AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Revanth Reddy: కేసీఆర్‌ను పరామర్శించనున్న రేవంత్ రెడ్డి.. మధ్యాహ్నం యశోదకు సీఎం..

మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి తెలిసిన వెంటనే సీఎం రేవంత్‌ రెడ్డి వివరాలు వివరాలు ఆరా తీసారు. కేసీఆర్ కు మెరుగైన వైద్య చికిత్స అందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఈ క్రమంలోనే ఇవాళ సీఎం తానే స్వయంగా యశోద ఆస్పత్రికి వెళ్లి కేసీఆర్‌ని పరామర్శించనున్నారు. సీఎంతో పాటుగా ఇతర మంత్రులు, ఎమ్మెల్యే కూడా యశోద ఆస్పత్రికి వెళ్లి కేసీఆర్ ను పరార్శించనున్నట్టుగా సమాచారం.

Revanth Reddy: కేసీఆర్‌ను పరామర్శించనున్న రేవంత్ రెడ్డి.. మధ్యాహ్నం యశోదకు సీఎం..
Cm Revanth Reddy Visited Kc
Jyothi Gadda
|

Updated on: Dec 10, 2023 | 11:19 AM

Share

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరామర్శించనున్నారు. కేసీఆర్ ప్రస్తుతం సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి ఈ మధ్యాహ్నం ఆసుపత్రికి వెళ్ళి బీఆర్ఎస్ అధినేతను పరామర్శించనున్నారు. శుక్రవారం కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఆధ్వర్యంలో కేసీఆర్‌కు 20 మంది వైద్యుల బృందం సర్జరీ నిర్వహించింది. ఆ తర్వాత ఆయనను పలువురు నాయకులు ఆసుపత్రిలో పరామర్శిస్తున్నారు.

కేసీఆర్‌కు హిప్ రిప్లేస్‌మెంట్ ఆపరేషన్‌ విజ‌య‌వంత‌మైంద‌ని, ఆయ‌న కోలుకుంటున్నార‌ని యశోద ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం వాక‌ర్ సాయంతో కేసీఆర్ న‌డుస్తున్నార‌ని చెప్పారు. మ‌రో రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ చేసే అవ‌కాశం ఉంద‌ని వారు వెల్లడించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని, త్వరగా కోలుకోవడానికి అనుకూలంగా శరీరం సహకరిస్తోందన్నారు. మానసికంగా కూడా కేసీఆర్‌ దృఢంగా ఉన్నారని తెలిపారు.

గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత కేసీఆర్‌ ఎర్రవల్లి గ్రామంలోని తన ఫామ్‌హౌస్‌లో జారిపడ్డారని తెలిసింది. దాంతో ఆయన తుంటికి గాయమైంది.హుటాహుటిన యశోదా ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. అయితే.. మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి తెలిసిన వెంటనే సీఎం రేవంత్‌ రెడ్డి వివరాలు వివరాలు ఆరా తీసారు. కేసీఆర్ కు మెరుగైన వైద్య చికిత్స అందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఈ క్రమంలోనే ఇవాళ సీఎం తానే స్వయంగా యశోద ఆస్పత్రికి వెళ్లి కేసీఆర్‌ని పరామర్శించనున్నారు. సీఎంతో పాటుగా ఇతర మంత్రులు, ఎమ్మెల్యే కూడా యశోద ఆస్పత్రికి వెళ్లి కేసీఆర్ ను పరార్శించనున్నట్టుగా సమాచారం.

ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
టాయిలెట్లు శుభ్రం చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు
టాయిలెట్లు శుభ్రం చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు
ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర
ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర
సినిమాలో మ్యాటర్ ఉంటే.. అది మ్యాటరే కాదసలు..!
సినిమాలో మ్యాటర్ ఉంటే.. అది మ్యాటరే కాదసలు..!
త్రివిక్రమ్, శ్రీను వైట్ల అడుగుల్లో ఆ ఇద్దరు డైరెక్టర్స్
త్రివిక్రమ్, శ్రీను వైట్ల అడుగుల్లో ఆ ఇద్దరు డైరెక్టర్స్
చంద్రుడిపై ఇల్లు.. మరో ఆరేళ్లలోనే..! నాసా కొత్త ప్లాన్‌!
చంద్రుడిపై ఇల్లు.. మరో ఆరేళ్లలోనే..! నాసా కొత్త ప్లాన్‌!
యాపిల్ తింటున్నారా? ఈ ఒక్క పని చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు
యాపిల్ తింటున్నారా? ఈ ఒక్క పని చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు
వామ్మో.. సెల్‌ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా
వామ్మో.. సెల్‌ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా
లగ్జరీ ఇళ్లు.. కార్లు.. త్రిష ఆస్తులు విలువ ఎంతో తెలుసా?
లగ్జరీ ఇళ్లు.. కార్లు.. త్రిష ఆస్తులు విలువ ఎంతో తెలుసా?
మటన్‌ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్‌
మటన్‌ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్‌
నెలసరి వచ్చిందా అంటూ నీచంగా అవహేళన చేసేవాడు..
నెలసరి వచ్చిందా అంటూ నీచంగా అవహేళన చేసేవాడు..