Sri kakulam: వివాహ విందులో ఫుడ్ పాయిజన్.. ఒక మహిళ మృతి.. ఆరుగురుకి తీవ్ర అస్వస్థత..
శ్రీకాకుళం జిల్లాలోని మందస మండలం పెద్దబొడ్లూరులో పెళ్లింట విషాదం నెలకొంది. గ్రామంలో గురువారం వివాహం జరుగగా.. శుక్రవారం రాత్రి మగపెళ్లివారు నిర్వహించిన రిసెప్షన్ లో ఫుడ్ పాయిజన్ తీవ్ర కలకలం సృష్టించింది. పెళ్లి వేడుకలో విందు భోజనాలు వికటించి ఏడుగురు అస్వస్థతకు గురయ్యారు. బాధితులను గ్రామస్తులు హుటాహుటిన హరిపురం సామాజిక ఆరోగ్య కేంద్రంకి తరలించి చికిత్స అందించారు.
ఎంతో సందడిగా సాగుతున్న వివాహ రిసెప్షన్ లో హఠాత్తుగా విషాదం నెలకొంది. విందు తిన్న కొందరు ఆహుతులు అస్వస్ధత పాలైయ్యారు. చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. ఈ విషాద ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని మందస మండలం పెద్దబొడ్లూరులో పెళ్లింట విషాదం నెలకొంది. గ్రామంలో గురువారం వివాహం జరుగగా.. శుక్రవారం రాత్రి మగపెళ్లివారు నిర్వహించిన రిసెప్షన్ లో ఫుడ్ పాయిజన్ తీవ్ర కలకలం సృష్టించింది. పెళ్లి వేడుకలో విందు భోజనాలు వికటించి ఏడుగురు అస్వస్థతకు గురయ్యారు.
బాధితులను గ్రామస్తులు హుటాహుటిన హరిపురం సామాజిక ఆరోగ్య కేంద్రంకి తరలించి చికిత్స అందించారు. వీరిలో మందస మండలం భేతాళపురం గ్రామానికి చెందిన తెప్పల జానకమ్మ ( 35 ) పరిస్థితి విషమించడంతో ప్రాథమిక చికిత్స అనంతరం శ్రీకాకుళం లోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కు తరలించారు. అయితే మార్గమధ్యలో ఆమె మృతి చెందినట్లు ఆస్పత్రి వైద్య వర్గాలు తెలిపాయి. మరో ఆరుగురి పరిస్థితి నిలకడగా ఉందని హరిపురం పీహెచ్ సి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రకాశ వర్మ వెల్లడించారు.
మొత్తానికి పెళ్లి విందు తీవ్ర విషాదం నింపింది. ఎంతో ఆనందంగా జరుపుకోవాలల్సిన వేడుక అందరినీ కన్నీటి పర్యంతం చేసింది. ఈ విషయం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..