ఛత్తీస్‌గఢ్ బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం.. సీఎంపై ఉత్కంఠకు తెరపడేనా..?
ఎన్నికల ప్రచార సమయంలోనే నరేంద్రసింగ్ తోమర్ సహా పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. కేంద్రమంత్రిగా ఉండి అసెంబ్లీ ఎన్నికల్లో తోమర్ పోటీ చేసి గెలిచారు. దాంతో తోమర్ పేరుతో సహా మరికొందరు పేర్లను అధిష్ఠానం పరిశీలిస్తుంది. మొత్తానికి ఈ మూడు రాష్ట్రాలకు వెళ్లిన పరిశీలకులు, ఇవాళ లేదా రేపటికల్లా అధిష్టానికి నివేదిక ఇవ్వనున్నారు. ఆపై సీల్డ్ కవర్‌లో సీఎం పేరును తీసుకెళ్లి ప్రకటించే అవకాశం ఉంది.
మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థులను మట్టికరిపించిన బీజేపీ… సీఎంలను ప్రకటించలేకపోతోంది. సీఎంల ఎంపిక కోసం బీజేపీ అధిష్ఠానం కేంద్ర పరిశీలకులను నియమించింది. రాజస్థాన్‌కు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్.. మధ్యప్రదేశ్‌కు హరియాణా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్, ఓబీసీ మోర్చా నేత కె.లక్ష్మణ్, ఛత్తీస్‌గఢ్‌కు కేంద్రమంత్రి అర్జున్ ముండాను నియమించింది. ఇక ఇవాళ ఛత్తీస్‌గఢ్ సీఎం రేస్‌లో రేణుకాసింగ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈమె ప్రస్తుతం కేంద్రమంత్రిగా ఉన్నారు. రేణుకతోపాటు మాజీ సీఎం రమణ్‌సింగ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అరుణ్ సాహూ, మాజీ బ్యూరోక్రాట్ ఓపీ చౌదరి, మాజీ కేంద్రమంత్రి విష్ణుదేవ్ సాయి కూడా రేస్‌లో ఉన్నారు.
రాజస్థాన్‌లో రెండుసార్లు సీఎంగా, వాజ్‌పేయి హయాంలో పనిచేసిన వసుంధరరాజేని కాదని కొత్త వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేయాలని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోంది. అందుకే ఈ సారి ఎన్నికలకు ముందు నుంచే ముఖ్యమంత్రి మార్పుపై బీజేపీ సంకేతాలు ఇచ్చింది. ఇక రాజస్థాన్ సీఎం రేసులో కొత్తగా తెరపైకి బాబా బాలక్‌నాథ్ పేరు వచ్చింది. ఈయనతోపాటు సీఎం రేసులో సీనియర్ బీజేపీ నేతలు దియా కుమారి, రాజ్యవర్థన్‌సింగ్ రాథోడ్, గజేంద్రసింగ్ షెకావత్, అర్జున్‌రామ్ మేఘ్‌వాల్ ఉన్నారు.
ఇక మధ్యప్రదేశ్‌లో 18 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా పనిచేశారు శివరాజ్ సింగ్ చౌహాన్. ఆయన హయాంలోనే మరోసారి భారీ మెజారిటీతో మధ్యప్రదేశ్‌లో బీజేపీ గెలిచింది. అయినప్పటికీ ముఖ్యమంత్రిని మార్చే ఆలోచనలో బీజేపీ అగ్రనాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అటు ఎన్నికల ప్రచార సమయంలోనే నరేంద్రసింగ్ తోమర్ సహా పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. కేంద్రమంత్రిగా ఉండి అసెంబ్లీ ఎన్నికల్లో తోమర్ పోటీ చేసి గెలిచారు. దాంతో తోమర్ పేరుతో సహా మరికొందరు పేర్లను అధిష్ఠానం పరిశీలిస్తుంది. మొత్తానికి ఈ మూడు రాష్ట్రాలకు వెళ్లిన పరిశీలకులు, ఇవాళ లేదా రేపటికల్లా అధిష్టానికి నివేదిక ఇవ్వనున్నారు. ఆపై సీల్డ్ కవర్‌లో సీఎం పేరును తీసుకెళ్లి ప్రకటించే అవకాశం ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..