Sun Temple Konark: శీతాకాలంలో ఈ ప్లేస్‌ను సందర్శించండి .. అద్భుతమైన అనుభూతి మీ సొంతం..
సుమారు 800 సంవత్సరాల పురాతనమైన ఈ ఆలయం ఇప్పటికీ దేశ, విదేశాల పర్యాటకులను ఆకర్షిస్తుంది. అయితే శీతాకాలంలో ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే.. కోణార్క్ సూర్య దేవాలయం బెస్ట్ ఎంపిక. కోణార్క్ సూర్య దేవాలయం సముదాయంలో ప్రధాన దేవాలయం ఎత్తు సుమారు 227 అడుగులు. ఇది భారతదేశంలోని అన్ని దేవాలయాల్లో ఎత్తైనది. ఇది సూర్య భగవానుడి రథం రూపంలో నిర్మించబడింది. దీనికి 7 గుర్రాలు, 24 చక్రాలు ఉన్నాయి. ఈ ఆలయ నిర్మాణ శైలీ.. చెక్కడం కూడా చాలా అద్భుతంగా ఉంది.
భారత దేశం ఆధ్యాత్మిక ప్రదేశం. అనేక పుణ్యక్షేత్రాలున్నాయి. అయితే సూర్యదేవాలయాలు మాత్రం అతి తక్కువ. వాటిల్లో ఒకటి కోణార్క్. ఇది బంగాళాఖాతం తీరంలో ఉంది. ఇక్కడ ఉన్న సూర్య దేవాలయం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఒడిషాలో ఉన్న కోణార్క్ చారిత్రక ప్రాధాన్యతతో ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని 12వ శతాబ్దానికి చెందిన రాజు నరసింహ దేవ్ I నిర్మించాడని చారిత్రక కథనం. సుమారు 800 సంవత్సరాల పురాతనమైన ఈ ఆలయం ఇప్పటికీ దేశ, విదేశాల పర్యాటకులను ఆకర్షిస్తుంది. అయితే శీతాకాలంలో ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే.. కోణార్క్ సూర్య దేవాలయం బెస్ట్ ఎంపిక.
కోణార్క్ సూర్య దేవాలయం సముదాయంలో ప్రధాన దేవాలయం ఎత్తు సుమారు 227 అడుగులు. ఇది భారతదేశంలోని అన్ని దేవాలయాల్లో ఎత్తైనది. ఇది సూర్య భగవానుడి రథం రూపంలో నిర్మించబడింది. దీనికి 7 గుర్రాలు, 24 చక్రాలు ఉన్నాయి. ఈ ఆలయ నిర్మాణ శైలీ.. చెక్కడం కూడా చాలా అద్భుతంగా ఉంది.
ఈ రోజు ఈ ఆలయానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం..
సరైన సమయం తెలుసుకోవచ్చు
ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రథచక్రాల చువ్వలపై సూర్యుని కిరణాలను చూసి కచ్చితమైన సమయాన్ని తెలుసుకోవచ్చు. దీని అద్భుతమైన నిర్మాణం కారణంగా UNESCO ఈ సూర్య దేవాలయాన్ని 1984లో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. అందమైన ఆలయాన్ని శీతాకాలంలో సందర్శించడానికి ప్లాన్ చేసుకోవచ్చు.
అస్తరాంగ్ బీచ్
సూర్యదేవాలయంతో పాటు ఇక్కడ నుండి 19 కిలోమీటర్ల దూరంలో ఉన్న అస్తరాంగ్ బీచ్ కూడా మంచి సందర్శనీయమైన ప్రాంతం. ఈ బీచ్ లో సూర్యాస్తమయం చూడడం అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. ఇక్కడ చేపల మార్కెట్ ప్రసిద్ధి. అంతేకాదు ఇక్కడ చేపలు పట్టడం, వంట చేయడం, వివిధ రకాల చేపలతో చేసిన వంటలు ఆనందించవచ్చు. అంతేకాదు కోణార్క్ మ్యూజియాన్ని సందర్శించవచ్చు. ఇక్కడ మీరు అనేక శిల్పాలు, ఇతర నాగరికతల అవశేషాలను చూడవచ్చు.
ఇక్కడ సందర్శించడానికి బెస్ట్ టైమ్
కోణార్క్ సందర్శించడానికి ఉత్తమ సమయం అక్టోబర్ నుండి మార్చి వరకు. ఈ కాలంలో ఇక్కడ వేడి ఉండదు. ఈ 5 నెలల్లో కోణార్క్ కు వెళ్ళడానికి ప్రయాణాన్ని సులభంగా ప్లాన్ చేసుకోవచ్చు.
ఎలా వెళ్ళాలంటే
ఈ క్షేత్రానికి పూరి , భువనేశ్వర్ రెండింటి నుండి రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. అంతేకాదు రైలు సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. అయితే విమానంలో వెళ్లాలని ప్లాన్ చేసినట్లు అయితే భువనేశ్వర్ విమానాశ్రయం సమీపంలో ఉంది.
మరిన్ని టూరిజం వార్తల కోసం క్లిక్ చేయండి..