AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత అంతరిక్ష చరిత్రలో సిరిసిల్ల ముద్ర.. విక్రమ్-1 రాకెట్ విజయంలో ముగ్గురు సోదరులు!

భారత అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యం సరికొత్త శిఖరాలను తాకుతోంది. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న స్కైరూట్ ఏరోస్పేస్ ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన విక్రమ్-1 ఆర్బిటల్ ప్రయోగ వాహకం విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లి రికార్డు సృష్టించింది. అయితే ఈ చారిత్రాత్మక విజయం వెనుక రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువ ఇంజనీర్ల కష్టం, సాంకేతిక నైపుణ్యం ఉండటం తెలంగాణాకే కాకుండా సిరిసిల్ల జిల్లా ప్రజలకు ఎనలేని గర్వకారణంగా మారింది.

భారత అంతరిక్ష చరిత్రలో సిరిసిల్ల ముద్ర.. విక్రమ్-1 రాకెట్ విజయంలో ముగ్గురు సోదరులు!
From Sircilla To Space
G Sampath Kumar
| Edited By: |

Updated on: Aug 01, 2026 | 12:52 PM

Share

భారత అంతరిక్ష చరిత్రలో ప్రైవేటు రంగానికి కొత్త అధ్యాయాన్ని లిఖించిన విక్రమ్-1 ఆర్బిటల్ ప్రయోగ వాహకం విజయవంతమైన ప్రయోగంలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ముగ్గురు యువ ఇంజనీర్లు కీలక పాత్ర పోషించడం జిల్లాకు గర్వకారణంగా నిలిచింది. ముఖ్యంగా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువ ఇంజనీర్లు ఈ ప్రతిష్ఠాత్మక ప్రయోగంలో భాగస్వాములు కావడం విశేషం.

సిరిసిల్ల పట్టణానికి చెందిన సోదరులు అడుప సంతోష్ కుమార్, అడుప కిరణ్, అలాగే వారి కుటుంబానికి చెందిన బొమ్మదేని నాగరాజు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న స్కైరూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ రూపొందించిన తొలి ఆర్బిటల్ ప్రయోగ వాహకం విక్రమ్-1 విజయవంతమైన ప్రయోగంలో తమ సాంకేతిక నైపుణ్యాన్ని చాటుకున్నారు.

శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి నింగిలోకి దూసుకెళ్లిన విక్రమ్-1 తన తొలి ప్రయోగంలోనే ఉపగ్రహాలను దిగువ భూ కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టి భారత ప్రైవేటు అంతరిక్ష రంగ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటింది. ఈ చారిత్రాత్మక విజయానికి సిరిసిల్ల యువత కూడా భాగస్వాములు కావడం జిల్లాకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

ప్రయోగంలో అడుప సంతోష్ కుమార్ అవియానిక్స్ చెక్‌అవుట్ లీడ్గా రాకెట్ అవియానిక్స్ వ్యవస్థల తనిఖీలు, పరీక్షలు, ప్రయోగానికి ముందు నిర్వహించే కీలక గ్రౌండ్ చెక్‌అవుట్ కార్యకలాపాలకు నాయకత్వం వహించారు. అడుప కిరణ్ రాకెట్ క్యాడ్ డిజైనర్గా రాకెట్ రూపకల్పనకు సంబంధించిన డిజైన్ పనుల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. బొమ్మదేని నాగరాజు ఎలక్ట్రికల్ ఇంటిగ్రేషన్ విభాగంలో రాకెట్ విద్యుత్ వ్యవస్థల సమీకరణ పనులను విజయవంతంగా పూర్తి చేశారు.

ఒకే ఊరు, ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువ ఇంజనీర్లు భారత అంతరిక్ష విజయగాథలో భాగస్వాములు కావడం సిరిసిల్ల ప్రజల్లో ఆనందోత్సాహాలను నింపింది. స్థానికులు, ప్రజాప్రతినిధులు, విద్యావేత్తలు, యువత ఈ ముగ్గురు ఇంజనీర్లను అభినందిస్తూ వారి విజయం సిరిసిల్ల యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొంటున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ప్రభాస్ ఫేవరెట్ కోనసీమ స్పెషల్ బెండకాయ రొయ్యల పులుసు..
ప్రభాస్ ఫేవరెట్ కోనసీమ స్పెషల్ బెండకాయ రొయ్యల పులుసు..
స్ట్రీట్ ఫుడ్ ఫేమస్ పావ్ భాజీ! తింటే రుచికి ఫిదా అవ్వాల్సిందే
స్ట్రీట్ ఫుడ్ ఫేమస్ పావ్ భాజీ! తింటే రుచికి ఫిదా అవ్వాల్సిందే
ఘోర ప్రమాదం.. జిల్లా కలెక్టర్ కారు ఢీకొని రైతు మృతి
ఘోర ప్రమాదం.. జిల్లా కలెక్టర్ కారు ఢీకొని రైతు మృతి
టీ20ల్లో అత్యధిక ఛేజ్.. చరిత్ర సృష్టించిన టీమిండియా..!
టీ20ల్లో అత్యధిక ఛేజ్.. చరిత్ర సృష్టించిన టీమిండియా..!
53 ఏళ్ల వయసులో ఫిట్నెస్ సీక్రెట్.. ప్రభుదేవా రోజూ ఏం చేస్తారంటే..
53 ఏళ్ల వయసులో ఫిట్నెస్ సీక్రెట్.. ప్రభుదేవా రోజూ ఏం చేస్తారంటే..
భారీ గ్రహం రాకతో ఈ రాశుల వారిపై కనకవర్షం.. మీ రాశి ఉందా?
భారీ గ్రహం రాకతో ఈ రాశుల వారిపై కనకవర్షం.. మీ రాశి ఉందా?
షుగర్, బీపీ, బరువు కంట్రోల్ అవ్వాలన్నా పర్ఫెక్ట్ బ్రేక్‌ఫాస్ట్!
షుగర్, బీపీ, బరువు కంట్రోల్ అవ్వాలన్నా పర్ఫెక్ట్ బ్రేక్‌ఫాస్ట్!
ఇంట్లోనే చిన్న కుండీలో గుత్తులు గుత్తులుగా ఉసిరికాయలు..
ఇంట్లోనే చిన్న కుండీలో గుత్తులు గుత్తులుగా ఉసిరికాయలు..
పదో తరగతి 2027 పబ్లిక్‌ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల
పదో తరగతి 2027 పబ్లిక్‌ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల
లైంగిక ఆరోపణలతో DRDO ఉద్యోగిపై దాడి.. హాస్పిటల్‌కు తరలించేలోపే..
లైంగిక ఆరోపణలతో DRDO ఉద్యోగిపై దాడి.. హాస్పిటల్‌కు తరలించేలోపే..