AP Rains: ఏపీకి మరో గండం.. దూసుకొస్తున్న తుఫాన్ ముప్పు.. ప్రజలకు హెచ్చరిక.!

ఏపీకి మరో తుఫాన్‌ ముప్పు పొంచి ఉంది అంటే అవుననే అంటోంది వాతావరణ శాఖ. మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్‎తో పంటలు దెబ్బతిని.. రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరద బాధితులను ఆదుకోవడంతో పాటు.. పంట నష్టాన్ని ప్రభుత్వం అంచనా వేస్తుండగానే.. గండం మరో తుఫాన్ రూపంలో ముంచుకొస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

AP Rains: ఏపీకి మరో గండం.. దూసుకొస్తున్న తుఫాన్ ముప్పు.. ప్రజలకు హెచ్చరిక.!
AP Rains
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 11, 2023 | 8:51 AM

ఏపీకి మరో తుఫాన్‌ ముప్పు పొంచి ఉంది అంటే అవుననే అంటోంది వాతావరణ శాఖ. మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్‎తో పంటలు దెబ్బతిని.. రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరద బాధితులను ఆదుకోవడంతో పాటు.. పంట నష్టాన్ని ప్రభుత్వం అంచనా వేస్తుండగానే.. గండం మరో తుఫాన్ రూపంలో ముంచుకొస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ వార్నింగ్ బెల్స్‌ రైతులను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి.

మిచౌంగ్ తుఫాన్ తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపింది. తాజాగా మరో తుఫాన్ రైతులను భయపెడుతోంది. 24 గంటల్లో అల్పడనంగా ఏర్పడనుంది. ఈ తుఫాన్ వాతావరణం తెలుగు రాష్ట్రాల వైపు కదులుతున్నట్టుగా ఐఎండీ వెల్లడించింది. రానున్న ఐదు రోజుల పాటు కేరళ, తమిళనాడు, పుదుచ్చేరితో పాటు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆగ్నేయ అరేబియాలో తుఫాన్ వాతావరణం ఉందని ఐఎండీ తెలిపింది. ఇది మాల్దీవుల పక్కనే సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. దీంతో అల్పపీడనం ఏర్పడునున్నట్లు భారత వాతావరణశాఖ తెలిపింది.

రానున్న 5 రోజులపాటు కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, లక్షద్వీప్‎లో వర్షాలు కురుస్తాయని.. కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ముఖ్యంగా కేరళపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ఇది తమిళనాడు, కేరళ, కర్నాటకను దాటుకుని రావడానికి కొంత సమయం పట్టినప్పటికీ… ఈ అల్పపీడనం భారీ తుఫాన్‎గా ఏర్పడే అవకాశం ఉన్నట్టు హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్ వైపుగా వస్తే డిసెంబర్ 21, 22, 23, 24, 25 తేదీల వరకు వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈసారి తుఫాన్‎తో భారీ ముప్పు సంభవించే అవకాశం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. రైతులు తమ పనులను డిసెంబర్ 15వ తేదీ లోపు పూర్తి చేసుకోవాలని వాతావరణ అధికారులు సూచిస్తున్నారు.

నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట