Nagarjuna Sagar Dam: నేటితో 69వ వసంతంలోకి ఆధునిక దేవాలయం.. నాగార్జుసాగర్ డ్యాం

తెలుగు రాష్ట్రాలను అన్నపూర్ణగా తీర్చిదిద్దిన ఈ మహా కట్టడం మహోన్నతమైన మానవ ప్రయత్నానికి మరుపురాని నివాళిగా నిలుస్తోంది. కరువు కాటకాలతో అల్లాడుతున్న రాష్ట్రానికి సాగునీటి ప్రాజెక్టు అవసరమని భావించి నల్లగొండ జిల్లా నందికొండ వద్ద కృష్ణానదిపై ప్రాజెక్టు నిర్మాణానికి అప్పటి పాలకులు నడుం బిగించారు. ఇంతటి అపురూపమైన ఈ ప్రాజెక్టుకు సరిగ్గా 69 ఏళ్ల క్రితం అప్పటి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ 1955 డిసెంబర్ 10వ తేదీన నాగార్జునసాగర్ వద్ద శంకుస్థాపన చేశారు.

Nagarjuna Sagar Dam: నేటితో 69వ వసంతంలోకి ఆధునిక దేవాలయం.. నాగార్జుసాగర్ డ్యాం
Nagarjuna Sagar Dam
Follow us

| Edited By: Surya Kala

Updated on: Dec 10, 2023 | 8:50 AM

మానవమేదో వికాసానికి ప్రతీక. భారత దేశ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి అత్యుత్తమ కీర్తి చంద్రిక. శ్రమ శక్తిని రుజువు చేసిన కరదీపిక. తెలుగు రాష్ట్రాలను అన్నపూర్ణగా పైరు పచ్చలతో సింగారించిన అద్భుత నిర్మాణ సౌధం నాగార్జునసాగర్ ప్రాజెక్టు. అసమానమైన రాతి కట్టడంగా రూపు దాల్చిన శ్రమ సౌధం. లక్షల మంది శ్రేయాన్ని అక్షయనం చేసిన శిలాక్షరమైన ఈ నవ దేవాలయానికి (డిసెంబర్ 10వ తేదీ) నేటితో 68 ఏళ్లు నిండి 69వ వడి లోకి అడుగపెట్టింది.

తెలుగు రాష్ట్రాలను అన్నపూర్ణగా తీర్చిదిద్దిన ఈ మహా కట్టడం మహోన్నతమైన మానవ ప్రయత్నానికి మరుపురాని నివాళిగా నిలుస్తోంది. కరువు కాటకాలతో అల్లాడుతున్న రాష్ట్రానికి సాగునీటి ప్రాజెక్టు అవసరమని భావించి నల్లగొండ జిల్లా నందికొండ వద్ద కృష్ణానదిపై ప్రాజెక్టు నిర్మాణానికి అప్పటి పాలకులు నడుం బిగించారు. ఇంతటి అపురూపమైన ఈ ప్రాజెక్టుకు సరిగ్గా 69 ఏళ్ల క్రితం అప్పటి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ 1955 డిసెంబర్ 10వ తేదీన నాగార్జునసాగర్ వద్ద శంకుస్థాపన చేశారు.

ఆనాటి ఆలోచన.. నేటీ సాగర్ జలాశయం..

1900 సంవత్సరం నుంచి కృష్ణానదిపై రిజర్వాయర్ నిర్మించాలనే ఆలోచన నాటి బ్రిటిష్ పాలకులకు కలిగింది. కృష్ణా జలాలు సద్వినియోగం చేసుకోవాలని తొలి నుంచి జగ్గయ్యపేట ప్రాంతానికి చెందిన ముక్త్యాల రాజా ప్రయత్నాలు ప్రారంభించారు. ఆకలి చావులు, కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆహారోత్పత్తిలో స్వయంసమృద్ధి సాధించాలని నవభారత నిర్మాత, తొలి భారత ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రు నిర్ణయించారు. ఇందుకోసం తొలి పంచవర్ష ప్రణాళిక నుంచే సాగునీటి పథకాలు, వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అందులో భాగంగానే దక్షిణాదిన నాగార్జునసాగర్ కు శ్రీకారం చుట్టారు

ఇవి కూడా చదవండి

ప్రపంచంలోనే అతిపెద్ద మానవ నిర్మిత రాతి కట్టడం..

