Easy Tips For Acidity: ఎసిడిటీ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా..? తగ్గించుకోవడానికి చక్కటి మార్గాలు..
మన వంటగదిలో ఉండే కొన్ని పదార్ధాలతో ఎసిడిటీని నియంత్రించవచ్చు. ఎసిడిటికి కొత్తిమీర ఆకులను కూడా ఉపయోగించవచ్చు. దీని కోసం కాస్త కొత్తిమీర రసాన్ని.. నీళ్లలో లేదంటే మజ్జిగలోగానీ కలిపి తాగితే ఎసిడిటీ నుంచి వెంటనే ఉపశమనం పొందవచ్చు. కొత్తిమీర ఆకులతో తయారుచేసిన టీ కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. దీనివల్ల కడుపు ఉబ్బరం తగ్గుతుంది. అలాగే వాంతులు, విరేచనాలను తగ్గించడానికి కూడా ఇది బాగా పని చేస్తుంది.
ఎసిడిటి..ప్రస్తుతం చాలా మందిలో ఎసిడిటీ సమస్య ఎక్కువైపోయింది. మసాలా, వేయించిన ఆహారాలు, జంక్ ఫుడ్ వంటివి ఎక్కువగా తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. ఎసిడిటీతో తరచుగా గుండె, కడుపు, గొంతులో మంట వంటి సమస్యలు వస్తుంటాయి. మీకు గ్యాస్, ఎసిడిటీ, డయేరియా వంటి కడుపు సంబంధిత సమస్యలు వచ్చినప్పుడు.. దాని నుండి తక్షణ ఉపశమనం పొందడానికి ఇలాంటి ఇంటి నివారణలను ప్రయత్నించవచ్చు. దీంతో మీకు పూర్తి ఉపశమనం లభిస్తుంది. మన వంటగదిలో ఉండే కొన్ని పదార్ధాలతో ఎసిడిటీని నియంత్రించవచ్చు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
అల్లం
అల్లంలో జింజెరాల్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఎసిడిటీని నయం చేస్తుంది. మీకు కడుపు సమస్యలు ఉన్నప్పుడల్లా ఒక గ్లాసు నీటిలో అల్లం ముక్కను మరిగించి తాగొచ్చు.
జీలకర్ర
జీలకర్ర జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఎసిడిటీని నయం చేయడంలో సహాయపడతాయి. అసిడిటీ ఉంటే ఒక గ్లాసు నీటిలో ఒక టీస్పూన్ జీలకర్రను రెండు గంటల పాటు నానబెట్టి ఈ నీటిని తాగాలి.
పెరుగు
పెరుగులో జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచే ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇది వాపును కూడా తగ్గిస్తుంది. ఆహారంతో పాటు ఒక గ్లాసు పెరుగు తినడం వల్ల ఎసిడిటీ నుంచి ఉపశమనం పొందవచ్చు.
కొత్తిమీర
ఎసిడిటికి కొత్తిమీర ఆకులను కూడా ఉపయోగించవచ్చు. దీని కోసం కాస్త కొత్తిమీర రసాన్ని.. నీళ్లలో లేదంటే మజ్జిగలోగానీ కలిపి తాగితే ఎసిడిటీ నుంచి వెంటనే ఉపశమనం పొందవచ్చు. కొత్తిమీర ఆకులతో తయారుచేసిన టీ కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. దీనివల్ల కడుపు ఉబ్బరం తగ్గుతుంది. అలాగే వాంతులు, విరేచనాలను తగ్గించడానికి కూడా ఇది బాగా పని చేస్తుంది.
తేనె
గ్లాస్ నీళ్లలో టీస్పూన్ తేనె కలిపి తాగితే కూడా ఎసిడిటీ నుంచి ఉపశమనం పొందొచ్చు. అయితే ఈ మిశ్రమానికి కొంచెం నిమ్మరసం కలిపి తాగితే కడుపులో పుల్లని త్రేన్పులకు కారణయ్యే ఆమ్లాలను కూడా తగ్గిస్తుంది.
తులసి
తులసి అసిడిటీని తటస్థీకరిస్తుంది. తులసి ఆకులను నమలడం లేదా నీటిలో మరిగించి టీ తాగడం వల్ల జీర్ణ సమస్యల నుండి త్వరగా ఉపశమనం లభిస్తుంది.
పాలు
ఎసిడిటి కారణంగానే వచ్చే పుల్లని త్రేన్పులకు పాలు చక్కటి విరుగుడుగా పని చేస్తాయి. గోరు వెచ్చని పాలు ఎసిడిటీకి తక్షణ ఉపశమనాన్ని కలిగిస్తాయి. పాలు సహజ యాంటాసిడ్‌లా పని చేస్తాయి. పాలల్లో కాల్షియం అధికంగా ఉండటంతో అది యాసిడ్‌ను వెంటనే తగ్గించగలుతుంది.
(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..