AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీలో ఓట్ల పంచాయితి.. వైసీపీ, టీడీపీ నాయకుల పోటాపోటీ విమర్శలు

ఈ నియోజకవర్గం, ఆ నియోజకవర్గం అనే తేడా లేదు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఏపీలో ఎక్కడ చూసినా ఒక్కటే పంచాయితీ.. అదే ఓట్ల పంచాయితీ. మరో మూడు నెలల్లో ఓట్ల పండుగ రాబోతున్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య ఈ ఓట్ల వార్ పీక్ స్టేజికి వెళ్లింది. ప్రతి జిల్లాలో వైసీపీ, టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు పోటాపోటీగా ఈసీకి ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు

Andhra Pradesh: ఏపీలో ఓట్ల పంచాయితి.. వైసీపీ, టీడీపీ నాయకుల పోటాపోటీ విమర్శలు
YSRCP vs TDP
Basha Shek
|

Updated on: Dec 11, 2023 | 6:22 AM

Share

ఈ నియోజకవర్గం, ఆ నియోజకవర్గం అనే తేడా లేదు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఏపీలో ఎక్కడ చూసినా ఒక్కటే పంచాయితీ.. అదే ఓట్ల పంచాయితీ. మరో మూడు నెలల్లో ఓట్ల పండుగ రాబోతున్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య ఈ ఓట్ల వార్ పీక్ స్టేజికి వెళ్లింది. ప్రతి జిల్లాలో వైసీపీ, టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు పోటాపోటీగా ఈసీకి ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. లేటెస్ట్‌గా జగ్గయ్యపేటలో ఓట్ల వ్యవహారం రగడ రేపుతోంది. ఫారం-7 ద్వారా టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య ఆరోపించారు. టీడీపీకి సానుకూలంగా ఉండే మహిళల ఓట్లు తొలగించి.. వైసీపీ సానుభూతిపరుల ఓట్లు మాత్రమే ఉంచుతున్నారని ఆరోపించారు. ఒక వ్యక్తికి ఒకే పోలింగ్ బూత్‌లో మూడు ఓట్లున్నా తొలగించడం లేదనేది టీడీపీ నేతల ఆరోపణ. దీనిపై కలెక్టర్‌కి ఫిర్యాదు చేశారు ఎన్టీఆర్ జిల్లా టీడీపీ నేతలు. టీడీపీ నేతల ఆరోపణలకు వైసీపీ కౌంటర్ ఇచ్చింది. టీడీపీ నాయకులే వైసీపీ ఓట్లను తొలగించాలని ఫారం- 7 ఇస్తున్నారని ఆరోపించారు. ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉంటే తొలగించాల్సిందేనన్నారు.

జనవరి 5వ తేదీ నాటికి తప్పుల్లేని తుది ఓటర్ల జాబితా విడుదల చేయాల్సి ఉంది. దీంతో మిగతా సమస్యలను పక్కనపెట్టి కేవలం ఓట్ల వ్య‌వ‌హారంపైనే దృష్టి పెట్టింది టీడీపీ. అయితే.. టీడీపీ చేస్తున్న ప్ర‌చారానికి వైసీపీ కౌంటర్‌ ఇస్తోంది. అస‌లు దొంగ ఓట్ల వ్య‌వ‌హారం అంతా టీడీపీదేన‌ని, ఇంటింటికీ తిరుగుతూ వైసీపీ సానుభూతిప‌రుల ఓట్ల‌ను తొల‌గిస్తున్నారని ఆరోపిస్తోంది. ఈ పంచాయితీని కేంద్ర ఎన్నికల సంఘం ఎలా పరిష్కరిస్తుందో చూడాలి. మరోవైపు  ఎన్నిక‌లకు మ‌రో ఐదు నెల‌లు మాత్ర‌మే గ‌డువు ఉన్న స‌మ‌యంలో ఓట్ల తొల‌గింపు పై రోజుకో ఫిర్యాదు రావ‌డం అటు ఈసీతో పాటు ఇటు పార్టీల్లో కూడా ఆందోళ‌న మొద‌లైంది. రెండు ప్ర‌ధాన పార్టీలు త‌మ సానుభూతిప‌రుల ఓట్లు తొల‌గించేస్తున్నారంటూ ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోెసం ఇక్కడ క్లిక్ చేయండి..

సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు