AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రికార్డు స్థాయి GST వసూళ్లు..! జులైలో ఎన్ని లక్షల కోట్లు వచ్చాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు

జులై 2026లో దేశ జీఎస్టీ వసూళ్లు రూ.2.11 లక్షల కోట్లకు చేరి గత ఏడాదితో పోలిస్తే 15.4 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2 లక్షల కోట్ల మార్క్ దాటడం ఇది రెండోసారి. ఆర్థిక కార్యకలాపాలు, పన్ను వసూళ్లలో పారదర్శకత పెరగడం ఈ వృద్ధికి కారణంగా భావిస్తున్నారు.

రికార్డు స్థాయి GST వసూళ్లు..! జులైలో ఎన్ని లక్షల కోట్లు వచ్చాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు
Gst
SN Pasha
|

Updated on: Aug 01, 2026 | 1:03 PM

Share

దేశంలో జీఎస్టీ వసూళ్లు మరోసారి బలమైన వృద్ధిని నమోదు చేశాయి. కేంద్ర ఆర్థిక శాఖ శనివారం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. 2026 జులై నెలలో మొత్తం జీఎస్టీ వసూళ్లు రూ.2.11 లక్షల కోట్లకు చేరాయి. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 15.4 శాతం వృద్ధి నమోదైంది. ఆర్థిక కార్యకలాపాలు మెరుగుపడడం, వినియోగం పెరగడం, పన్ను వసూళ్లలో పారదర్శకత పెరగడం ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో రెండోసారి..

2026-27 ఆర్థిక సంవత్సరంలో నెలవారీ జీఎస్టీ వసూళ్లు రూ.2 లక్షల కోట్ల మార్క్‌ను దాటడం ఇది రెండోసారి. అంతకుముందు ఏప్రిల్ 2026లో రూ.2.43 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదై రికార్డు సృష్టించాయి. అనంతరం మే, జూన్ నెలల్లో స్వల్ప తగ్గుదల కనిపించినప్పటికీ, జులైలో మళ్లీ రూ.2 లక్షల కోట్లకు పైగా వసూళ్లు నమోదవడం ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సంకేతంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ఆర్థిక వ్యవస్థ బలపడుతున్న సంకేతాలు

జీఎస్టీ వసూళ్లలో వరుసగా నమోదవుతున్న వృద్ధి దేశీయ డిమాండ్, వ్యాపార కార్యకలాపాలు, తయారీ రంగం, సేవల రంగంలో మెరుగుదలను ప్రతిబింబిస్తోందని నిపుణులు చెబుతున్నారు. డిజిటల్ పన్ను వ్యవస్థ బలోపేతం కావడం, పన్ను ఎగవేత నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు కూడా వసూళ్ల పెరుగుదలకు దోహదపడుతున్నాయని అభిప్రాయపడుతున్నారు. జీఎస్టీ వసూళ్లు బలంగా ఉండటం వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం పెరగడంతో అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెంచేందుకు అవకాశాలు మెరుగుపడతాయని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us