తెల్లని బట్టలపై పసుపు మరకలా..? కష్టపడకండి..! కేవలం ఈ చిన్న ట్రిక్ తో పాలలా మెరిసిపోతాయ్..

తెల్లని బట్టలపై ఏర్పడ్డ పసుపు రంగు మరకలను తొలగించడానికి ఎక్కువ మంది వాషింగ్‌మెషిన్‌లో కాకుండా చేతులతో ఉతుకుతూ తెగ కష్టపడుతుంటారు. మంచి ఖరీదైన డిటర్జెంట్లు ఉపయోగిస్తారు. గంటల తరబడి సర్ఫ్‌లో నానబెట్టి, సబ్బు, బ్రెష్‌తో రుద్ది రుద్ది చేతులు కూడా అరిగిపోయేలా కష్టపడుతుంటారు. కానీ బట్టల మెరుపు తిరిగి రాదు. అటువంటి పరిస్థితిలో చాలా చవకగా లభించే కాస్టిక్ సోడా.. మీ తెల్లని దుస్తులను నిమిషాల్లో ప్రకాశింపజేస్తుంది.. కాస్టిక్ సోడా అంటే ఏమిటి..?

తెల్లని బట్టలపై పసుపు మరకలా..? కష్టపడకండి..! కేవలం ఈ చిన్న ట్రిక్ తో పాలలా మెరిసిపోతాయ్..
Yellow Stains On White Clot
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 10, 2023 | 9:06 AM

ఏదైనా ప్రత్యేక సందర్భంలో తెల్లని దుస్తులు ధరించడం వల్ల చాలా ఆకర్షణీయంగా కనిపిస్తారు. అందుకే చాలా మంది తెల్లటి దుస్తులు ధరించడానికి ఇష్టపడతారు. కానీ, తెల్లటి దుస్తులు త్వరగా రంగు మారుతుంటాయి. కాలర్‌, చేతుల కింద ఈజీగా పసుపు రంగు మరకలుగా ఏర్పడుతుంటాయి. ఆ మరకలను తొలగించడం అంత తేలికైన పని కాదు. నానా తంటాలు పడాల్సి వస్తుంది. తెల్లని బట్టలపై ఏర్పడ్డ పసుపు రంగు మరకలను తొలగించడానికి ప్రజలు వివిధ రకాల ఖరీదైన వస్తువులను ఉపయోగిస్తుంటారు. అలాంటి దుస్తులను ఎక్కువ మంది వాషింగ్‌మెషిన్‌లో కాకుండా చేతులతో ఉతుకుతూ తెగ కష్టపడుతుంటారు. మంచి ఖరీదైన డిటర్జెంట్లు ఉపయోగిస్తారు. గంటల తరబడి సర్ఫ్‌లో నానబెట్టి, సబ్బు, బ్రెష్‌తో రుద్ది రుద్ది చేతులు కూడా అరిగిపోయేలా కష్టపడుతుంటారు. కానీ బట్టల మెరుపు తిరిగి రాదు. అటువంటి పరిస్థితిలో చాలా చవకగా లభించే కాస్టిక్ సోడా.. మీ తెల్లని దుస్తులను నిమిషాల్లో ప్రకాశింపజేస్తుంది.. కాస్టిక్ సోడా అంటే ఏమిటి..? దానిని ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం.

కాస్టిక్ సోడా అంటే ఏమిటి..?

కాస్టిక్ సోడా అనేది సోడా యాష్ అని కూడా పిలువబడే ఒక అకర్బన సమ్మేళనం. కాస్టిక్ సోడా అనేక ఇతర ప్రయోజనాల కోసం కూడా ఉపయోగిస్తారు. ఇది ఘన, ద్రవ రూపాల్లో వస్తుంది. ఇది మార్కెట్‌లో అతి తక్కువ ధరకే లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఎలా ఉపయోగించాలి..

ముందుగా, ఒక బకెట్ లేదా టబ్‌లో కావాల్సినన్ని నీళ్లు తీసుకోవాలి.. దానికి రెండు-మూడు చెంచాల కాస్టిక్ సోడా కలపండి. చెక్క కర్ర సహాయంతో ఈ మిశ్రమాన్ని బాగా కలపండి. ఇప్పుడు అందులో తెల్లటి బట్టలు వేసి రెండు మూడు గంటల పాటు నాననివ్వాలి. తరువాత సబ్బుతో బట్టలు శుభ్రం చేయండి. ఇలా చేయడం వల్ల చిటికెలో మరకలు తొలగిపోతాయి.

ఈ విషయాలను గుర్తుంచుకోండి:

కాస్టిక్ సోడాను ఉపయోగించినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది చర్మానికి, కళ్ళకు హానికరం. కాబట్టి వాటిని ఉపయోగిస్తున్నప్పుడు తప్పక గ్లౌజులు, సేఫ్టీ గ్లాసెస్ ధరించండి. ఇది కాకుండా, క్రింద పేర్కొన్న ఈ విషయాలను గుర్తుంచుకోండి

– నీటిలో కాస్టిక్ సోడా కలిపితే నీరు వేడెక్కుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.

– చల్లటి నీటిలో కాస్టిక్ సోడా కలపవద్దు. ఎల్లప్పుడూ వేడి నీటిలో మాత్రమే కలపండి.

– కాస్టిక్ సోడా ఉపయోగించిన తర్వాత, బకెట్, ఇతర కంటైనర్లను పూర్తిగా శుభ్రం చేయండి.

కాస్టిక్ సోడా అన్ని మరకలను తొలగిస్తుందా..?

కాస్టిక్ సోడా అన్ని మరకలను తొలగించదు. కానీ, ఇది చాలా మరకలను సులభంగా తొలగించడంలో సహాయపడుతుంది. మీ బట్టలపై బలంగా ఏర్పడ్డ పసుపు రంగు మరకలు తొలగిపోవాలంటే మీరు కాస్టిక్ సోడాతో పాటు ఇతర పద్ధతులను కూడా ట్రై చేయొచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..