Drinking hot water: 21 ఒక్క రోజుల పాటు వేడినీరు తాగడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా..?

బరువు తగ్గాలని ప్రయత్నించే వారికి మార్కెట్‌లో అనేక ఉత్పత్తులు, సప్లిమెంట్‌లు అందుబాటులో ఉన్నాయి. కానీ, అవన్నీ చాలా ఖరీదైనవి. దీంతో కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. కొన్ని బరువు తగ్గడంతో అనేక వ్యాధులను అంటగడుతుంటాయి. కానీ, మన ఇంట్లోనే ఈజీగా లభించే గోరువెచ్చని నీరు, సొంపు వాటర్‌తో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్‌ లేకుండా సులవుగా బరువు తగ్గొచ్చు. ఇందుకోసం ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

Drinking hot water: 21 ఒక్క రోజుల పాటు వేడినీరు తాగడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా..?
Hot Water
Follow us

|

Updated on: Dec 10, 2023 | 10:38 AM

రోజూ ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం వల్ల శరీరానికి అనేక విధాలుగా మేలు జరుగుతుందని అందరికీ తెలిసిందే. అయితే, ప్రతి ఒక్కరూ దీనిని వివిధ మార్గాల్లో అనుసరిస్తుంటారు. కొందరికి తేనె కలిపిన నీరు తాగడం ఇష్టం. మరికొందరు అందులో నిమ్మరసం కలుపుకుని తాగుతారు. ఇది కాకుండా కొందరు అనేక రకాలైన జ్యూస్‌లు కూడా తాగుతుంటారు. తమను తాము ఫిట్‌గా ఉంచుకోవడానికి వారికి దొరికిన చిట్కాలన్నీ ప్రయత్నిస్తారు. అయితే, ఉదయం పరగడుపునే వేడి నీళ్లు తాగమని వైద్య నిపుణులు సలహా ఇస్తారు. మీరు 21 రోజులు వేడి నీటిని తాగితే, మీ శరీరానికి ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది..? వేడినీటి వల్ల కలిగే లాభాల్లేంటో ఇక్కడ తెలుసుకుందాం..

ఆయుర్వేదంలో, ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో వేడి నీటిని తాగడం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఉదయాన్నే కాఫీ,టీలకు బదులు వేడి నీటిని తాగితే చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగటం వల్ల జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలను దూరం చేస్తుంది. అంతేకాక శ్వాస నాళాలను శుభ్రం చేసి శ్వాస బాగా జరిగేలా చేస్తుంది. అంతేకాదు.. మీరు బరువు తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టయితే.. వేడి నీటిని తీసుకోవడం మంచిది. దీనికి ఎటువంటి ఖర్చు ఉండదు.

ఆయుర్వేదంలోనే కాకుండా ఆధునిక అధ్యయనాల్లో కూడా వేడి నీటిని తీసుకోవడం శరీరానికి ఎంతో మేలు చేస్తుందని గుర్తించారు. అధ్యయనం ప్రకారం, చల్లని నీరు తాగడం కంటే వేడినీరు తాగడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని గుర్తించారు. ప్రతిరోజూ 2 లీటర్ల వేడి నీటిని తీసుకోవడం వల్ల శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంది. అతనిని చురుకుగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

* వేడి నీరు 3 విధాలుగా బరువు తగ్గించడంలో సహాయపడుతుంది..

– ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది – మీరు గోరువెచ్చని నీటిని తీసుకోవడం వల్ల ఆహారాన్ని సులభంగా జీర్ణం చేసుకోవచ్చు.

– జీవక్రియను పెంచండి- వేడి నీరు మీ జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది.

– ఆకలిని తగ్గిస్తుంది- ఆహారం తినే అరగంట ముందు వేడి నీటిని తాగడం వల్ల మీకు మేలు చేకూరుతుంది.

* ఎంత వేడి నీళ్లు తాగితే మంచిది..?

మంచిది కదా అని మరీ ఎక్కువగా వేడి నీళ్లు తాగడం కూడా మంచిది కాదు. అలా చేస్తే.. ప్రయోజనాలతో పాటు, ఆరోగ్యానికి కూడా హానికరం. 54 నుండి 70 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న వేడి నీటిని తాగడం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఈ రకమైన నీరు మెదడుకు కూడా మంచిదని భావిస్తారు.

* ఒత్తిడిని తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది.

ఒత్తిడిని తగ్గించడంలో కూడా వేడి నీరు సహాయకరంగా ఉంటుంది. మీరు అధిక ఒత్తిడితో అవస్థలు పడుతున్న సమయంలో, ఏదైనా మందులు తీసుకునే బదులు, ముందుగా లోతైన శ్వాస తీసుకొని తర్వాత గోరువెచ్చని నీరు త్రాగడం మంచిది. ఇది మీకు చాలా మంచి అనుభూతిని కలిగిస్తుంది.

అలాగే, ఒత్తిడిని తగ్గించుకోవటంలో సొంపు వాటర్‌ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. మీకు ప్రశాంతత, మంచి అనుభూతిని కలిగించడంలో సొంపు వాటర్ అద్భుత సహయకారిగా పనిచేస్తుంది..ఇందుకోసం సోంపును నీటిలో వేసి మరిగించి, ఫిల్టర్ చేసుకుని తాగితే సరిపోతుంది. బరువు తగ్గాలని ప్రయత్నించే వారికి మార్కెట్‌లో అనేక ఉత్పత్తులు, సప్లిమెంట్‌లు అందుబాటులో ఉన్నాయి. కానీ, అవన్నీ చాలా ఖరీదైనవి. దీంతో కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. కొన్ని బరువు తగ్గడంతో అనేక వ్యాధులను అంటగడుతుంటాయి. కానీ, మన ఇంట్లోనే ఈజీగా లభించే గోరువెచ్చని నీరు, సొంపు వాటర్‌తో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్‌ లేకుండా సులవుగా బరువు తగ్గొచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..