AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాఫీ ఈ టైమ్‌లో తాగితే శరీరంలో జరిగే మ్యాజిక్కే వేరు.. అసలు సీక్రెట్ ఏంటో తెలుసుకోండి..

అలసటను తరిమేసి, రోజంతా ఉత్సాహంగా ఉంచే అద్భుతమైన డ్రింక్ కాఫీ. మీకు ఉదయాన్నే కన్ను తెరవగానే కప్పు వేడివేడి కాఫీ తాగే అలవాటు ఉందా? అయితే మీ శరీర సహజ సిద్ధమైన శక్తిని మీరే స్వయంగా దెబ్బతీస్తున్నట్లేనని హెచ్చరిస్తున్నారు న్యూట్రిషన్ నిపుణులు. ఉదయం నిద్రలేవగానే కాఫీ తాగడం వల్ల రోజంతా రోజంతా ఫ్రెష్‌గా ఉంటామని చాలామంది భావిస్తారు. కానీ కాఫీ తాగే సరైన సమయం మీ శక్తి, ఏకాగ్రత, రాత్రి నిద్రపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Krishna S
|

Updated on: Aug 01, 2026 | 12:25 PM

Share
మన శరీరం నిద్రలేచిన వెంటనే కార్టిసోల్ అనే హార్మోన్‌ను సహజంగానే అధిక పరిమాణంలో ఉత్పత్తి చేస్తుంది. దీనిని అలర్ట్‌నెస్ హార్మోన్ అని కూడా పిలుస్తారు. ఇది శరీరాన్ని సహజంగానే మేల్కొలిపి యాక్టివ్‌గా ఉంచడానికి సహాయపడుతుంది. సరిగ్గా అదే సమయంలో మనం కెఫిన్ ఉన్న కాఫీని తీసుకుంటే.. శరీరంలో అలర్ట్‌నెస్ స్థాయిలు పరిమితి దాటిపోతాయి. దీనివల్ల కొందరిలో ఆందోళన, కంగారు, గుండె వేగం పెరగడం, ఆ తర్వాత ఉన్నట్టుండి నీరసించిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి.

1 / 5
అయితే కాఫీని ఎప్పుడు తాగాలి? నిపుణుల అభిప్రాయం ప్రకారం ఉదయం 9 గంటల నుండి 11 గంటల మధ్య కాఫీ తాగడం అత్యంత మంచిది. ఈ సమయానికి శరీరంలో కార్టిసోల్ స్థాయిలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. ఆ సమయంలో కెఫిన్ శరీరంలోకి వెళితే చాలా సమర్థవంతంగా పనిచేసి, ఎక్కువ సేపు ఏకాగ్రతను, శక్తిని అందిస్తుంది. ఒకవేళ మీరు ఉదయమే త్వరగా నిద్రలేచే అలవాటు ఉన్నవారైతే, లేచిన 60 నుండి 90 నిమిషాల తర్వాత కాఫీ తీసుకోవడం మంచిది.

2 / 5
కాఫీ తాగే సమయం ఎంత ముఖ్యమో, తీసుకునే పరిమాణం కూడా అంతే ముఖ్యం. పరిమితికి మించి కెఫిన్ తీసుకోవడం వల్ల తలనొప్పి, కంగారు, గుండె వేగం పెరగడం, డిహైడ్రేషన్, నిద్రలేమి సమస్యలు వస్తాయి. ఆరోగ్యవంతులైన పెద్దలు రోజుకు గరిష్టంగా 400 మిల్లీగ్రాముల కెఫిన్ వరకు తీసుకోవడం సురక్షితమని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది వ్యక్తి వయస్సు, ఆరోగ్యం, కెఫిన్ తట్టుకునే శక్తిపై ఆధారపడి ఉంటుంది.

3 / 5
సాయంత్రం లేదా రాత్రి వేళల్లో కాఫీ తాగే అలవాటు ఉంటే, ఆ కెఫిన్ శరీరంలో కొన్ని గంటల పాటు క్రియాశీలంగానే ఉంటుంది. దీనివల్ల రాత్రి సరిగ్గా నిద్ర పట్టకపోవడం లేదా నిద్ర నాణ్యత తగ్గడం వంటి సమస్యలు వస్తాయి. అందుకే నిద్రపోవడానికి కనీసం 6 నుండి 8 గంటల ముందే కెఫిన్ కలిగిన పానీయాలకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ సాయంత్రం వేళ ఏదైనా తాగాలనిపిస్తే కాఫీకి బదులుగా తక్కువ కెఫిన్ ఉండే గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ ఎంచుకోవడం మంచి ప్రత్యామ్నాయం.

4 / 5
మొత్తానికి కాఫీ మన ఆరోగ్యానికి శత్రువు ఏమీ కాదు. కానీ దానిని సరైన సమయంలో, సరైన పరిమాణంలో తీసుకోవడమే అసలైన రహస్యం. ఉదయం లేవగానే కాఫీ తాగే అలవాటును మార్చుకుని, ఉదయం 9 నుంచి 11 గంటల మధ్య తీసుకోవడం, రోజువారీ కెఫిన్ పరిమితిని పాటించడం వల్ల మీ ఎనర్జీ, ఏకాగ్రతతో పాటు రాత్రి పూట ప్రశాంతమైన నిద్ర మీ సొంతమవుతుంది.

5 / 5
Follow Us