AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 10: ఆడియన్స్ గెట్ రెడీ.. బిగ్ బాస్ 10 మొదలయ్యేది అప్పటినుంచేనా..? మరికొన్ని రోజుల్లోనే

బిగ్ బాస్ సీజన్ 10 త్వరలోనే ప్రారంభంకానుంది. ఇప్పటికే 9 సీజన్స్ విజయవంతగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ త్వరలోనే 10వ సీజన్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే అగ్నిపరీక్ష 2 కూడా త్వరలోనే ప్రారంభంకానుంది. బిగ్ బాస్ గేమ్ షోలో సెలబ్రెటీలు, సామాన్యులు కూడా పాల్గొంటున్నారు.

Bigg Boss 10: ఆడియన్స్ గెట్ రెడీ.. బిగ్ బాస్ 10 మొదలయ్యేది అప్పటినుంచేనా..? మరికొన్ని రోజుల్లోనే
Bigg Boss Telugu 10
Rajeev Rayala
|

Updated on: Aug 01, 2026 | 1:09 PM

Share

తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నా బిగ్ బాస్ గేమ్ షో సీజన్ 10 త్వరలోనే ప్రారంభంకానుంది. ఈ సారి మరింత ఆసక్తికరంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే పూర్తయిన 9 సీజన్స్ కూడా మంచి టీఆర్ఫీ రేటింగ్ సొంతం చేసుకున్నాయి. అలాగే గత ఏడాది నుంచి అగ్నిపరీక్ష కూడా మొదలైంది. అగ్నిపరీక్ష ద్వారా సామాన్యులను ఫిల్టర్ చేసి కొంతమందిని బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తున్నారు. అలాగే ఈసారి కూడా సామాన్యులకు అదిరిపోయే ఛాన్స్ ఇచ్చింది బిగ్ బాస్ టీమ్ త్వరలోనే అగ్నిపరీక్ష 2 మొదలు కానుంది. ఈసారి కూడా సెలబ్రెటీలతో పాటు సామాన్యులు హౌస్ లో సందడి చేయనున్నారు. అలాగే హోస్ట్ గా మరోసారి టాలీవుడ్ కింగ్ నాగార్జున అదరగొట్టనున్నారు.

ఇది కూడా చదివేయండి : రోజుకు 3లక్షలు రెమ్యునరేషన్.. మంచంపై నోట్ల కట్టలు పరుచుకుని పడుకునేది.. చివరకు అనాధలా చనిపోయింది

ఇక బిగ్ బాస్ సీజన్ 10ను మరింత పగడ్బందీగా, ఆసక్తికరంగా ఉండేలా ప్లాన్ చేస్తున్న మేకర్స్. ఇప్పటికే అగ్నిపరీక్ష 2 కోసం సామాన్యులను ఎంపిక చేసే పనిలో పడింది. కాగా ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 10 కు సంబందించిన ఓ వార్త వైరల్ అవుతుంది. బిగ్ బాస్ పదో సీజన్ సెప్టెంబర్ తొలి వారంలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబందించిన అనౌన్స్ మెంట్ ఉంటుందని తెలుస్తుంది. అంతే కాదు ఇప్పటికే ప్రోమో కూడా షూట్ అయ్యిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇది కూడా చదివేయండి : అతనికి 29, ఆమెకు 53..! 6 ఏళ్లుగా ఓటీటీని షేక్ చేస్తున్న రొమాంటిక్ సిరీస్.. ఎక్కడ చూడొచ్చంటే

రెండు రోజుల క్రితం నాగార్జునతో హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో బిగ్ బాస్ సీజన్ 10 టెలికాస్ట్ డేట్ ప్రోమో షూట్ జరిగినట్లు సమాచారం. దీని పై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సీజన్‌కు ‘దశావతారం’ అని ట్యాగ్ లైన్ తో ఈ సీజన్ ను ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ 10లో పాల్గొనేది వీరే అంటూ కొంతమంది పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బుల్లితెర నటి పల్లవి గౌడ, తేజస్విని గౌడ, నందూస్ వరల్డ్ ఫేమ్ నందన, వాసంతి కృష్ణన్ భర్త పవన్ కళ్యాణ్, ఎక్స్‌ప్రెస్ హరి, నూకరాజు, రాకింగ్ రాకేష్, ఆట సందీప్ భార్య జ్యోతి, రాయల్ మెక్ రమణ, శివ్, కడలి సత్యనారాయణ, జబర్దస్త్ వర్ష, వర్షిణీ, ప్రభాకర్ లేదా ఆయన కుమారుడు చంద్రహాస్‌, జబర్దస్త్ పవిత్రతో పాటు స్టార్ యాంకర్ వింధ్య విశాఖ కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. మరి వీరిలో ఎవరు హౌస్ లోకి వెళ్తారో చూడాలి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదివేయండి : చేతులారా జీవితాన్ని నాశనం చేసుకున్నాడు.. పెద్ద హీరో అవుతానుకుంటే.. 38ఏళ్ల వయసులోనే చనిపోయాడు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us