Chicken Rates : భారీగా తగ్గిన చికెన్‌ ధరలు.. తెగ ఎంజాయ్ చేస్తున్న చికెన్ ప్రియులు.. కిలో ఎంతంటే..

ఎంతో కష్టపడి, లక్షల్లో పెట్టుబడి పెట్టి  కోళ్ల పెంపకం చేస్తుంటే.. ధరలు పడిపోవడంతో దాన ఖర్చులు కూడా గిట్టుబాటు అవ్వడం లేదని ఆందోళన చెందుతున్నారు కోళ్ల పెంపకందారులు.  చికెన్ రేట్లు పడిపోవడానికి ఈనెల కార్తీక మాసం కావడంతో కోళ్ల రేట్లు పడిపోయాయని మరో పది పదిహేను రోజుల్లో కోళ్ల రేట్లు పెరిగే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు వ్యాపారులు. ఇప్పటికే... పౌల్ట్రీ పరిశ్రమ ఆర్థిక ఇబ్బందులు పడుతుంది.. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు..

Chicken Rates : భారీగా తగ్గిన చికెన్‌ ధరలు.. తెగ ఎంజాయ్ చేస్తున్న చికెన్ ప్రియులు.. కిలో ఎంతంటే..
Chicken
Follow us
G Sampath Kumar

| Edited By: Jyothi Gadda

Updated on: Dec 10, 2023 | 1:50 PM

కరీంనగర్, డిసెంబర్10; ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కడ చూసినా చికెన్ కొనడానికి ఆసక్తి చూపుతున్నారు మాంసం ప్రియులు. గత నాలుగునెలల క్రితం కిలో 3 వందల రూపాయలు దాటిన చికెన్ ధరలు.. ఇప్పుడు కిలోకు ఏకంగా 120 నుంచి 140 లకు పడిపోయింది. దీంతో మాంసం ప్రియులు ఎగబడుతున్నారు. కిలో తీసుకునే బదులు రెండు మూడు కిలోలు తీసుకుంటున్నారు. చికెన్ వంటకాలలో వివిధ రకాల చికెన్ వెరైటీస్ వండుకొని తినడానికి ఇష్టపడుతున్నారు.

మరోవైపు చికెన్ ధరలు భారీగా పడిపోవడంతో చికెన్ వ్యాపారులు సైతం బిజీ అయిపోయారు. కూడా రోజువారి అమ్మకాల కంటే చికెన్ రేట్లు పడిపోవడంతో ఎక్కువ కొనుగోళ్లు జరుగుతున్నాయని చెబుతున్నారు. దీంతో చికెన్ షాపులకు లాభాలు వస్తున్నాయని చెబితున్నారు. ధరలు భారీగా తగ్గడంతో చికెన్ ఎక్కువ కొనుగోలు చేయడానికి వస్తున్నారని ఒక షాపు యజమాని తెలిపారు. గత నాలుగు నెలల క్రితం చూస్తే ఒక కిలో చికెన్ ధర రూ. 300 పైగా ఉండేదని అందులో భాగంగా పౌల్ట్రీ రైతులు ఎక్కువ కోళ్లను పెంచి అధిక లాభాలు గడిస్తామని గంపెడాశతో అధిక కోళ్లు పెంచారనీ అంటున్నారు. దాంతో  ఒక్క సారిగా రేటు డమాల్ కావడంతో కోళ్ల ధర పడిపోయిందని అంటున్నారు.

ఎంతో కష్టపడి, లక్షల్లో పెట్టుబడి పెట్టి  కోళ్ల పెంపకం చేస్తుంటే.. ధరలు పడిపోవడంతో దాన ఖర్చులు కూడా గిట్టుబాటు అవ్వడం లేదని ఆందోళన చెందుతున్నారు కోళ్ల పెంపకందారులు.  చికెన్ రేట్లు పడిపోవడానికి ఈనెల కార్తీక మాసం కావడంతో కోళ్ల రేట్లు పడిపోయాయని మరో పది పదిహేను రోజుల్లో కోళ్ల రేట్లు పెరిగే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు వ్యాపారులు.

ఇవి కూడా చదవండి

ఇప్పటికే… పౌల్ట్రీ పరిశ్రమ ఆర్థిక ఇబ్బందులు పడుతుంది.. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.. చికెన్ ప్రియులు ఎంజాయ్ చేస్తున్నా.. రైతులు ఇబ్బంది పడుతున్నారు.. తమను ఆడుకోవాలని ప్రభుత్వం కు విన్నవిస్తున్నారు..

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..