AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అతనికి 29, ఆమెకు 53..! 6 ఏళ్లుగా ఓటీటీని షేక్ చేస్తున్న రొమాంటిక్ సిరీస్.. ఎక్కడ చూడొచ్చంటే

ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాల్లో థ్రిల్లర్, హారర్, రొమాంటిక్, లవ్ స్టోరీ సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కాగా ఇప్పుడు ఓ సినిమా ఓటీటీలో ఆకట్టుకుంటుంది. ఇది ఒక ప్రేమ కథ. కానీ చాలా డిఫరెంట్ కథతో తెరకెక్కింది ఈ సినిమా.

అతనికి 29, ఆమెకు 53..! 6 ఏళ్లుగా ఓటీటీని షేక్ చేస్తున్న రొమాంటిక్ సిరీస్.. ఎక్కడ చూడొచ్చంటే
Ott
Rajeev Rayala
|

Updated on: Jul 31, 2026 | 10:43 AM

Share

ఓ వైపు థియేటర్స్ లో సినిమాలు అలరిస్తుంటే మరోవైపు ఓటీటీలో కూడా సినిమాలు అలరిస్తున్నాయి. ప్రస్తుతం ఓటీటీలో రకరకాల జోనర్ సినిమాలు దుమ్మురేపుతున్నాయి. సినిమాలు డబ్బింగ్ సినిమాలు కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఓటీటీల్లో సినిమాలు చూడటానికి ఆడియన్స్ కూడా ఎక్కువగా ఆసక్తిచూపిస్తున్నారు. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిజమ ఇప్పుడు ఓటీటీని షేక్ చేస్తుంది. అంతే కాదు ఈ సినిమాను ఆడియన్స్ రిపీట్ గా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు . ఇదొక రొమాంటిక్ సినిమా.. ఈ సినిమా డిఫరెంట్ కథతో తెరకెక్కింది. కాగా తెరపై తమకంటే చాలా చిన్న వయసు ఉన్న హీరోయిన్లతో ప్రేమలో పడుతుంటారు. కానీ ఈ సినిమాలో కథ మాత్రం చాలా విభిన్నంగా ఉంటుంది. ఆరేళ్లుగా ఈ సినిమా ట్రెండింగ్ లో దూసుకుపోతుంది.

ఇది కూడా చదవండి : ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే మావ..! భరణి మూవీ హీరోయిన్ ఎంత మారిపోయింది.. ఇప్పుడు ఎలా ఉందంటే

29 ఏళ్ల కుర్రాడు.. 53 ఏళ్ల హీరోయిన్ తో ప్రేమలో పడడం.. ఆ తర్వాత ఇద్దరి జీవితాలు ఎలా మారాయి. వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనేది ఈ సినిమా కథ. వయసులో తనకంటే 24 ఏళ్లు పెద్దదైన  హీరోయిన్ తో హీరో ప్రేమలో పడడం.. వారిద్దరి జీవితంలో ఊహించని పరిస్థితులు ఎదురైనప్పుడు ఏం జరిగింది ఈ సిరీస్ లో చూపించారు. ఈ సిరీస్ పేరు ఎ సూటిబుల్ బాయ్. ఈ సిరీస్ లో బాలీవుడ్ యంగ్ హీరో ఇషాన్ ఖట్టర్ హీరోగా నటించాడు అలాగే హీరోయిన్ గా సీనియర్ బ్యూటీ టబు. మొన్నటి వరకూ సినిమాలు చేసిన ఇషాన్. ఎ సూటిబుల్ బాయ్ అనే వెబ్ సిరీస్‌తో ఓటీటీ ప్రపంచంలో చాలా ఫేమస్ అయ్యాడు.

ఇది కూడా చదవండి : సీనియర్ నటి లక్ష్మీ కూతురు తెలుగులో తిరుగులేని నటి..! ఒకప్పుడు హీరోయిన్‌గా అదరగొట్టింది.. ఇప్పుడు ఇలా

ఈ సిరీస్ లో తనకంటే దాదాపు 24 సంవత్సరాలు పెద్దదైన నటితో రొమాంటిక్ సీన్స్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ, లవ్ స్టోరీ చూసి ఆశ్చర్యపోయారు ఆడియన్స్. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఇషాన్ మాట్లాడుతూ.. టబుతో సన్నిహిత సన్నివేశాల్లో నటించే సమయంలో ఎప్పుడూ భయపడలేదని అన్నారు. ఆమె తనకు సెట్ లో చాలా ఫన్నీ విషయాలు చెప్పేదని.. ఎక్కువగా భోజనం గురించి మాట్లాడుకునేవాళ్లమని.. అలాగే టబు చాలా సరదాగా ఉంటుందని.. సెట్స్ లో చిన్న అమ్మాయిలా ప్రవర్తిస్తుందని.. కెమెరా ముందుకు రాగానే వెంటనే పాత్రలోకి వచ్చేస్తుందని చెప్పుకొచ్చారు. ఇక ఈ రొమాంటిక్ సిరీస్ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్ ను అస్సలు మిస్ అవ్వకండి. ఈ సిరీస్ ను ఒంటరిగా చూడటమే బెటర్..

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : అలా ఎలా మిస్ అయ్యింది గురూ..! నాని ప్యారడైజ్ సినిమాను ఈ ముద్దుగుమ్మ వదులుకుందా.?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us