Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

72 గంటలు కంటిన్యూగా నిద్రలేకపోతే ఏమవుతుందో తెలుసా..?

ఇది చిరాకు, ఏకాగ్రత కోల్పోవడం, విపరీతమైన ఒత్తిడి, కండరాల నొప్పి, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగటం వంటిది కలిగిస్తుంది. అలాగే, ఒక వ్యక్తి ఎంత మెలకువగా ఉంటే నిద్ర లేమి ప్రభావం అంత ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా 48 గంటలు నిరంతరం మేల్కొని ఉంటే, వారు చాలా అలసిపోతారు. వారు కళ్ళు తెరవడానికి కూడా బాధపడుతుంటారు.. వారి మెదడు మైక్రోస్లీప్ అని పిలువబడే పూర్తి అపస్మారక స్థితికి వెళ్లడం ప్రారంభమవుతుంది.

72 గంటలు కంటిన్యూగా నిద్రలేకపోతే ఏమవుతుందో తెలుసా..?
Without Sleep
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 09, 2023 | 2:10 PM

ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర చాలా అవసరం. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే, దీర్ఘాయుష్షు పొందాలంటే బాగా నిద్రపోవాలి. నిద్ర సరిగా లేకపోతే అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. నిద్రలేమిని నయం చేసే వైద్యం, ఔషధం ప్రపంచంలో ఏదీ లేదు. అందువల్ల, ఎల్లప్పుడూ తగినంత నిద్ర ఆరోగ్యకరమైన నిద్ర, శారీరక, మానసిక ఆరోగ్యానికి అవసరమైనదిగా చెబుతారు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం..18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పెద్దలు రాత్రికి కనీసం 7 గంటలు నిద్రపోవాలి. ఒక వ్యక్తి ఎంతకాలం నిద్ర లేకుండా జీవించగలడనేది ఇంకా స్పష్టంగా తెలియనప్పటికీ, చాలా మంది పని, ఒత్తిడి తదితర కారణాల వల్ల నిద్రలేమితో అవస్థలు పడుతుంటారు.

అయితే, కొందరు ప్రజలు ప్రజలు నిద్రపోకుండా మెలకువగా కూర్చొని రికార్డ్‌ క్రియేట్‌ చేస్తారని మీకు తెలుసా? దాదాపు 19 రోజులకు సమానమైన 453 గంటల 40 నిమిషాల పాటు మెలకువగా ఉండి ఓ వ్యక్తి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఒక వ్యక్తి తన శరీరానికి అవసరమైన దానికంటే తక్కువగా నిద్రపోతే..అతడికి నిద్రలేమి సంభవిస్తుంది. నిద్రలేమి ప్రభావం వ్యక్తికి వ్యక్తికి మారుతూ ఉంటుంది. అయితే ఒక వ్యక్తి 2 రాత్రులు (48 గంటలు), 3 రాత్రులు (72 గంటలు) నిద్రపోకపోతే ఏమవుతుందో తెలుసా?

చాలా మందిలో 24 గంటల పాటు మెలకువగా ఉన్న తర్వాత దుష్ప్రభావాలు కనిపించడం ప్రారంభిస్తాయి. 24 గంటలు మేల్కొన్న వ్యక్తిలో రక్తంలో BAC స్థాయి 0.10 శాతానికి సమానం. ఇది చిరాకు, ఏకాగ్రత కోల్పోవడం, విపరీతమైన ఒత్తిడి, కండరాల నొప్పి, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగటం వంటిది కలిగిస్తుంది. అలాగే, ఒక వ్యక్తి ఎంత మెలకువగా ఉంటే నిద్ర లేమి ప్రభావం అంత ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా 48 గంటలు నిరంతరం మేల్కొని ఉంటే, వారు చాలా అలసిపోతారు. వారు కళ్ళు తెరవడానికి కూడా బాధపడుతుంటారు.. వారి మెదడు మైక్రోస్లీప్ అని పిలువబడే పూర్తి అపస్మారక స్థితికి వెళ్లడం ప్రారంభమవుతుంది.

ఇవి కూడా చదవండి

నిద్ర లేకుండా 72 గంటల పాటు ఉంటే.. ఆ తర్వాత అలసట లక్షణాలు తీవ్రమవుతాయి. మూడు రోజుల పాటు నిద్ర లేకుండా ఉండటం వల్ల మనిషి మానసిక స్థితి, ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. మూర్ఛ, చిరాకు, ఇతరులతో మాట్లాడలేకపోవడం వంటి దుష్ప్రభావాలు కూడా కనిపిస్తాయి. ఒక వ్యక్తి స్థిరంగా తగినంత నిద్ర పొందకపోతే, వారు అధిక రక్తపోటు, ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు, డిప్రెషన్ వంటి సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి, ఏ పరిస్థితిలోనైనా తగినంత నిద్రపోవాలని గుర్తుంచుకోండి.

(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి..