AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: మనిషి కాదు వీడు కసాయి.. మద్యం మత్తులో కొడుకుని చంపి.. ఆపై

గుజ్జుల్ తండాకు చెందిన వసంతరావు -సరస్వతి దంపతుల కుమారుడైన సురేష్(22) గత ఐదు నెలల క్రితం దుబాయ్ దేశానికి వెళ్లి తిరిగి వచ్చాడు. అనంతరం  హైదరాబాద్ వెళ్లి ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ జీవిస్తున్నాడు. గత రెండు రోజుల క్రితం హైదరాబాద్ నుంచి స్వ గ్రామమైన గుజ్జుల్ కు సురేష్ వచ్చాడు. గల్ఫ్ లో ఉన్నప్పుడు పంపిన డబ్బుల విషయంలో తల్లి సరస్వతి తో తండ్రి వసంతరావు మధ్య గొడవ పడుతున్న క్రమంలో కుమారుడైన సురేష్ అడ్డు తగిలాడు.

Telangana: మనిషి కాదు వీడు కసాయి.. మద్యం మత్తులో కొడుకుని చంపి.. ఆపై
Telangana News
Follow us
Prabhakar M

| Edited By: Surya Kala

Updated on: Dec 22, 2023 | 9:42 AM

మద్యం మత్తులో మంచి చెడు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోవడమే కాదు.. తన పర బేధాలను కూడా మరచిపోతారని అంటూ ఉంటారు. అంతేకాదు మద్యం మత్తులో తాము చేసే పనితో ఏ విధమైన పరిష్టితులకు దారి తీస్తుందో కూడా తెలియదు. అలా ఓ తండ్రి మద్యం మత్తులో క్షణికావేశంలో కన్న కొడుకును కత్తితో దాడి చేసి హత్య చేశాడు. అనంతరం ఆ తండ్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ తెలంగాణాలో చోటు చేసుకుంది. కన్న కొడుకును కత్తితో పొడిచి చంపిన తండ్రి తర్వాత తండ్రి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుజ్జుల్ తండాలో చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం గుజ్జుల్ తండాకు చెందిన వసంతరావు -సరస్వతి దంపతుల కుమారుడైన సురేష్(22) గత ఐదు నెలల క్రితం దుబాయ్ దేశానికి వెళ్లి తిరిగి వచ్చాడు. అనంతరం  హైదరాబాద్ వెళ్లి ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ జీవిస్తున్నాడు. గత రెండు రోజుల క్రితం హైదరాబాద్ నుంచి స్వ గ్రామమైన గుజ్జుల్ కు సురేష్ వచ్చాడు. గల్ఫ్ లో ఉన్నప్పుడు పంపిన డబ్బుల విషయంలో తల్లి సరస్వతి తో తండ్రి వసంతరావు మధ్య గొడవ పడుతున్న క్రమంలో కుమారుడైన సురేష్ అడ్డు తగిలాడు. దీంతో మద్యం మత్తులో ఉన్న తండ్రి వసంతరావు(45) కొడుకు సురేష్ (22) పై కత్తితో చాతి, మెడ వీపు భాగంలో దాడి చేశాడు.

దీంతో సురేష్ కు తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే గమనించిన స్థానికులు సురేష్ ను గాంధారి మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్పటల్ కు తరలించారు. అప్పటికే సురేష్ మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో మద్యం మత్తులో ఉన్న తండ్రి వసంతరావు కొడుకు మరణాన్ని తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహాత్యయత్నానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వసంతరావు ను చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తండ్రి వసంతరావు మృతి చెందాడు. తండ్రి, కొడుకు మృతి చెందడంతో తండాలో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సరస్వతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు గాంధారి ఎస్సై ప్రేమ్ దీప్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..