AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parenting: మీరు కూడా పిల్లలతో ఇలాగే మాట్లాడుతున్నారా.? వెంటనే ఆపేయండి..

ల్లలు తప్పు చేస్తే బెదిరించడం, కొన్ని సందర్భాల్లో చేయి చేసుకోవడం కూడా సర్వసాధారణమైన విషయమే అయితే. తెలిసీతెలియని వయసులో పెద్దలు అనే మాటలు వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. పేరెంట్స్‌ ఎట్టి పరిస్థితుల్లో తమ పిల్లల ముందు కొన్ని మాటలు మాట్లాడకూదని సూచిస్తున్నారు. ఇంతకీ మానసిక నిపుణులు చెబుతోన్న ఆ విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Parenting: మీరు కూడా పిల్లలతో ఇలాగే మాట్లాడుతున్నారా.? వెంటనే ఆపేయండి..
Parenting Tips
Narender Vaitla
|

Updated on: Dec 14, 2023 | 5:33 PM

Share

పిల్లల సంరక్షణ విషయంలో పెద్దలు ఎంతో జాగ్రత్తగా ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో అతి అజ్రగత్తతో చేయకూడని తప్పులు కూడా చేస్తుంటారు. పిల్లలు తప్పు చేస్తే బెదిరించడం, కొన్ని సందర్భాల్లో చేయి చేసుకోవడం కూడా సర్వసాధారణమైన విషయమే అయితే. తెలిసీతెలియని వయసులో పెద్దలు అనే మాటలు వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. పేరెంట్స్‌ ఎట్టి పరిస్థితుల్లో తమ పిల్లల ముందు కొన్ని మాటలు మాట్లాడకూదని సూచిస్తున్నారు. ఇంతకీ మానసిక నిపుణులు చెబుతోన్న ఆ విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* కొందరు పేరెంట్స్ కోపంలో చిన్నారులను దూషిస్తుంటారు. చెప్పిన మాట వినడం లేదనో, చదువుకోవడం లేదనో ఇంటి నుంచి బయటకు వెళ్లమని అంటుంటారు. అయితే ఇలా ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. పిల్లలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అంటున్నారు. మీరు కోపంతో అన్న మాటలను పిల్లలు సీరియస్‌గా తీసుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

* ఇక పిల్లలను ఇతరులతో పోల్చడం చాలా మంది పేరెంట్స్‌ చేస్తుంటారు. ఇలా చేస్తే పిల్లల్లో ఆత్మవిశ్వాసం తగ్గుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఏ ఇద్దరి పిల్లలు మనస్తత్వం, ఆలోచన శక్తి ఒకేలా ఉండదు కాబట్టి ఒకరితో మరొకరిని ఎట్టి పరిస్థితుల్లో పోల్చకూడదని సూచిస్తున్నారు.

* ఆలోచన శక్తి ఎలాగైతే ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయో సామర్థ్యాలు కూడా భిన్నంగా ఉంటాయి. కాబట్టి పిల్లలు చేసే పని ఆధారంగా వారిని అవహేళన చేయొద్దు. ఇలా చేయడం వల్ల చిన్నారుల్లో ఆత్మన్యూనత భావం ఏర్పడే ప్రమాదం ఉంటుంది. దీంతో భవిష్యుత్తులో వారి మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని చెబుతున్నారు.

* ఇక కొన్ని సందర్భాల్లో పేరెంట్స్‌ విపరీతమైన కోపంతో నోటికొచ్చింది తిండుతుంటారు. తల్లిదండ్రుల కోరికలను, ఆశలను చిన్నారులపై రుద్దుతూ ఆ లక్ష్యాలను చేరుకోవాలని ఒత్తిడి చేస్తుంటారు. అంతటితో ఆగకుండా ఇలాంటి పిల్లలు ఎవ్వరికీ పుట్టొద్దు అంటూ మాట్లాడుతుంటారు. కానీ ఇలాంటి మాటలు ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడకూడదని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల.. చిన్నారులకు మీపై ప్రతికూల భావన కలిగేలా చేస్తుంది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..