Kitchen Hacks: కసూరి మేతిని ఇలా ఇంట్లోనే తయారు చేసుకుంటే.. ఏడాదంతా వాడుకోవచ్చు!

కసూరి మేతి.. చాలా మందికి దీని గురించి తెలిసే ఉంటుంది. కసూరి మేతిని ఎక్కువగా మసాలా కూరలు, బిర్యానీలు, నాన్ వెజ్ కూరల్లో వేసేందుకు ఉపయోగిస్తూ ఉంటారు. కసూరి మేతీతో కూర టేస్టే మారి పోతుంది. ఎలాంటి కూరల్లో అయినా కసూరి మేతిని హ్యాపీగా వేసుకోవచ్చు. చాలా మంది దీన్ని మార్కెట్లో కొంటూ ఉంటారు. కానీ నిజానికి దీన్ని ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. అంతే కాకుండా ఇది సంవత్సరం పాటు నిల్వ కూడా ఉంటుంది. దీని కోసం పెద్దగా కష్ట పడాల్సిన పని..

Kitchen Hacks: కసూరి మేతిని ఇలా ఇంట్లోనే తయారు చేసుకుంటే.. ఏడాదంతా వాడుకోవచ్చు!
Kasuti Methi
Follow us
Chinni Enni

| Edited By: Ram Naramaneni

Updated on: Dec 09, 2023 | 9:13 PM

కసూరి మేతి.. చాలా మందికి దీని గురించి తెలిసే ఉంటుంది. కసూరి మేతిని ఎక్కువగా మసాలా కూరలు, బిర్యానీలు, నాన్ వెజ్ కూరల్లో వేసేందుకు ఉపయోగిస్తూ ఉంటారు. కసూరి మేతీతో కూర టేస్టే మారి పోతుంది. ఎలాంటి కూరల్లో అయినా కసూరి మేతిని హ్యాపీగా వేసుకోవచ్చు. చాలా మంది దీన్ని మార్కెట్లో కొంటూ ఉంటారు. కానీ నిజానికి దీన్ని ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. అంతే కాకుండా ఇది సంవత్సరం పాటు నిల్వ కూడా ఉంటుంది. దీని కోసం పెద్దగా కష్ట పడాల్సిన పని కూడా లేదు. చాలా సింపుల్. మరి ఇంట్లోనే సింపుల్ గా కసూరి మేతిని ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం.

కసూరి మేతి తయారీ విధానం:

కసూరి మేతిని మెంతి ఆకులతోనే తయారు చేస్తారు. ఇది రెడీ చేయడానికి ముందు మంచి మెంతి కూరను తీసుకుకొచ్చి.. శుభ్రంగా కడిగి పక్కన పెట్టు కోవాలి. ఇప్పుడు ఈ మెంతి కూరను.. ఉప్పు వేసిన నీటిలో ఓ అరగంట పాటైనా ఉంచాలి. ఇలా చేస్తే మెంది కూరలో ఉండే క్రిములు, రసాయనాలు వంటివి ఏమైనా ఉంటే పోతాయి.

ఓవెన్ లో కూడా వేడి చేసుకోవచ్చు..

తర్వాత ఈ ఆకును తీసుకుని నీళ్లు పారబోసి.. పొడి వస్త్రం మీద వేసి నీరంతా పీల్చుకునేలా నొక్కాలి. ఆకుల్లో ఉండే తడి మొత్తం పోయేలా.. ఎండలో మూడు రోజుల పాటు ఆర బెట్టాలి. ఆ వేడికి ఈ ఆకులు బాగా పొడిగా మారతాయి. ఎండలో పెట్టడం వల్ల ఆకును నొక్కలాగే పొడిలా మారి పోతుంది. ఇది శ్రమగా ఫీల్ అయ్యే వారు ఓవెన్ లో అయినా హీట్ చేయవచ్చు. లేదా పెనం వేడి చేసి.. దానిపై ఆకులను వేడి చేయాలి.

ఇవి కూడా చదవండి

ఇలా చేస్తే ఆకులు పొడిగా మారి పోతాయి. అంతే కసూరి మేతి రెడీ. దీన్ని గాలి తగలని ఓ గాజు సీసా లేదా డబ్బాలో స్టోర్ చేయాలి. ఇలా ఒక్కసారి చేస్తే ఏడాదంతా దీన్ని వాడు కోవచ్చు. లేదంటే కొద్ది మొత్తంలో కూడా చేసుకోవచ్చు. మధ్య మధ్యలో ఈ కసూరి మేతిని ఎండలో పెడితే.. పురుగు పట్టకుండా ఉంటుంది. ఇలా ఎంతో సింపుల్ గా ఇంట్లోనే కసూరి మేతిని తయారు చేసుకోవచ్చు. కసూరి మేతితో కేవలం రుచి మాత్రమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.