- Telugu News Photo Gallery Kenya to become visa free from January 2024, check here is details in Telugu
Travel News: కెన్యా వెళ్లాలనుకునే వారికి గుడ్ న్యూస్.. ఇకపై వీసా అవసరం లేదు!
కెన్యా వెళ్లడానికి ఇకపై వీసా అవసరం లేదు. ఈ చట్టం జనవరి 2024 నుండి అమల్లోకి వస్తుంది. పర్యాటకాన్ని, ప్రపంచ సంబంధాలను పెంపొందించడానికి ఒక ముఖ్యమైన చర్యగా.. కెన్యా అధ్యక్షుడు విలియం రూటో ఈ విషయాన్ని వెల్లడించారు. జనవరి నుండి కెన్యా వెళ్లడానికి వీసా అవసరం లేదని ప్రకటించారు. దుర్భరమైన వీసా దరఖాస్తు ప్రక్రియను సమర్థవంతంగా తొలగిస్తుందని అధ్యక్షుడు రూటో నొక్కి చెప్పారు. బ్రిటన్ నుడి కెన్యా స్వాతంత్ర్యం పొందిన 60 సంవత్సరాలను గుర్తు చేస్తూ..
Updated on: Dec 14, 2023 | 6:42 PM

కెన్యా వెళ్లడానికి ఇకపై వీసా అవసరం లేదు. ఈ చట్టం జనవరి 2024 నుండి అమల్లోకి వస్తుంది. పర్యాటకాన్ని, ప్రపంచ సంబంధాలను పెంపొందించడానికి ఒక ముఖ్యమైన చర్యగా.. కెన్యా అధ్యక్షుడు విలియం రూటో ఈ విషయాన్ని వెల్లడించారు. జనవరి నుండి కెన్యా వెళ్లడానికి వీసా అవసరం లేదని ప్రకటించారు. దుర్భరమైన వీసా దరఖాస్తు ప్రక్రియను సమర్థవంతంగా తొలగిస్తుందని అధ్యక్షుడు రూటో నొక్కి చెప్పారు.

బ్రిటన్ నుడి కెన్యా స్వాతంత్ర్యం పొందిన 60 సంవత్సరాలను గుర్తు చేస్తూ.. నైరోబీలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ.. ప్రెసిడెంట్ రూటో ప్రయాణ విధానాలను సులభతరం చేస్తున్నట్లు చెప్పారు. కెన్యాను సందర్శించడానికి వీసా కోసం దరఖాస్తు చేసుకునే భారాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వ్యక్తులు ఇకపై భరించని ఆయన ప్రకటించారు.

ప్రెసిడెంట్ రూటో గతంలో అక్టోబర్ లో రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో జరిగిన సమావేశంలో వీసా మినహాయింపుల కోసం తన ప్రణాళికలను వివరించాడు. అక్కడ ఆఫ్రికన్ దేశాల పౌరులు 2023 చివరి నాటికి వీసా లేకుండా కెన్యాను సందర్శించగలరని ఆయన ప్రకటించారు.

ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించడానికి, ఆఫ్రికన్ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి ఈ చర్య ప్రతిబింబిస్తుంది. కెన్యా విభిన్న ప్రకృతి, దృశ్యాలు, శక్తి వంతమైన సంస్కృతికి ప్రసిద్ధి చెందింది. ఆ దేశానికి ఆర్థికంగా కీలకమైన పర్యాటకంపై ఎక్కువగా ఆధార పడుతుంది.

వీసా రద్దు చేయాలనే నిర్ణయం మరింత మంది అంతర్జాతీయ సందర్శకులను ఆకర్షించడానికి ఉద్దేశించబడింది. దేశంలోని సుందరమైన హిందూ మహా సముద్ర తీర ప్రాంతాన్ని అన్వేషించడానికి, థ్రిల్లింగ్ వన్య ప్రాణుల సఫారీలను ప్రారంభించే అవకాశాన్ని వారికి అందిస్తుంది.




