Hyderabad: ఆస్పత్రికి వెళ్లి కేసీఆర్‌ను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరామర్శించారు. సోమాజిగూడ యశోద ఆస్పత్రికి వెళ్లిన రేవంత్ రెడ్డి.. కేసీఆర్‌ను కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. కాగా, తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స అనంతరం కేసీఆర్ కోలుకుంటున్నారు.
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను తాజా సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి వెళ్లిన సీఎం రేవంత్.. కేసీఆర్‌ను కలిశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులతో కూడా కాసేపు మాట్లాడారు. రేవంత్ రెడ్డి వెంట మంత్రి సీతక్క, కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, వేం నరేందర్ రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. ‘‘చంద్రశేఖర్ రావు గారిని పరామర్శించాను.. ఆయన ప్రమాదవశాత్తూ పడిపోవడంతో గాయమైంది. సర్జరీ అనంతరం క్రమంగా కోలుకుంటున్నారు. కేసీఆర్ ట్రీట్మెంట్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. ఈ మేరకు ఇప్పటికే సీఎస్, సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఆయన త్వరగా కోలుకొని అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నా. తెలంగాణ ప్రజల సమస్యలపై సభలో కేసీఆర్ మాట్లాడాలి. ఎంతో అనుభవం ఉన్న ఆయన సలహాలు, సూచనలు తీసుకుంటాం’’ అని చెప్పారు.
కేసీఆర్‌ను పరామర్శించిన అనంతరం రేవంత్ ఏమన్నారో దిగువన వీడియోలో చూడండి…
#WATCH | Hyderabad: Telangana CM Revanth Reddy arrived at Yashoda Hospitals to meet former CM and BRS chief KCR
He underwent a total left hip replacement surgery after he fell in his farmhouse in Erravalli, on December 7. pic.twitter.com/AQ67Ks0gFW
— ANI (@ANI) December 10, 2023
కాగా, గురువారం రాత్రి ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లోని బాత్రూంలో కేసీఆర్ జారిపడటంతో ఎడమ తుంటికి గాయమైన విషయం తెలిసిందే. దీంతో యశోద ఆసుపత్రి వైద్యులు కేసీఆర్‌కు శుక్రవారం రాత్రి తుంటి మార్పిడి సర్జరీ చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు వైద్యులు. వాకర్ సాయంతో నడిపించేందుకు యత్నం చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..