AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అలా ఎలా మిస్ అయ్యింది గురూ..! నాని ప్యారడైజ్ సినిమాను ఈ ముద్దుగుమ్మ వదులుకుందా.?

తెలుగు చిత్ర పరిశ్రమలో న్యాచురల్ స్టార్ గా పేరు సంపాదించుకున్నారు హీరో నాని. వరుస హిట్లతో ఫుల్ జోష్ మీదున్నారు. ప్రస్తుతం ది ప్యారడైజ్ చిత్రంలో నటిస్తున్నారు. కొన్నినెలలుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా కోసం నాని ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

అలా ఎలా మిస్ అయ్యింది గురూ..! నాని ప్యారడైజ్ సినిమాను ఈ ముద్దుగుమ్మ వదులుకుందా.?
Nani Movie
Rajeev Rayala
|

Updated on: Jul 30, 2026 | 1:22 PM

Share

నేచురల్ స్టార్ నాని రూటు మార్చి ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. వరుసగా తెలుగులో సూపర్ హిట్స్ అందుకున్న నాని ఇప్పుడు ఇతర భాషల్లోనూ సత్తా చాటనున్నాడు. దసరా సినిమా నుంచి నాని వరుసగా హిట్స్ కొడుతున్నాడు. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం సినిమాలతో ప్రేక్షకులను అలరించారు నాని. ఇక ఇప్పుడు ది ప్యారడైజ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. గతంలో శ్రీకాంత్ ఓదెల నానితో కలిసి దసరా అనే సినిమా చేశారు. ఆ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరి కాంబోలో రాబోతున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇది కూడా చదవండి : ఏంటీ..! ఈ నటి మేనల్లుడు ఇప్పుడు ఇండస్ట్రీలో తోప్ హీరోనా..!! ఎవరో తెలిస్తే షాక్ అవుతారు

అలాగే ఈ సినిమాలో డైలాగ్ కింగ్ మోహన్ బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే సంపూర్ణేష్ బాబు ఈ సినిమాలో మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇటీవలే సంపూర్ణేష్ బాబు లుక్ ను రిలీజ్ చేశారు. అలాగే ఈ సినిమాలో కాయదు లోహర్ హీరోయిన్ గా నటిస్తుంది. కాగా ముందుగా నాని సరసన మరో హీరోయిన్ ను అనుకున్నారట. కానీ డేట్స్ అడ్జెస్ట్ అవ్వకపోవడంతో ఆమె నాని సినిమాకు నో చెప్పిందట ఆ అందాల భామ.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : అతన్ని భరించడం నా వల్ల కాదు.. పెళ్లయిన నాలుగు నెలలకే భర్తపై నటి షాకింగ్ పోస్ట్..

ఆమె ఎవరో కాదు.. అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్. ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ ఇప్పుడు తెలుగులో వరుసగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.. ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది జాన్వీ. ఆతర్వాత ఇప్పుడు రామ్ చరణ్ తో కలిసి పెద్ది సినిమా చేస్తుంది. అయితే ప్యారడైజ్ సినిమాకు ముందుగా జాన్విని సంప్రదించారట. అయితే ఆమె పెద్ది సినిమాలో బిజీగా ఉండటంతో డేట్స్ అడ్జెస్ట్ అవ్వక నో చెప్పిందట. దాంతో ఆమె ప్లేస్ లోకి కాయదు లోహర్ ను తీసుకున్నారని తెలుస్తుంది. ఇక ప్యారడైజ్ విషయానికొస్తే 1980వ దశకంలో సికింద్రాబాద్ ప్రాంత నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాతో నాని మరో హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.

ఇది కూడా చదవండి : ఆ డైరెక్టర్ నన్ను వద్దు అన్నాడు.. కానీ హీరోయిన్ వల్లే ఇదంతా జరిగింది.. షాకింగ్ విషయం చెప్పిన నందిని రెడ్డి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.

Follow Us
దీపావళి వేడుకల్లో దిల్ రాజు ఫ్యామిలీ.. ఫొటోస్ ఇదిగో..
దీపావళి వేడుకల్లో దిల్ రాజు ఫ్యామిలీ.. ఫొటోస్ ఇదిగో..
క్షణాల్లో 50 వాహనాలు ఢీ! వాహనాల కుప్పలు..బల్గేరియాలో 11 మంది మృతి
క్షణాల్లో 50 వాహనాలు ఢీ! వాహనాల కుప్పలు..బల్గేరియాలో 11 మంది మృతి
అక్షరధామ్‌లో కన్నులపండువగా అన్నకూట్.. స్వామివారికి ఏకంగా..
అక్షరధామ్‌లో కన్నులపండువగా అన్నకూట్.. స్వామివారికి ఏకంగా..
బంగ్లాదేశ్ మురికివాడలను ఢిల్లీగా చూపిస్తూ చైనా వ్లాగర్ల..
బంగ్లాదేశ్ మురికివాడలను ఢిల్లీగా చూపిస్తూ చైనా వ్లాగర్ల..
ఖురాన్, బైబిల్‌ను మార్చే ధైర్యం ఉందా? శక్తిమాన్ తీవ్ర ఆగ్రహం
ఖురాన్, బైబిల్‌ను మార్చే ధైర్యం ఉందా? శక్తిమాన్ తీవ్ర ఆగ్రహం
మీ ఆఫీస్ నుంచి లోన్ తీసుకుంటున్నారా..? ట్యాక్స్ రూల్స్ ఇవే..
మీ ఆఫీస్ నుంచి లోన్ తీసుకుంటున్నారా..? ట్యాక్స్ రూల్స్ ఇవే..
అల్యూమినియం ఫాయిల్ ఎలా వాడాలి?మెరిసే వైపు మంచిదా లేక మ్యాట్ వైపా?
అల్యూమినియం ఫాయిల్ ఎలా వాడాలి?మెరిసే వైపు మంచిదా లేక మ్యాట్ వైపా?
ఐటీ కారిడార్‌లో ట్యాంకర్ల క్యూ వెనుక అసలు నిజం..
ఐటీ కారిడార్‌లో ట్యాంకర్ల క్యూ వెనుక అసలు నిజం..
ప్రభాస్ ఒక్కరోజు భోజనం ఖర్చు ఎంతో తెలుసా.. ?
ప్రభాస్ ఒక్కరోజు భోజనం ఖర్చు ఎంతో తెలుసా.. ?
OTTలో ది బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఫ్రీగా చూడొచ్చు
OTTలో ది బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఫ్రీగా చూడొచ్చు