1955 డిసెంబర్ 10వ తేదీ నుంచి రోజుకు 45 వేల మంది 12 ఏళ్ల పాటు శ్రమించారు. మొత్తం 19 కోట్ల 71 లక్షల మంది ఈ మహా యజ్ఞంలో పాలుపంచుకుని ప్రపంచంలోనే అతి పెద్ద మానవ నిర్మితమైన కట్టడాన్ని ఆవిష్కరించారు. దీన్ని 1964లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ కాలువలకు నీటిని విడుదల చేసి జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి మొత్తం 98 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చయింది. ఇప్పుడైతే వేలకోట్ల రూపాయలు వెచ్చించిన సాధ్యం కాని పని.

ఆధునిక దేవాలయంగా.. నాగార్జుసాగర్..

భారత తొలిప్రధాని పండిట్ జనహర్ లాల్ నెహ్రు శంకుస్థాపన చేసిన సందర్భంలో నాగార్జున సాగర్ ను ‘ఆధునిక దేవాలయంగా’ అభివర్ణించారు. ధాన్యాగారంగా విరాజిల్లి, ఆహారోత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించి, గ్రామీణ ఆర్థిక, సాంస్కృతిక వికాసానికి తోడ్పడింది. వ్యవసాయాభివృద్ధికి, దాని ద్వారా గ్రామీణ ఆర్ధిక వికాసానికి సాగర్ జలాశయంతో బీజం పడింది.

ప్రాజెక్టు ప్రత్యేకతలు..

ఈ ప్రాజెక్టు ప్రత్యేకతలు అన్నీ ఇన్ని కావు. ప్రపంచంలోనే అతిపెద్ద రాతి కట్టడంగా ఉన్న ఈ ప్రాజెక్టు 110 చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగిన జలాశయం ఉంది. గరిష్ట నీటి సాయి మట్టం 590 అడుగులతో 408 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించారు. మొత్తం ఆనకట్ట 5 కిలోమీటర్ల పొడవు కాగా, ప్రధాన డ్యాం 1.7 కిలోమీటర్లు, కుడి ఎర్త్ డ్యాం 1.8 కిలోమీటర్లు, ఎడమ ఎర్త్ డ్యాం 2.5 కిలోమీటర్లు ఉంది. 26 క్రస్ట్ గేట్లతో అద్భుతంగా నిర్మించారు. ప్రపంచంలోనే అత్యధిక డిశ్చార్జి సామర్ధ్యం కలిగిన కాలువగా కుడి కెనాల్ కు పేరుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో కట్టిన ఈ ప్రాజెక్టు దేశంలోని ప్రాజెక్టులకు తల్లి లాంటిది.

22 లక్షల ఎకరాలకు సాగునీరు..

తెలుగు రాష్ట్రాల్లోని ఐదు జిల్లాల్లో కుడి, ఎడమ కాలువల ద్వారా 22 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. ఈ ప్రాజెక్టు తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది ఎకరాలకు సాగునీరు.. వేలాది గ్రామాలకు తాగునీరు అందిస్తోంది. కోట్ల గొంతుకలను తడుపుతున్న బహుళార్థ సాధక ప్రాజెక్టు ఇది. హైలెవల్‌, లోలెవల్‌ కెనాల్‌ ద్వారా మరిన్ని ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. ప్రాజెక్టులో అంతర్భాగమైన ఎఎమ్మార్పీ ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ జంట నగరాలతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 600గ్రామాలకు తాగునీరు అందిస్తుంది.

తెలుగు రాష్ట్రాలకు విద్యుత్ వెలుగులు..

