AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ హీరో చాలా పిసినారి.. నోరు తెరిస్తే డబ్బు తప్ప ఏం మాట్లాడడు.. షాకింగ్ విషయం చెప్పిన నటి రమా ప్రభ

ప్రముఖ నటి రమాప్రభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు రమాప్రభ. వైవిధ్యమైన పాత్రలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు రమా ప్రభ. వయో భారంతో ఆమె సినిమాలకు దూరం అయ్యారు. 79ఏళ్ల రమాప్రభ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు.

ఆ హీరో చాలా పిసినారి.. నోరు తెరిస్తే డబ్బు తప్ప ఏం మాట్లాడడు.. షాకింగ్ విషయం చెప్పిన నటి రమా ప్రభ
Ramaprabha
Rajeev Rayala
|

Updated on: Aug 01, 2026 | 12:48 PM

Share

ఎన్నో వందల సినిమాల్లో నటించి నవ్వులు పంచారు రమాప్రభ.హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, తల్లిగా ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించారు. ప్రస్తుతం వయోభారం కారణం గా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఆమధ్య యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఇండస్ట్రీలో తన అనుభవాలను, అలాగే ప్రముఖుల గురించి అనేక వివరాలను పంచుకున్నారు రమా ప్రభ. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. అనే విషయాలను పంచుకున్నారు. దివంగత నటుడు శోభన్ బాబు గురించి అనేక విషయాలు తెలిపారు. శోభన్ బాబుతో ఆమె చాలా సినిమాల్లో నటించారు. అలాగే వ్యక్తిగతంగా ఆయనతో మంచి అనుబంధం ఉంది. ఆయన గురించి మాట్లాడుతూ..  శోభన్ బాబును “పిసినారి “అని రమాప్రభ అన్నారు, ఆయనకు బిజినెస్ మైండ్ ఉండేదని పేర్కొన్నారు. “నోరు తెరిస్తే డబ్బు తప్ప ఏం మాట్లాడడు” అని, “తన తిండే తను తినడు, తన బట్టలు తను వేసుకోడు” అని అన్నారు రమాప్రభ. ఆయన చాలా జాగ్రత్తగా ఉండే వాడని అది ఆయనకు ఎంతో సహాయపడిందని అన్నారు.

ఇది కూడా చదివేయండి : రోజుకు 3లక్షలు రెమ్యునరేషన్.. మంచంపై నోట్ల కట్టలు పరుచుకుని పడుకునేది.. చివరకు అనాధలా చనిపోయింది

శోభన్ బాబు గురించి మాట్లాడిన తర్వాత, రమాప్రభ ఆధ్యాత్మిక అంశాల గురించి మాట్లాడారు. పునర్జన్మలు, కర్మ సిద్ధాంతం, ఆత్మ సంబంధాల గురించి ఆమె మాట్లాడుతూ.. మనిషి తన గత జన్మలో చేసిన తప్పులకు ఈ జన్మలో ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తాడని. “గత జన్మది ఇప్పుడు అనుభవిస్తూ, దాన్ని ఎరుకతో గమనిస్తే తగ్గుతూ వస్తుంది” అనే సూత్రాన్ని తాను నమ్ముతాను అని తెలిపారు.

ఇది కూడా చదివేయండి : అతనికి 29, ఆమెకు 53..! 6 ఏళ్లుగా ఓటీటీని షేక్ చేస్తున్న రొమాంటిక్ సిరీస్.. ఎక్కడ చూడొచ్చంటే

కోటీశ్వరుడికి రోగం వస్తే డబ్బు ఉన్నా ఏం తినలేడని, కాళ్లు లేని కోటీశ్వరుడు ఎలా నడవగలడని ప్రశ్నించారు. చిన్న పిల్లలకు ప్రమాదాలు ఎందుకు జరుగుతాయన్న ప్రశ్నకు సమాధానంగా, వారు తప్పు చేయకపోయినా, వారి ఆత్మ చేసిన తప్పులు లేదా వారి తల్లిదండ్రుల పాపాలు ఆ పిల్లల ద్వారా శిక్షించబడతాయని ఆమె అన్నారు. తల్లిదండ్రులు చేసిన పాపానికి పిల్లలు క్షోభించడాన్ని చూసి వారు బాధపడతారని, ఇది కర్మ సిద్ధాంతంలోని ఒక కోణమని ఆమె వివరించారు. అలాగే మనిషి సంబంధాలు కూడా కేవలం ఈ జన్మకు మాత్రమే పరిమితం కావని, గత జన్మల బంధాలు, ప్రేమలు, శత్రుత్వాలు ఈ జన్మలో వివిధ రూపాల్లో కొనసాగుతాయని ఆమె అన్నారు ఇలా అనేక విషయాలను ఆమె ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదివేయండి : చేతులారా జీవితాన్ని నాశనం చేసుకున్నాడు.. పెద్ద హీరో అవుతానుకుంటే.. 38ఏళ్ల వయసులోనే చనిపోయాడు

Shobanbabu

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us