Health: మీరూ కూల్ డ్రింక్స్ తాగుతారా.? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..
ఇదిలా ఉంటే డబ్బులు పెట్టుకొని తాగే ఈ కూల్ డ్రింక్స్ వల్ల శరీరానికి ఏమైలా మేలు జరుగుతుందా.? అంటే కచ్చితంగా లేదనే సమాధానం వస్తుంది. మేలు పక్కన పెడితే వీటివల్ల కలిగే దుష్ఫ్రభావాలే ఎక్కువ. ఇందులో కలిపే ఎలిమెంట్స్ ద్వారా కూల్ డ్రింక్స్‌కు రుచి వస్తుంది కానీ శరీరానికి జరిగే లాభం శూన్యం. ఇక కూల్ డ్రింక్స్ నిత్యం తీసుకోవడం వల్ల అధిక బరువు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు...
కూల్ డ్రింక్స్ తాగని వారు చాలా తక్కువ మంది ఉంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ఈ డ్రింక్స్‌కు అలవాటుపడుతున్నారు. కూల్ డ్రింక్స్ మార్కెట్ పెరగడం, మారుమూల గ్రామాల్లో సైతం అందుబాటులోకి రావడంతో చాలా మంది వీటికి ఆకర్షితులవుతున్నారు. ఇక బ్రాండింగ్ కూడా వీటి వినియోగానికి ఇన్‌డైరెక్ట్‌గా ఒక కారణంగా మారుతోంది.
ఇదిలా ఉంటే డబ్బులు పెట్టుకొని తాగే ఈ కూల్ డ్రింక్స్ వల్ల శరీరానికి ఏమైలా మేలు జరుగుతుందా.? అంటే కచ్చితంగా లేదనే సమాధానం వస్తుంది. మేలు పక్కన పెడితే వీటివల్ల కలిగే దుష్ఫ్రభావాలే ఎక్కువ. ఇందులో కలిపే ఎలిమెంట్స్ ద్వారా కూల్ డ్రింక్స్‌కు రుచి వస్తుంది కానీ శరీరానికి జరిగే లాభం శూన్యం. ఇక కూల్ డ్రింక్స్ నిత్యం తీసుకోవడం వల్ల అధిక బరువు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
కూల్ డ్రింక్స్‌లో ఫ్రక్టోజ్, కార్న్ సిరప్ వంటి చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. వీటిలో పోషకాలకు బదులు క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. దీంతో ఊబకాయం సమస్య వచ్చే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కూల్ డ్రింక్స్‌లో ఉండే చక్కెరల వల్ల టైప్-2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కూల్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇక కూల్ డ్రింక్స్‌లో యాసిడ్‌లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి దంతాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. పళ్లు పచ్చగా మారడానికి ఇదే కారణంగా చెప్పొచ్చు. కూల్ డ్రింక్స్‌లోని యాసిడ్ కారణంగా పంటి ఎనామిల్ కూడా దెబ్బతింటుంది. అలాగే సోడా నోటీలోని బ్యాక్టీరియా ప్రమాదాన్ని పెంచుతుంది. దీంతో చిగుళ్‌లు వాచిపోవడం, చిగుళ్ల నుంచి రక్తం రావడం వంటి సమస్యలు వస్తాయి. ఇక సోడాలో ఉండే ఫాస్పోరిక్ యాసిడ్ వల్ల శరీరంలో కాల్షియం లోపం ఏర్పడుతుంది. దీంతో ఎముకలు బలహీనమవుతాయి.
దీర్ఘకాలంగా కూల్ డ్రింక్స్ తీసుకుంటే బోలు ఎముక వ్యాధి వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా హైపీపీ, గుండె జబ్బులకు కూడా దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇక కూల్ డ్రింక్స్ మోతాదుకు మించి తీసుకుంటే.. కాలేయం, జీర్ణ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని, ఫ్యాటీ లివర్ ముప్పు పెరుగుతుందని సూచిస్తున్నారు.
నోట్: పైన తెలిపిన విషయాలు పలువురు నిపుణులు చెప్పిన అభిప్రాయాల మేరకు అందించడం జరిగింది. వైద్యానికి సంబంధించి నిపుణులు సూచనలు పాటించాలి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం క్లిక్ చేయండి..