Congress: ఇక ఏపీ వంతు.. తెలంగాణ గెలుపు జోష్‌తో హస్తం పార్టీలో కదలికలు.. ప్లాన్ ఇదేనా.!
'మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి'.. నినాదం వర్కవుటయింది. తెలంగాణలో మార్పు వచ్చింది. కాంగ్రెస్ అధికారంలో కొలువు దీరింది. మరి ఏపీలో మాటేంటి? ఈ నినాదమే ఏపీ కాంగ్రెస్ సంవిధానం కాబోతుందా? కర్నాటక గెలుపుతో తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్. ఇప్పడు తెలంగాణ గెలుపుతో ఇక ఏపీలో కాంగ్రెస్ మళ్లీ లైమ్‌లైట్‌లోకి రాబోతుందా?
‘మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి’.. నినాదం వర్కవుటయింది. తెలంగాణలో మార్పు వచ్చింది. కాంగ్రెస్ అధికారంలో కొలువు దీరింది. మరి ఏపీలో మాటేంటి? ఈ నినాదమే ఏపీ కాంగ్రెస్ సంవిధానం కాబోతుందా? కర్నాటక గెలుపుతో తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్. ఇప్పడు తెలంగాణ గెలుపుతో ఇక ఏపీలో కాంగ్రెస్ మళ్లీ లైమ్‌లైట్‌లోకి రాబోతుందా?
ఏపీలో చాన్నాళ్ల తరువాత కాంగ్రెస్ యాక్టివిటీ తెరపైకి వచ్చింది. తుఫాన్ నష్టం-రైతుల కష్టంపై ఏపీ కాంగ్రెస్ పల్లెబాట పట్టింది. బాధితులను పరామర్శించడం.. న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం సహా వంద రోజుల్లో ఏపీలో నిశ్శబ్దవిప్లంగా మార్పు ఖాయమని ధీమాగా చెప్పారు గిడుగు రుద్రరాజు. ఇదీ ఏపీలో కాంగ్రెస్‌కు గొడుగు పట్టిన పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు సందేశం. గత ఎన్నికల్లో టీడీపీకి బై బై అంటూ ప్రచారం చేసిన షర్మిల.. ఈసారి ఎవరికి జై కొట్టబోతున్నారు? ఏపీ రాజకీయాల్లోకి షర్మిల వచ్చే అవకాశం ఉందన్నారు గిడుగు రుద్రరాజు. ఆమె కాంగ్రెస్‌లోకి వస్తే స్వాగతిస్తామని ఎప్పటి నుంచో చెప్తున్నారాయన.
త్వరలో ఏపీలో రాహుల్ , ప్రియాంక గాంధీ పర్యటిస్తారన్నారు. రాహుల్ నాయకత్వంలో విశాఖ స్టీల్‌ప్లాంట్ ఉద్యమం.. ప్రియాంక సారథ్యంలో అమరావతి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారాయన. కర్నాటక, తెలంగాణలో గెలుపు పిలుపుతో ఏపీ కాంగ్రెస్‌లోనూ జోష్ వచ్చింది. మరి కర్నాటకలో ఐదు గ్యారెంటీలు.. తెలంగాణలో ఆరు గ్యారెంటీలు ప్రకటించారు. ఆ లెక్కన సింబాలిక్‌గా ఏపీలో ఏడు గ్యారెంటీలు ప్రకటిస్తారా? ఆ ఏడింటిలో ఏపీకి ప్రత్యేక హోదా ప్రధాన హామీ కాబోతుందా? అటు మాజీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి పొలిటికల్‌గా మళ్లీ యాక్టివ్ కావాలని కోరుతూ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు మడకశిరలో వెయ్యి బైకులతో భారీ ర్యాలీ నిర్వహించారు. కల్యాణదుర్గం నుంచి పోటీ చేయాలని.. పార్టీని నడిపించాలని ఆయను కోరారు. కర్నాటక,తెలంగాణలో గెలుపు పిలుపుతో మొత్తానికి ఏపీ కాంగ్రెస్‌లోనూ కదలిక వచ్చింది. ఇక వాట్ నెక్ట్స్ అనేది వేచి చూడాల్సిందే.