గోమాతకు సీమంతం.. అంగరంగ వైభవంగా దూడకు బారసాల.. ఉయ్యాల వేడుకకు ఊరంతా చుట్టాలు..

30 రకాల పిండి వంటలతో గ్రామస్తులందరికీ భోజనాలు సైతం ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే గత నెల 17న ఆ అవు ఓ గిత్తదూడకు జన్మనిచ్చింది. దాంతో గ్రామస్తులు ఎంతో సంతోషించారు. ఆవుకు సీమంతం ఫంక్షన్ ఏ విధంగా ఘనంగా చేశారో అదేవిధంగా దానికి పుట్టిన గిత్త దూడకు ఉయ్యాల వేడుకను సైతం చేయాలని నిశ్చయించారు. తాజాగా ఆ గిత్త దూడకు 21వ రోజున ఆంజనేయస్వామి ఆలయ సన్నిధిలో..

గోమాతకు సీమంతం.. అంగరంగ వైభవంగా దూడకు బారసాల.. ఉయ్యాల వేడుకకు ఊరంతా చుట్టాలు..
Seemantam For Cow
Follow us
B Ravi Kumar

| Edited By: Jyothi Gadda

Updated on: Dec 10, 2023 | 12:15 PM

ఏలూరు, డిసెంబర్10: ప్రతి మహిళ తన జీవిత కాలంలో ఎంతో ఇష్టంగా జరుపుకునే వేడుక సీమంతం. ఎందుకంటే తన కడుపులో బిడ్డ అంచెలంచెలుగా రూపాంతరం చెందేక్రమంలో ఆ మహిళ ఎంతగానో సంతోషిస్తుంది. అలాంటి సమయంలో ఆ మహిళలకు పండంటి బిడ్డ జన్మించాలని ఎంతో వైభవంగా భర్త తరఫు బంధువులు, ఆ మహిళ తరఫు బంధువులు అందరూ కలిసి సీమంతం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అనంతరం ఆమెకు పుట్టిన బిడ్డను 21వ రోజున అంతే ఘనంగా ఉయ్యాల వేడుక సైతం చేస్తారు. అయితే ఇది మనుషులలో సర్వసాధారణంగా జరిగే కార్యక్రమం. మరి అలాంటి గొప్ప కార్యక్రమాన్ని ఒ గోమాతకు గ్రామస్తులంతా కలిసి నిర్వహించారు. అంతేకాక అంగరంగ వైభవంగా మనుషులకు ఏమాత్రం తీసిపోనీ విధంగా ఎంతో గ్రాండ్ గా ఉయ్యాల ఫంక్షన్ సైతం నిర్వహించడం ఇప్పుడు ఏలూరు జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. ఈ విషయం తెలుసుకున్న కొందరు తాము పెంచుకునే జంతువులకు సైతం మనుషులతో సమానంగా అన్ని కార్యక్రమాలు నిర్వహించాలని పలువురు సిద్ధపడుతున్నారట..

Cradle Ceremony

ఏలూరు జిల్లా నిడమర్రు మండలం ఫత్తేపురం గ్రామంలో 21 రోజుల గిత్త దూడకు ఉయ్యాల ఫంక్షన్ గ్రామస్తులు కన్నుల పండువుగా నిర్వహించారు. గ్రామానికి చెందిన నడింపల్లి వాసు అనే వ్యక్తి మూడేళ్ల క్రితం ఓ అవుకు వెంకటలక్ష్మి అనే పేరు నామకరణం చేసి స్థానిక ఆంజనేయ స్వామి ఆలయానికి దానంగా ఇచ్చారు. అయితే ప్రతిరోజు ఆలయానికి వచ్చే భక్తులు ఆంజనేయ స్వామి తోపాటు ఆవుని గోమాతగా భావించి దానికి సైతం పూజలు చేసేవారు. కొంతకాలం క్రితం ఆ ఆవు గర్భం దాల్చింది. దాంతో గ్రామస్తులు అందరూ కలిసి గర్భం దాల్చిన మహిళలకు నెలలు నిండిన తర్వాత ఏ విధంగా అయితే సీమంతం చేస్తారో అదేవిధంగా ఆవుకు కూడా సీమంతం  చేయాలని నిశ్చయించారు.

విజయదశమి రోజున గ్రామస్తులు అందరూ కలిసి ఆవుకి సీమంతం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమం అనంతరం 30 రకాల పిండి వంటలతో గ్రామస్తులందరికీ భోజనాలు సైతం ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే గత నెల 17న ఆ అవు ఓ గిత్తదూడకు జన్మనిచ్చింది. దాంతో గ్రామస్తులు ఎంతో సంతోషించారు. ఆవుకు సీమంతం ఫంక్షన్ ఏ విధంగా ఘనంగా చేశారో అదేవిధంగా దానికి పుట్టిన గిత్త దూడకు ఉయ్యాల వేడుకను సైతం చేయాలని నిశ్చయించారు. తాజాగా ఆ గిత్త దూడకు 21వ రోజున ఆంజనేయస్వామి ఆలయ లోగిళ్ళ వద్ద వస్త్రంతో ఉయ్యాలను ఏర్పాటుచేసి ఆ గిత్త దూడను అందులో ఉంచి ఊపుతూ మహిళలు మంగళ హారతులు పాడారు.

ఆ గిత్త దూడ నుదుటికి బొట్టు పెట్టి, అక్షింతలు వేస్తూ దానిని ఆశీర్వదించారు. అంతేకాకుండా ఉయ్యాలను రంగురంగుల బెలూన్లు, పూలతో డెకరేట్ చేశారు. ప్రస్తుతం ఈ గిత్త దూడ ఉయ్యాల వేడుక ఏలూరు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఓ గోమాతకు జన్మించిన గిత్త దూడకు గ్రామస్తులు అందరూ కలిసి సొంత కుటుంబ సభ్యులు లాగా ఉయ్యాలవేడుక నిర్వహించడంతో పలువురు వారిని అభినందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..