AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parliament Security Breach: లోక్‌సభ భద్రతా వైఫల్యంపై ఆందోళన.. 14 మంది కాంగ్రెస్‌ ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు

భారీ భద్రతా ఉన్నప్పటికీ కొందరు దుండగులు పార్లమెంట్‌లోనికి ప్రవేశించి అలజడి సృష్టించడం దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు నిర్వహిస్తున్న సమయంలో దాడికి పాల్పడటంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి. ఈ క్రమంలో డిసెంబర్ 14 (గురువారం)న పార్లమెంట్‌లో జరిగిన సెషన్‌లో ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. దీంతో సభ నిబంధనలు ఉల్లంఘించడం, క్రమశిక్షణా రాహిత్యంగా వ్యవహరించడంతో ఐదుగురు కాంగ్రెస్ ఎంపీలను..

Parliament Security Breach: లోక్‌సభ భద్రతా వైఫల్యంపై ఆందోళన.. 14 మంది కాంగ్రెస్‌ ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు
Congress MPs suspended
Srilakshmi C
|

Updated on: Dec 14, 2023 | 4:13 PM

Share

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 14: భారీ భద్రతా ఉన్నప్పటికీ కొందరు దుండగులు పార్లమెంట్‌లోనికి ప్రవేశించి అలజడి సృష్టించడం దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు నిర్వహిస్తున్న సమయంలో దాడికి పాల్పడటంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి. ఈ క్రమంలో డిసెంబర్ 14 (గురువారం)న పార్లమెంట్‌లో జరిగిన సెషన్‌లో ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. దీంతో సభ నిబంధనలు ఉల్లంఘించడం, క్రమశిక్షణా రాహిత్యంగా వ్యవహరించడంతో ఐదుగురు కాంగ్రెస్ ఎంపీలను లోక్‌సభ సస్పెండ్ చేసింది. సస్పెండ్ అయిన ఎంపీల్లో డీన్ కురియాకోస్, హిబీ ఈడెన్, జోతిమణి, రమ్య హరిదాస్, టీఎన్ ప్రతాపన్ ఉన్నారు. శీతాకాల సమావేశాలు డిసెంబరు 22న ముగియనుండగా, అప్పటి వరకూ ఐదుగురిని సస్పెండ్ చేస్తున్నట్లు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. ప్రతిపక్ష సభ్యులైన ఐదుగురు కాంగ్రెస్ ఎంపీలను క్రమశిక్షణా చర్యల కారణంగా సస్పెన్షన్ అయినట్లు పేర్కొన్నారు.

కాగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రియెన్ బుధవారం రాజ్యసభ నుంచి ఎగువసభ ఛైర్మన్ జగదీప్‌ ధన్‌ఖడ్‌ సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. బుధవారం మధ్యాహ్నం ఇద్దరు వ్యక్తులు విజిటర్స్ గ్యాలరీ నుంచి లోక్‌సభ ఛాంబర్‌లోకి దూకడం, తమ వద్ద ఉన్న డబ్బాల నుంచి పసుపు రంగు పొగ విడుదల చేయడంతో సభలో తీవ్ర అలజడి చెలరేగింది. బుధవారం జరిగి భద్రతా లోపంపై చర్చ జరగాలని ఓబ్రియన్ డిమాండ్ చేశారు. ఇది సభలో గందరగోళానికి దారితీసింది. దానిపై ధన్‌ఖడ్ ఆగ్రహానికి గురయ్యారు. సభ నిబంధనలు గౌరవించకపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన ఛైర్మన్‌ సెషన్‌ మొత్తం ఆయనపై సస్పెన్షన్‌ వేటు వేశారు. దీంతో ప్రతిపక్ష సభ్యులు కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు.

గందరగోళం, భద్రతా ఉల్లంఘనపై ప్రతిపక్ష ఎంపీలు నిరసనను కొనసాగించడంతో లోక్‌సభ మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా పడింది. కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేయాలనే తీర్మానాన్ని ప్రవేశపెట్టిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, వాయిదాకు ముందు సభను ఉద్దేశించి ప్రసంగించారు. భద్రతా ప్రోటోకాల్‌ను బలోపేతం చేయడానికి రాజకీయేతర విధానం అవసరమని నొక్కి చెప్పారు. పార్లమెంట్‌లో భద్రతను మరింత పటిష్టం చేసేందుకు లోక్‌సభ స్పీకర్ ఫ్లోర్ లీడర్‌లందరితో సమావేశమై వారి పరిష్కారాలను విన్నారు. ఇచ్చిన కొన్ని సూచనలను ఇప్పటికే అమలు చేశామని, ఈ అంశంపై ఎలాంటి రాజకీయాలు చేయకూడదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు.

ఇవి కూడా చదవండి

మరో 9 మందిపై సస్పెన్షన్ వేటు

3 గంటలకు సభ ప్రారంభంకాగా మరో 9 మంది కాంగ్రెస్ ఎంపీలను లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సస్పెండ్ చేశారు.  బెన్నీ బెహనన్‌, వీకే శ్రీకందన్‌, మహమ్మద్‌ జావెద్‌, పీఆర్‌ నటరాజన్‌, కనిమొళి, కె. సుబ్రహ్మణ్యం, ఎస్‌ఆర్‌ పార్థిబన్‌, ఎస్‌ వెంకటేశన్‌, మాణికం ఠాగూర్‌ను సస్పెండ్‌ చేస్తూ సభలో ప్రహ్లాద్‌ జోషీ మరో తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి సభ ఆమోదం తెలిపింది. అనంతరం రేపు ఉదయానికి లోక్‌సభ వాయిదా పడింది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రియెన్ తో కలిపి మొత్తం 15 మంది ఎంపీలను సస్పెండ్ చేసినట్లైంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.