AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karthika Masam: కార్తీకమాసం చివరి సోమవారం.. భక్తులతో కిటకిటలాడుతున్న శ్రీశైల క్షేత్రం..

లక్షలాదిగా తరలివచ్చిన భక్తులకు శ్రీస్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతుంది. ముందు రోజు అర్ధరాత్రి దాటిన తరువాతి నుండే ఇక్కడి పాతాళగంగలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు. అలానే ఆలయం ముందు భాగంలో గల గంగాధర మండపం వద్ద, ఆలయ ఉత్తర శివమాడవీధిలో భక్తులు కార్తీక దీపాలను వెలిగించి కార్తీక నోములు నోచుకుంటున్నారు.

Karthika Masam: కార్తీకమాసం చివరి సోమవారం.. భక్తులతో కిటకిటలాడుతున్న శ్రీశైల క్షేత్రం..
Karthika Masam Last Monday
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Dec 11, 2023 | 10:39 AM

Share

కర్నూలు, డిసెంబర్‌11; కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు భక్తులతో రద్దీగా మారాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. పుణ్య నదుల్లో స్నానాలు ఆచరించి ఆలయాలకు చేరుకుంటున్నారు. ఆ మహా శివుడికి ఇష్టమైన పూజా సామాగ్రితో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇక, జ్యోతిర్లింగాలలో ఒకటైన నంద్యాల జిల్లా శ్రీశైలంలో భక్తుల తాకిడి పెరిగింది. కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచే కాకుండా, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి తెలంగాణ నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈరోజుతో కార్తీకమాసం ముగుస్తుండటంతో ముక్కంటి క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది.

శ్రీశైలంలో భక్తుల రద్దీ కారణంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనానికి క్యూ లైన్లు కూడా కిక్కిరిసి పోయి ఉన్నాయి. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులకు శ్రీస్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతుంది. ముందు రోజు అర్ధరాత్రి దాటిన తరువాతి నుండే ఇక్కడి పాతాళగంగలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు. అలానే ఆలయం ముందు భాగంలో గల గంగాధర మండపం వద్ద, ఆలయ ఉత్తర శివమాడవీధిలో భక్తులు కార్తీక దీపాలను వెలిగించి కార్తీక నోములు నోచుకుంటున్నారు.

కార్తీకమాసంలో భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు అవసరమైన పాలు, బిస్కెట్లు, మంచినీళ్లు, అల్పాహారం వంటి సదుపాయాలను కంపార్ట్ మెంట్లలోనే సమకూర్చినట్టుగా ఈవో పెద్దిరాజు తెలిపారు. చివరి కార్తీక సోమవారం కావడంతో రద్దీ దృష్ట్యా భక్తులందరికి శ్రీస్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నట్లు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. అలానే నేటి సాయంత్రం కార్తీక మాసం చివరి కార్తీక సోమవారం పురస్కరించుకుని ప్రధానాలయం ఈశాన్య భాగంలో ఉన్న ఆలయ పుష్కరిణి వద్ద దేవస్థానం లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి నిర్వహించనున్నారు. కార్తీక మాసంతం రేపు తెల్లవారుజాము వరకు ఉండటంతో రేపు కూడ శ్రీశైలంలో భక్తుల రద్దీ వుండే అవకాశం కూడ ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
యాక్టర్స్ లైఫ్ అంతేనా.. చివరకు ఆమె చనిపోయినప్పుడు బాడీకి తల లేదు.
యాక్టర్స్ లైఫ్ అంతేనా.. చివరకు ఆమె చనిపోయినప్పుడు బాడీకి తల లేదు.
శని అనుగ్రహం ఉన్న నక్షత్రాలు ఇవే.. ఈ నక్షత్రాల వారికి తిరుగేలేదట
శని అనుగ్రహం ఉన్న నక్షత్రాలు ఇవే.. ఈ నక్షత్రాల వారికి తిరుగేలేదట
వంతార నుంచి కొల్హాపూర్‌కు తిరిగొచ్చిన ఏనుగు మాధురి
వంతార నుంచి కొల్హాపూర్‌కు తిరిగొచ్చిన ఏనుగు మాధురి
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. 75 ఏళ్ల వృద్ధుడి అరెస్ట్
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. 75 ఏళ్ల వృద్ధుడి అరెస్ట్
వినాయకుడికి నైవేద్యంగా బెల్లం పాల తాలికలు..
వినాయకుడికి నైవేద్యంగా బెల్లం పాల తాలికలు..
ఆరోగ్యాన్ని కాపాడే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్
ఆరోగ్యాన్ని కాపాడే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్
పాలకూర రోజూ తింటే ఏం జరుగుతుంది? వీరు మాత్రం ఆచితూచి తినాత్సిందే
పాలకూర రోజూ తింటే ఏం జరుగుతుంది? వీరు మాత్రం ఆచితూచి తినాత్సిందే
‘మహేంద్రగిరి వారాహి’ రివ్యూ క్లియర్ కట్‌గా..
‘మహేంద్రగిరి వారాహి’ రివ్యూ క్లియర్ కట్‌గా..
శని అతివక్రంతో వీరికి జాక్‌పాట్..! అదృష్టం తలుపు తట్టడం ఖాయం
శని అతివక్రంతో వీరికి జాక్‌పాట్..! అదృష్టం తలుపు తట్టడం ఖాయం
రాత్రిపూట పదేపదే మెలకువ వస్తుందా? లైట్‌ తీసుకుంటే రిస్క్‌ మీకే..
రాత్రిపూట పదేపదే మెలకువ వస్తుందా? లైట్‌ తీసుకుంటే రిస్క్‌ మీకే..