Watch Video: అడవికి రాజు సింహం.. ప్రాణభయంతో ఎలా పరుగులు తీస్తుందో తెలుసా..? వైరలవుతున్న వీడియో..

సింహం వెనుదిరిగే నడిచే దృశ్యాన్ని పలువురు ఎగతాళి చేస్తున్నారు. అడవికి సింహం రాజుగా ఎవరు ప్రకటించారు.? అది తప్పు అంటూ చాలా మంది దీన్ని షేర్ చేశారు. ఈ వీడియో చూసి చాలా మంది షాక్ అవుతున్నారు. ఈ వీడియోలు చూస్తే ఖడ్గమృగాలు అడవికి రాజులుగా మారాలి అంటున్నారు మరికొందరు నెటిజన్లు. ఇలా ఈ వీడియోపై రకరకాల ఫన్నీ కామెంట్స్ కూడా వస్తున్నాయి.

Watch Video: అడవికి రాజు సింహం.. ప్రాణభయంతో ఎలా పరుగులు తీస్తుందో తెలుసా..? వైరలవుతున్న వీడియో..
Rhinoceros
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 11, 2023 | 8:42 AM

ఖడ్గమృగం ఎంత బలమైన జంతువో మనందరికీ తెలిసినప్పటికీ, అది సింహం కంటే బలంగా, దూకుడుగా ఉండదని కూడా తెలిసిందే. కానీ, ఖడ్గమృగాన్ని చూసి సింహం పారిపోతున్న వీడియో చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అడవికి రాజైన, మృగరాజు పిరికితననం చూపించే వీడియో ఒకటి వైరల్ అవుతోంది. వీడియో చూస్తే మీలో అనేక సందేహాలు కలుగమానదు. ఖడ్గమృగాన్ని చూసి సింహం ఎందుకు భయపడింది? సమస్య ఏమిటనే సందేహం సర్వత్ర వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళితే..

సింహం అడవికి రాజు అని నమ్ముతారు. సింహాన్ని చూసి అన్ని జంతువులూ భయపడతాయి. అయితే సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో మాత్రం సింహం భయంతో పారిపోవటం కనిపించింది. రెండు ఖడ్గమృగాలు అడవిలో నడుచుకుంటూ వెళ్తుండగా దారిలో అడ్డుగా రెండు సింహాలు పడుకుని ఉన్నాయి. ఏదో జంతువు వస్తున్నట్టుగా అలికిడి వినబడగానే..ఆ రెండు సింహాలు నిద్రలేచి చూస్తాయి. ఇక అంతే… ఆ మరుక్షణంలోనే అక్కడ్నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాయి. ప్రాణాలు కాపాడుకోవటం కోసం పక్కదారి గుండా పరుగులు తీశాయి. వీడియో చూస్తే.. ఈ ఖడ్గమృగాలు సింహాలపై దాడి చేయబోతున్నట్లు అనిపించలేదు. కానీ, వాటిని చూడగానే ఆ రెండు సింహాలు భయపడి పారిపోవడం ఆశ్చర్యంగా ఉంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో X వెబ్‌సైట్‌లో @AMAZlNGNATURE ఖాతా ద్వారా షేర్‌ చేశారు. వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు అడవికి రాజు ఎవరు? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ వీడియోను ది ఫిగన్ ట్విట్టర్ ఖాతాలో కూడా షేర్ చేశారు. ఈ వీడియోను వేలాది మంది వీక్షించారు.

సింహం వెనుదిరిగే నడిచే దృశ్యాన్ని పలువురు ఎగతాళి చేస్తున్నారు. అడవికి సింహం రాజుగా ఎవరు ప్రకటించారు.? అది తప్పు అంటూ చాలా మంది దీన్ని షేర్ చేశారు. ఈ వీడియో చూసి చాలా మంది షాక్ అవుతున్నారు. ఈ వీడియోలు చూస్తే ఖడ్గమృగాలు అడవికి రాజులుగా మారాలి అంటున్నారు మరికొందరు నెటిజన్లు. ఇలా ఈ వీడియోపై రకరకాల ఫన్నీ కామెంట్స్ కూడా వస్తున్నాయి.

అయితే, ఇంతకు ముందు ఖడ్గమృగాలు నదిలో నీళ్లు తాగుతుండగా, వాటిని చూసిన సింహాలు నీళ్లు తాగకుండానే వెనుదిరిగి వెళ్లిపోయిన వీడియో వైరల్‌గా మారింది. ఇలాంటి వీడియోలు చూస్తుంటే నిజంగా అడవికి రాజు ఎవరు..? అనే సందేహం సర్వత్ర వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..