AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చేతులారా జీవితాన్ని నాశనం చేసుకున్నాడు.. పెద్ద హీరో అవుతానుకుంటే.. 38ఏళ్ల వయసులోనే చనిపోయాడు

ప్రముఖ నటి శ్రీలక్ష్మి ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితంలోని కొన్ని హృదయ విదారకమైన విషయాలను పంచుకున్నారు. ఆమె బాల్యం, కుటుంబ నేపథ్యం నుంచి తన కెరీర్, కుటుంబంలో చోటుచేసుకున్న విషాదకర సంఘటనల వరకు అనేక అంశాలను వెల్లడించారు. శ్రీలక్ష్మి చెన్నైలో పుట్టి పెరిగారు.

చేతులారా జీవితాన్ని నాశనం చేసుకున్నాడు.. పెద్ద హీరో అవుతానుకుంటే.. 38ఏళ్ల వయసులోనే చనిపోయాడు
Actress Sri Lakshmi
Rajeev Rayala
|

Updated on: Jul 31, 2026 | 10:05 AM

Share

శ్రీలక్ష్మి తన సోదరుడు రాజేష్ అకాల మరణం వెనుక దాగి ఉన్న విషాద భరితమైన విషయాలను గతంలో ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. రాజేష్ కేవలం 38 ఏళ్ల వయసులోనే జీవితంపై విసుగు చెంది కన్నుమూసినట్లు శ్రీలక్ష్మి తెలిపారు. ఇది ఆత్మహత్య కాదని, జీవితంలో ఎదురైన చేదు అనుభవాలు, తప్పుడు నిర్ణయాలు, తీవ్రమైన నిరాశల పర్యవసానమే అని ఆమె స్పష్టం చేశారు. శ్రీలక్ష్మి తన కెరీర్ ప్రారంభంలో పుణ్యభూమి కళ్ళు తెరిచింది వంటి చిత్రాల్లో రెండవ హీరోయిన్‌గా నటించిన రోజుల నుంచి రాజేష్ కథను గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో, రాజేష్ ఇండస్ట్రీలో నాగమణి అనే డాన్సర్‌తో ప్రేమలో పడి, కుటుంబానికి తెలియకుండానే ఆమెను వివాహం చేసుకున్నాడు. కుటుంబం ఈ పెళ్లిని అంగీకరించనప్పటికీ, రాజేష్ పట్టుబట్టాడు. తన భార్యకు రాఘవేంద్రరావు, దాసరి వంటి ప్రముఖ దర్శకులతో పరిచయాలు ఉన్నాయని, తద్వారా తనకు మంచి హీరో అవకాశాలు వస్తాయని రాజేష్ నమ్మాడని శ్రీలక్ష్మి వివరించారు. కుటుంబానికి ఆర్థికంగా చేయూత ఇవ్వాలనే ఆశతో, తన అక్క కష్టాన్ని తగ్గించాలనే మంచి ఆలోచనతోనే రాజేష్ ఈ నిర్ణయం తీసుకున్నాడని ఆమె పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి : ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే మావ..! భరణి మూవీ హీరోయిన్ ఎంత మారిపోయింది.. ఇప్పుడు ఎలా ఉందంటే

అయితే, రాజేష్ ఆశలు అడియాశలయ్యాయి. భార్య చెప్పిన విధంగా అతనికి పెద్ద అవకాశాలు రాలేదు. కనీసం చిన్న చిన్న పాత్రలకు కూడా సరైన మద్దతు లభించలేదు. దీంతో వారి మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవని శ్రీలక్ష్మి తెలిపారు. రాజేష్ భార్య డాన్సర్‌గా పని చేసేది. అయితే, “మీ ఆవిడని పనికి పంపిస్తున్నావా.? నువ్వేమో ఇంట్లో కూర్చున్నావా.?” అని బయట నుంచి విమర్శలు రావడంతో రాజేష్ ఆమెను పనిలోకి పంపించడం ఆపేశాడు. ఈ పరిణామాలన్నీ రాజేష్‌ను తీవ్ర డిప్రెషన్‌లోకి నెట్టాయి. అతను మద్యపానానికి బానిసై, తన జీవితాన్ని పూర్తిగా ట్రాక్ తప్పించాడు.

