Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వృద్ధురాలి పట్ల టీచర్ అసభ్య ప్రవర్తన.. కెమెరా ఎదుటే 80 యేళ్ల అత్తను చితకబాదిన కోడలు.. వీడియో వైరల్

అత్తను చితకబాదిన కోడలిని కేరళ పోలీసులు అరెస్ట్‌ చేశారు. బాధ్యత కలిగిన ఉపాధ్యాయ వృత్తి చేస్తున్న కోడలు తన అత్తను కొడుతూ హింసించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ షాకింగ్‌ ఘటన వెలుగులోకొచ్చింది. ఈ వీడియోలో వృద్ధురాలైన అత్తను చేతులతో కొట్టడంతో ఆమె కింద పడి బాధతో ఏడవడం కనిపిస్తుంది. ఆశ్చర్యం ఏంటంటే ఎదురుగా నిలబడి చూస్తున్న కన్న కొడుకు ఎదుటే అతని భార్య కొడుతుంటే మౌనంగా ఉండటం. ఈ సంఘటన కేరళలోని కొల్లాంలో వెలుగు చూసింది..

Viral Video: వృద్ధురాలి పట్ల టీచర్ అసభ్య ప్రవర్తన.. కెమెరా ఎదుటే 80 యేళ్ల అత్తను చితకబాదిన కోడలు.. వీడియో వైరల్
Kerala Viral Video
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 15, 2023 | 4:29 PM

కేరళ, డిసెంబర్‌ 15: అత్తను చితకబాదిన కోడలిని కేరళ పోలీసులు అరెస్ట్‌ చేశారు. బాధ్యత కలిగిన ఉపాధ్యాయ వృత్తి చేస్తున్న కోడలు తన అత్తను కొడుతూ హింసించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ షాకింగ్‌ ఘటన వెలుగులోకొచ్చింది. ఈ వీడియోలో వృద్ధురాలైన అత్తను చేతులతో కొట్టడంతో ఆమె కింద పడి బాధతో ఏడవడం కనిపిస్తుంది. ఆశ్చర్యం ఏంటంటే ఎదురుగా నిలబడి చూస్తున్న కన్న కొడుకు ఎదుటే అతని భార్య కొడుతుంటే మౌనంగా ఉండటం. ఈ సంఘటన కేరళలోని కొల్లాంలో వెలుగు చూసింది. ఈ వీడియో వైరల్‌ కావడంతో సదరు మహిళపై చర్యలు తీసుకోవాలంటూ కేరళ పోలీసులకు నెటిజన్లు ట్యాగ్‌ చేశారు. దీనిపై వెంటనే స్పందించిన పోలీసులు త్వరితగతిన చర్యలకు ఉపక్రమించారు. వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన గంటల వ్యవధిలోనే పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.

దీపికా నారాయణ్ భరద్వాజ్ అనే సామాజిక కార్యకర్త ఇందుకు సంబంధించిన వీడియోను షేర్‌ చేసింది. ‘వృద్ధులపై వేధింపులు పెరుగుతున్నాయి. అలాంటి పరిస్థితి ఆందోళనకరం. ఈ మహిళను ఇప్పటి వరకు అరెస్టు చేయకపోతే వెంటనే అరెస్టు చేయాలి. వృద్ధురాలిని దుర్భాషలాడేందుకు చిన్నారికి కూడా ఆమె శిక్షణ ఇవ్వడం నిజంగా కలవరపెట్టే విషయం. దయచేసి పోలీసులను ట్యాగ్ చేయండి’ అంటూ కేరళ పోలీసులను ట్యాగ్‌ చేస్తూ వీడియోను షేర్‌ చేసింది.

ఇవి కూడా చదవండి

దీంతో రంగంలోకి దిగిన కేరళ పోలీసులు తేవలక్కరలోని నడువిలక్కరలో నివాసం ఉంటోన్న నిందితురాలు మంజుమోల్ థామస్‌ (37)ను తెక్కుంభాగాం పోలీసులు డిసెంబర్‌ 14వ తేదీన అరెస్ట్‌ చేశారు. బాధితురాలిని ఎలియమ్మ వర్గీస్‌గా గుర్తించారు. బుధవారం సాయంత్రం దాడికి గురైన బాధిత మహిళ (అత్త) ఎలియమ్మ వర్గీస్‌ (80)ను చవర కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో చికిత్స నిమిత్తం తరలించారు. తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్‌ల మెయింటెనెన్స్‌, సంక్షేమ చట్టంలోని సెక్షన్ 24, IPC 308 కింద నిందితురాలిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

అనేక మంది నెటిజన్లు ఆ వీడియో క్లిప్‌పై స్పందించారు. పలువురు దీనిపై ఆందోళనను వ్యక్తం చేశారు. కోడలు ప్రవర్తనను ఖండించారు. ఇలాంటి సంఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఇలాంటి వీడియోలు జనాల్లోకి వస్తున్నాయని ఒక యూజర్‌ కామెంట్ సెక్షన్‌లో పేర్కొన్నాడు. అత్తను కొడుతున్న దృశ్యాలను కెమెరాలో రికార్డు చేస్తున్నారని తెలిసినా ఆమె ఎలాంటి బెదురు లేకుండా క్రూరంగా ప్రవర్తించడం నిజంగా విచారకరం అంటూ మరొక యూజర్‌ తన అభిప్రాయాన్ని తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.