ఎక్కువ తేడాను గమనించినట్టయితే, వెంటనే వైద్యులను సంప్రదించటం తప్పనిసరి.

Diabetes Early Symptoms: డయాబెటిస్ ప్రారంభ దశ లక్షణాలు ఇవి.. విస్మరిస్తే మొదటికే మోసం!
Diabetes
Jyothi Gadda
|

Updated on: Dec 10, 2023 | 11:45 AM

Share

మధుమేహం అనేది ఒక సాధారణ ఆరోగ్య సమస్యే అయినప్పటికీ, కానీ చాలా తీవ్రమైన వ్యాధి. దీనితో కోట్లాది మంది ప్రజలు పోరాడుతున్నారు.చక్కెర వ్యాధి కాలక్రమేణా గుండె, రక్త నాళాలు, కళ్ళు, మూత్రపిండాలు, నరాలను దెబ్బతీస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు కిడ్నీ వ్యాధితో బాధపడే అవకాశం ఎక్కువగా ఉంది. మరింత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే మధుమేహం మన మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది గుండె జబ్బులు, గుండె వైఫల్యం, ఆకస్మిక మరణానికి కూడా దారితీస్తుంది.

మూత్రపిండాలపై అధిక ప్రభావం..

మూత్రపిండాల వ్యాధికి మధుమేహం ప్రధాన కారణం. ఇది మధుమేహం ఉన్నవారిలో మూడింట ఒకవంతు మందిని ప్రభావితం చేస్తుంది. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి (CKD) మధుమేహం తీవ్రమైన, ప్రాణాంతక సమస్య. కాలక్రమేణా, అధిక రక్తంలో చక్కెర స్థాయిలు మూత్రపిండాల పనితీరును ప్రభావితం చేస్తాయి. మధుమేహం ఉన్న వ్యక్తుల్లో అధిక రక్తపోటు సమస్య కూడా ఉంటుంది. ఇది మూత్రపిండాల లోపల రక్త నాళాలను సంకోచించగలదు. దీని వలన మూత్రపిండాలు మరింత దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

లక్షణాలు కనిపించవు..

మధుమేహంలో దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి పైకి ఎటువంటి సంకేతాలు లేకుండా ఎటాక్‌ చేయటం మొదలు పెడుతుంది. ప్రారంభ దశలలో గుర్తించదగిన లక్షణాలు ఏమీ ఉండవు. అయినప్పటికీ వ్యాధి పురోగమిస్తుండటం వల్ల బాధితుల్లో కాళ్ళలో వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఎముక వ్యాధి, జీవక్రియ అసిడోసిస్ వంటి లక్షణాలను అనుభవిస్తారు. ఆహారం, వ్యాయామం పరంగా సరైన జీవనశైలితో ఈ వ్యాధిని నియంత్రించవచ్చు.

మధుమేహం ప్రారంభ లక్షణాలు..

ఎక్కువ సార్లు మూత్రవిసర్జన, రాత్రుళ్లు మరి ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. ఆకస్మికంగా బరువు తగ్గడం వంటిది కనిపిస్తుంది. చూపులో మసక దృష్టి ఎదురవుతుంది. చేతులు లేదా కాళ్ళలో తిమ్మిరి లేదంటే జలదరింపు వంటివి అనుభూతి చెందుతారు. చిన్న పనులకే చాలా అలసటగా అనిపిస్తుంది. చర్మం పొడినట్టుగా ఉంటుంది. అందుకే, మధుమేహ బాధితులు తమ బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ని సాధారణ స్థాయిలో ఉంచడం చాలా ముఖ్యం. దీని కోసం మీరు ప్రతిరోజూ బ్లడ్‌షుగర్‌ని చెక్‌చేసుకోవటం మంచిది. మీ బ్లడ్‌ షుగర్‌లో ఎక్కువ తేడాను గమనించినట్టయితే, వెంటనే వైద్యులను సంప్రదించటం తప్పనిసరి.

(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..