Fruits Storage: ఈ రకమైన పండ్లను అస్సలు ఫ్రిజ్‌లో స్టోర్ చేయకండి..! ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
ప్రస్తుతం ఇప్పుడున్న ఉరుకుల పరుగుల లైఫ్ కారణంగా.. ప్రత్యేకంగా శరీరం గురించి శ్రద్ధ తీసుకోవడం కూడా కష్టంగా మారుతుంది. దీంతో సరైన ఆహారం తీసుకోక పోవడం వల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. దానికి తోడు ఎలక్ట్రికల్ లైఫ్ పరంగా కూడా అనేక రకమైన మార్పులు జరుగుతున్నాయి. రిఫ్రిజిలేటర్లు వచ్చాక అన్ని రకాల వస్తువులు ఇప్పుడు అందులోకే వెళ్లి పోతున్నాయి. అదీ ఇదీ అనే తేడా లేకుండా అన్నీ ఫ్రిజ్ లోనే పెట్టేస్తున్నారు. ఈ రకంగా ఫ్రిజ్ లో..

ప్రస్తుతం ఇప్పుడున్న ఉరుకుల పరుగుల లైఫ్ కారణంగా.. ప్రత్యేకంగా శరీరం గురించి శ్రద్ధ తీసుకోవడం కూడా కష్టంగా మారుతుంది. దీంతో సరైన ఆహారం తీసుకోక పోవడం వల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. దానికి తోడు ఎలక్ట్రికల్ లైఫ్ పరంగా కూడా అనేక రకమైన మార్పులు జరుగుతున్నాయి. రిఫ్రిజిలేటర్లు వచ్చాక అన్ని రకాల వస్తువులు ఇప్పుడు అందులోకే వెళ్లి పోతున్నాయి. అదీ ఇదీ అనే తేడా లేకుండా అన్నీ ఫ్రిజ్ లోనే పెట్టేస్తున్నారు. ఈ రకంగా ఫ్రిజ్ లో కొన్ని రకాల పండ్లు పెట్టడం వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ రకమైన పండ్లను ఫ్రిజ్ లో పెట్టడం వల్ల పలు వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరి ఏ రకమైన పండ్లను ఫ్రిజ్ లో పెట్టకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
పుచ్చకాయ:
సమ్మర్ వచ్చిందంటే ఎవరి ఫ్రిజ్ లో చూసినా పుచ్చకాయలే దర్శనం ఇస్తాయి. ఈ పండును అందరూ ఇష్టంగా తింటారు. చవకగా ఒకేసారి తీసుకొచ్చి ఫ్రిజ్ లలో స్టోర్ చేస్తూ ఉంటారు. ఇలా రిఫ్రిజిరేటర్ లో వాటర్ మిలన్ పెట్టడం వలన.. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు పాడై పోతాయి. పుచ్చకాయను కట్ చేసి ఓ నాలుగు గంటల వరకూ పెట్టొచ్చు కానీ.. అంతకు మించి పెడితే పలు అనారోగ్య సమస్యలు వస్తాయి.
అరటి పండ్లు:
చిన్న పిల్లల దగ్గరి నుంచి పెద్దల వరకూ ఇష్టంగా తినే వాటిల్లో అరటి పండు కూడా ఒకటి. వీటి ధర కూడా చాలా తక్కువ. అరటి పండులో ఉండే పోషకాలు అన్నీ ఇన్నీ కావు. అయితే అరటి పండును ఫ్రిజ్ లో పెడితే.. రిఫ్రిజి రేటర్ అంతా బనానా స్మెల్ వస్తుంది. అంతే కాకుండా అరటి పళ్లు నల్లగా మారి పోతాయి. అవి కలర్ మారడం వల్ల ఇథలీన్ గ్యాస్ బయటకు వచ్చి.. ఫ్రిజ్ లో ఉండే మిగిలిన పండ్లు, కూరగాయలు కూడా త్వరగా మగ్గి పోతాయి. బనానా ఫ్రిజ్ లో పెట్టడం వల్ల అరటి పండు సమస్యలు కూడా వస్తాయి.
యాపిల్:
యాపిల్ ను కూడా కొందరు ఫ్రిజ్ లోనే పెట్టేస్తారు. ఫ్రిజ్‌లో ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అనుకుంటారు కానీ.. ఇలా యాపిల్ ను ఫ్రిజ్ లో పెట్టడం వల్ల అందులో ఉండే క్రియాశీల ఎంజైమ్స్ పాడైపోతాయి. ఆ తర్వాత యాపిల్ తిన్నా వేస్ట్ అని నిపుణులు చెబుతున్నారు. యాపిల్స్ బయట ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే.. కాగితంలో చుట్టి పెట్టండి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.