Andhra Pradesh: విజన్‌ 2024.. మిషన్‌ 175.. 50 మందితో తొలి జాబితా సిద్ధం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు?

AP Assembly Elections 2024: విజన్‌ 2024.. మిషన్‌ 175.. వచ్చే ఎన్నిక‌ల కోసం అభ్యర్థుల ఎంపిక‌పై ఫోకస్ పెట్టింది టీడీపీ. 50 మందితో జనవరిలో తొలి జాబితా విడుదలకు సిద్దం అనే టాక్‌ విన్పిస్తోంది. చంద్రబాబు టిక్‌ పెట్టిన ది బెస్ట్‌ 50లో చోటు దక్కేది ఎవరికి? వేటు ఎవరిపై? జనసేనతో సర్దుబాటు ఎక్కడెక్కడ? ఏపీ పాలిటిక్స్‌లో లిస్ట్‌ పే చర్చ జోరందుకుంది.

Andhra Pradesh: విజన్‌ 2024.. మిషన్‌ 175.. 50 మందితో తొలి జాబితా సిద్ధం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు?
Ap Assembly Election 2024
Follow us

|

Updated on: Dec 10, 2023 | 7:30 AM

2024 Andhra Pradesh Legislative Assembly Election: వచ్చే ఎన్నిక‌ల కోసం అభ్యర్థుల ఎంపిక‌పై టీడీపీ ఫోకస్ పెట్టింది.. జ‌న‌వ‌రిలో మొదటి విడ‌త అభ్యర్థులను ప్రకటించే విధంగా క‌స‌ర‌త్తు చేస్తున్నారు చంద్రబాబు.. జనసేనతో సర్దుబాటు చేసుకునే సీట్లను పక్కనపెట్టి కొన్ని స్థానాలకు అభ్యర్థుల జాబితా ప్రకటించనున్నారు చంద్రబాబు..గ్రూపు గొడవలు లేని స్థానాలపై ముందుగా దృష్టి పెట్టినట్లు సమాచారం.

టార్గెట్‌ 2024.. ఏపీలో పొలిటికల్‌ మిషన్‌ యాక్టివ్‌ మోడ్‌లోకి వచ్చేసింది. ఓటర్ల జాబితాపై రాజకీయం హీటెక్కుతోంది. ఇటు వైసీపీ.. అటు టీడీపీ-జనసేన నుంచి ఓటర్ల లిస్టులో అవకతవకలపై ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. తుఫాన్‌-పంటనష్టం కేంద్రంగా పొలిటికల్‌ హీట్‌ పెరుగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు బాపట్లలో తుఫాన్‌ బాధిత ప్రాంతాల్లో పర్యటించారు.కష్టకాలంలో రైతులను ఆదుకోవాల్సిందిపోయి ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడంపై ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని విమర్శించారు. పవన్‌ కల్యాణ్‌పై కేసులు పెట్టడాన్ని ఖండించారాయన. వ్యక్తిగత ఆరోపణలకు దిగడం సరికాదన్నారు.

అలా సర్కర్‌ వైఖరిని ఎండగట్టడం సహా మరోవైపు 2024 ఎన్నికలు టార్గెట్‌గా అభ్యర్ధుల ఎంపికపై చంద్రబాబు దృష్టిసారించనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే పొత్తులో భాగంగా టీడీపీ-జనసేన సమన్వయ కమిటీలు గ్రౌండ్‌ లెవల్‌ యాక్టివయ్యాయి. ఇటు పవన్‌-అటు చంద్రబాబు తమ తమ క్యాడర్‌కు దిశా నిర్దేశం చేస్తున్నారు. ముందు కలిసి నడుద్దాం. కలబడి నిలబడుదాం.. గెలుద్దాం.. ముఖ్యమంత్రి ఎవరనే ముచ్చట మేమిద్దరం చూసుకుంటామని క్యాడర్‌కు క్లారిటీ ఇచ్చారు పవన్‌.

వచ్చే ఫిబ్రవరి లోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉండవద్దని టీడీపీ శ్రేణులను అప్రమత్తం చేశారు చంద్రబాబు . అంతేకాదు అభ్యర్థుల జాబితా పై కూడా దృష్టి సారించామనే సంకేతాలిచ్చారు. ముఖ్యంగా నియోజకవర్గాల ఇంచార్జిల నియామ‌కాల‌పై ఫోక‌స్ పెట్టారాయ‌న‌.కొన్ని స్థానాల‌కు కొత్తగా ఇంచార్జిలను నియ‌మించ‌డంతో పాటు గ‌తంలో ఉన్న కొంత‌మందిని మార్చబోతున్నారనే చర్చ జరుగుతోంది.

గతానికంటే భిన్నంగా అభ్యర్థుల ఎంపికపై ప్రధానంగా దృష్టిసారించారు చంద్రబాబు. గ‌త మూడు నెల‌లుగా క్షేత్ర స్థాయిలో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ ప‌రిస్థితితో పాటు అభ్యర్థులకు సంబంధించి గెలుపోట‌ముల‌పైనా స్వ‌యంగా నివేదిక‌లు తెప్పించుకుంటున్నారు.. ఎక్కడైనా ఒక‌రికంటే ఎక్కువ‌మంది అభ్యర్థులు టికెట్‌ ఆశిస్తే .. ఆయా నేతల గురించి నివేదిక‌లు తెప్పించుకుంటున్నారు.. అలాంటి నాయ‌కుల‌ను స్వయంగా పిలిచి మాట్లాడి గ్రూపు త‌గాదాలు లేకుండా ఒక‌రికి బాధ్యతలు అప్పగిస్తున్నారు.

పొత్తులో భాగంగా జనసేనకు ఏయే స్థానాలు ఇవ్వాలి? టీడీపీ బరిలోకి దిగే స్థానాల్లో ఎవరికి టికెట్‌ ఇవ్వాలనే అంశాలపై చంద్రబాబు ఓ క్లారిటీతో ముందుకెళ్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవ‌ల వ‌రుస‌గా కీల‌క స్థానాల‌పై చంద్రబాబు గురిపెట్టారు.. వరుసగా ఇంచార్జీల ని నియమిస్తుండటం తో పాటు స్థానికంగా అందరినీ కలుపుకుని వెళ్లాలని సూచిస్తున్నారు. మరోవైపు జనసేనతో పొత్తు ఉండటంతో సీట్ల విషయంలో ఇంకా స్పష్టత రాలేదు.. ఎన్ని సీట్లు జనసేనకు కేటాయిస్తారని ఇంకా చర్చలు జరుగుతున్నాయి. అయితే జనసేన బలంగా ఉన్నచోట ఆయా స్థానాలు పక్కనపెట్టి మిగిలిన వాటిపైనే చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇటీవల చంద్రబాబు-పవన్ భేటీలో సీట్ల అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది.. రెండు పార్టీల నుంచి బలమైన అభ్యర్థులు ఉన్న స్థానాలు,సామాజిక వర్గాల ప్రకారం గెలిచే సీట్లను పక్కనపెట్టి మిగిలిన సుమారు 50 స్థానాలకు జనవరిలో తొలి జాబితా ప్రకటించేలా చంద్రబాబు ముందుకెళ్తున్నారనేది టాక్‌. జనవరి కల్లా జాబితా..అందులో చోటు ఎవరికి? వేటు ఎవరికి? పొత్తులో భాగంగా సర్దుబాట్లు ఎక్కెడెక్కడ? అనే ఆసక్తికరంగా చర్చ జరుగుతోంది పొలిటికల్‌ సర్కిల్స్‌లో.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..