Nalini Letter: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ డీఎస్పీ నళిని బహిరంగ లేఖ.. ఏమని విజ్ఞప్తి చేసిందంటే..!
12 ఏళ్ల క్రితం తన డీఎస్పీ పోస్టుకు రాజీనామా చేసి ఉద్యమంలోకి వెళ్లినట్టు మాజీ డీఎస్పీ నళిని తెలిపారు. అయితే ఆ తరువాత నాటి సీఎం రోశయ్య తనకు మహిళ దినోత్సవ కానుకగా తిరిగి ఉద్యోగాన్ని ఇచ్చారని చెప్పారు. అప్పుడు మళ్లీ ఉద్యోగంలో చేరిన తనకు అవమానాలు ఎదురయ్యాయని.. దీంతో మళ్లీ తాను ఉద్యమంలోకి వచ్చానని అన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ డీఎస్పీ నళిని లేఖ రాశారు. సీఎం రేవంత్ తన పట్ల చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. పోలీసు ఉద్యోగం తప్పా, ఇతర ఏ ఉద్యోగానికి తాను సరిపోనన్నారు. ఉద్యోగానికి బదులు ధర్మ ప్రచారానికి సాయం చేయాలని సీఎంను కోరారు నళిని. ప్రస్తుతం ‘వేదం యజ్ఞం’ అనే పుస్తకం రాస్తున్నానని తెలిపిన ఆమె.. త్వరలోనే ముఖ్యమంత్రిని కలుస్తానని నళిని తెలిపారు.
తనకు మళ్లీ ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ డీఎస్పీ నళిని కృతజ్ఞతలు తెలిపారు. అయితే మళ్లీ ఉద్యోగం చేసే ఆలోచన తనకు లేదని వివరణ ఇచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా బహిరంగ లేఖ రాసిన ఆమె, తన గత అనుభవాలు.. ప్రస్తుతం తాను ఏం చేస్తున్నాననే విషయాలను వెల్లడించారు.
12 ఏళ్ల క్రితం తన డీఎస్పీ పోస్టుకు రాజీనామా చేసి ఉద్యమంలోకి వెళ్లినట్టు తెలిపారు. అయితే ఆ తరువాత నాటి సీఎం రోశయ్య తనకు మహిళ దినోత్సవ కానుకగా తిరిగి ఉద్యోగాన్ని ఇచ్చారని చెప్పారు. అప్పుడు మళ్లీ ఉద్యోగంలో చేరిన తనకు అవమానాలు ఎదురయ్యాయని.. దీంతో మళ్లీ తాను ఉద్యమంలోకి వచ్చానని అన్నారు.
ఉద్యోగానికి దూరమైన తనను బంధుమిత్రులంతా వెలివేశారని.. ఆ తరువాత తీవ్ర ఇబ్బందులు పడ్డానని వెల్లడించారు. రెండేళ్ల క్రితం తన జీవితంలో మహర్షి దయానంద సరస్వతి ప్రవేశించారని అన్నారు అప్పటి నుంచి తన జీవితం మారిపోయిందని.. వేద ప్రచారకురాలిగా సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడమే తన ముందున్న కర్తవ్యమని పేర్కొన్నారు. తనకు సీఎం రేవంత్ రెడ్డి నిజంగా న్యాయం చేయాలని అనుకుంటే ఉద్యోగం ఇవ్వడానికి బదులుగా తన ధర్మ ప్రచారానికి ఉపయోగ పడేలా ఏదైనా సహాయం చేయాలని కోరారు.
సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత తెలంగాణ ఉద్యమ సమయంలో డీఎస్పీ పోస్టుకు రాజీనామా చేసిన నళినికి ఉద్యోగం ఇవ్వాలని నెటిజన్లు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్.. ఆమెకు వీలైతే పోలీస్ డిపార్ట్‌మెంట్ లేదా ఇతర శాఖలో ఉద్యోగం ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో నళిని తనకు మళ్లీ ఉద్యోగం చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…