తెలుగు రాష్ట్రాలకు వరప్రదాయినిగా కాకుండా విద్యుత్ వెలుగులను కూడా అందిస్తోంది. బహుళార్థ సాధక ప్రాజెక్టుగా ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్ట్.. సాగు, తాగు నీరే కాదు తెలుగు రాష్ట్రాలకు విద్యుత్తు వెలుగులను కూడా విరిజిమ్ముతోంది. ఇది జాతీయ గ్రిడ్‌కు విద్యుత్ ఉత్పత్తికి కూడా మూలం. కుడి కాలువ విద్యుత్తు కేంద్రం ద్వారా 90యూనిట్లు, ఎడమ కాలువ ద్వారా 60యూనిట్లు విద్యుత్తు, మెయిన్‌ పవర్‌ హౌజర్‌ నుంచి 815మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి జరుగుతుంది.

చారిత్రాక ప్రాంతంలో సాగర్ నిర్మాణం..

నాగార్జున కొండ ప్రాంతంలో ఒకనాడు నెలకొన్న విజయపురి పట్టణం జలాశయంలో అంతర్భాగమైనప్పటికీ నేడు చారిత్రిక, ఆధ్యాత్మిక కేంద్రంగా ఉపయోగపడుతోంది. బుద్ధ భగవానుడి సందేశం.. ఆచార్య నాగార్జునుడి బోధనలతో ఈ ప్రాంతం చారిత్రాకంగా ప్రాధాన్యత ఏర్పింది. సాగర్ నిర్మాణ త్రవ్వకాల్లో అనేక బౌద్ద చరిత్ర ఆనవాళ్లు,30 బౌద్ధ విహారాలు, దేవాలయాలు, విగ్రహాలు వెలుగుచూడగా వాటిని సాగర్ కొండపై మ్యూజియంలో కొలువుతీర్చారు

సిరులు పండిచుకున్న రైతులు..

జలాశయం నిర్మాణం తర్వాత అన్ని రంగాలలోనూ రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి, ప్రజల జీవన నాగరికత, సుఖ సంతోషాలకు నాగార్జునసాగర్ ప్రాజెక్టు దోహదపడింది. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఆయకట్టు రైతులు సిరులు పండించు కున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణం తర్వాతే నోట్లోకి నాలుగు వేళ్లు వెళ్లాయని రైతులు చెబుతున్నారు. కరువు కాటకాలతో అల్లాడుతున్న తమకు ఈ ప్రాజెక్టు దేవాలయంగా మారిందని రైతులు చెబుతున్నారు. ప్రాజెక్టు వల్లే అన్నం మెతుకులు తింటున్నామని దేశానికి అన్నం పెడుతున్నామని ఆయకట్టు రైతులు చెబుతున్నారు

ప్రపంచ పర్యాటక కేంద్రంగా నాగార్జునసాగర్..

ఇది ఒక ప్రపంచ పర్యాటక కేంద్రం. ప్రాజెక్టును చూడటానికి ప్రపంచంలోని పర్యాటకులు వస్తుంటారు. వానాకాలంలో కృష్ణమ్మ సోయగాలను తిలకించేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ప్రపంచంలోనే అతిపెద్ద మానవ నిర్మిత కట్టడం గా ఉన్న ఈ డ్యాంను చూసేందుకు పర్యాటకులు ఇష్టపడుతుంటారు. సాగర జలాల్లో తేడాతో సాగే బోట్ ప్రయాణం పర్యాటకులను ఎంతో ఆహ్లాద పరుస్తుంది. ఆచార్య నాగార్జున నేల ఇది. సాగర్ రిజర్వాయర్ మధ్యలో ఉన్న నాగార్జునకొండ మ్యూజియాన్ని, సాగర్ లోని బుద్ధవనాన్ని తిలకించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి బౌద్ధ సన్యాసులు బౌద్ధులు వస్తుంటారు.

ప్రస్తుతం జలవివాదాలకు కేంద్రంగా..

వర్షాభావ పరిస్థితులు ఏర్పడిన ప్రతిసారి తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలకు కేంద్రంగా నాగార్జునసాగర్ ప్రాజెక్టు మారుతోంది. కృష్ణా జలాల పంపిణీ, ప్రాజెక్టు పర్యవేక్షణ, నిర్వహణ విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతోంది. అప్పుడప్పుడు ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Weekly Horoscope: ఒత్తిళ్లు, సమస్యల నుంచి వారికి ఉపశమనం..
Weekly Horoscope: ఒత్తిళ్లు, సమస్యల నుంచి వారికి ఉపశమనం..
పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?