ఇది కూడా చదవండి : సీనియర్ నటి లక్ష్మీ కూతురు తెలుగులో తిరుగులేని నటి..! ఒకప్పుడు హీరోయిన్‌గా అదరగొట్టింది.. ఇప్పుడు ఇలా

“నేను మోసపోయాను, నా జీవితం పోయింది. నన్ను వదిలేయండి, నా గురించి ఆలోచించకండి” అని రాజేష్ చివరిగా కుటుంబ సభ్యులతో చెప్పిన మాటలను శ్రీలక్ష్మి గుర్తుచేసుకున్నారు. అతను మరో వివాహం చేసుకోవడానికి కూడా నిరాకరించాడని, తన జీవితం నాశనమైందని నమ్మాడని ఆమె తెలిపారు. రాజేష్ మరణం కుటుంబానికి తీరని లోటును మిగిల్చింది. శ్రీలక్ష్మి మాట్లాడుతూ, జీవితంలో ఒక తప్పు నిర్ణయం తీసుకుంటే, అది మనిషిని జీవితాంతం వెంటాడుతుందని, అది రాజేష్ విషయంలో నిజమైందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : అలా ఎలా మిస్ అయ్యింది గురూ..! నాని ప్యారడైజ్ సినిమాను ఈ ముద్దుగుమ్మ వదులుకుందా.?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మేకప్‌ బాక్స్‌ అనే డౌట్‌ వచ్చే రేంజ్‌లో స్మార్ట్‌ఫోన్‌
మేకప్‌ బాక్స్‌ అనే డౌట్‌ వచ్చే రేంజ్‌లో స్మార్ట్‌ఫోన్‌
వీరి కోసం చక్రం తిప్పబోతున్న భారీ గ్రహం.. ఆర్థికంగా తిరుగులేదు
వీరి కోసం చక్రం తిప్పబోతున్న భారీ గ్రహం.. ఆర్థికంగా తిరుగులేదు
IND vs AFG: భారత్‌-అఫ్గానిస్థాన్ తొలి టీ20పై క్లారిటీ..?
IND vs AFG: భారత్‌-అఫ్గానిస్థాన్ తొలి టీ20పై క్లారిటీ..?
తిరుమల వెళ్లేవారికి టీటీడీ అలర్ట్.. ఆ దర్శనాలు రద్దు
తిరుమల వెళ్లేవారికి టీటీడీ అలర్ట్.. ఆ దర్శనాలు రద్దు
ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన 260 కోట్ల బ్లాక్ బస్టర్..తెలుగులోనూ ఉంది
ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన 260 కోట్ల బ్లాక్ బస్టర్..తెలుగులోనూ ఉంది
బంగాళాఖాతంలో అల్పపీడనం..ఈ జిల్లాల్లో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం..ఈ జిల్లాల్లో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు
హువావే కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్ ధర కూడా అదిరిపోతోందిగా
హువావే కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్ ధర కూడా అదిరిపోతోందిగా
ఫీచర్లతోనే పిచ్చెక్కిస్తున్న ఐకూ జెడ్‌11 ఎక్స్‌ ఎ
ఫీచర్లతోనే పిచ్చెక్కిస్తున్న ఐకూ జెడ్‌11 ఎక్స్‌ ఎ
దేశవ్యాప్తంగా నేడు బ్యాంకులు బంద్.. ఈ సేవల్లో అంతరాయం..
దేశవ్యాప్తంగా నేడు బ్యాంకులు బంద్.. ఈ సేవల్లో అంతరాయం..
Ai+! నోవా 2 పవర్‌‌ స్మార్ట్‌ఫోన్ స్పెషాలిటీస్‌ తెలుసా
Ai+! నోవా 2 పవర్‌‌ స్మార్ట్‌ఫోన్ స్పెషాలిటీస్‌ తెలుసా