AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ ఇంటిపై పగపట్టిన విధి.. ఇప్పటికే ఇద్దరు కొడుకులు మృతి.. గృహప్రవేశం చేసి సంతోషంలోనే మూడో కొడుకు హఠాన్మరణం.. ఎక్కడంటే

బ్రహ్మ రాసిన రాతను భువిలో ఎవరూ మార్చలేరేమో అని పెద్దలు చెప్పిన మాటను కొన్ని విషాద సంఘటనలు గుర్తు చేస్తూ ఉంటాయి. తమకు అండగా ఉంటారని.. వృధ్యాప్యంలో ఆసరాగా నిలబడి కావాలా ఉంటారని ఎన్నో ఆశలతో పిల్లని పెద్దవారిగా చేస్తారు తల్లిదండ్రులు. అటువంటి తల్లిదండ్రుల కళ్ల ఎదుటే తమ ముగ్గురు కొడుకులు 30 ఏళ్ల లోపే హఠాన్మరణం చెందారు. దీంతో ఆ కుటుంబం రోడ్డు పాలు అయింది.  ఈ విషాద ఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో చోటు చేసుకుంది. 

ఆ ఇంటిపై పగపట్టిన విధి.. ఇప్పటికే ఇద్దరు కొడుకులు మృతి.. గృహప్రవేశం చేసి సంతోషంలోనే మూడో కొడుకు హఠాన్మరణం.. ఎక్కడంటే
Adilabad
Naresh Gollana
| Edited By: Surya Kala|

Updated on: Dec 21, 2023 | 2:19 PM

Share

బ్రహ్మ రాసిన రాతను భువిలో ఎవరూ మార్చలేరేమో అని పెద్దలు చెప్పిన మాటను కొన్ని విషాద సంఘటనలు గుర్తు చేస్తూ ఉంటాయి. తమకు అండగా ఉంటారని.. వృధ్యాప్యంలో ఆసరాగా నిలబడి కావాలా ఉంటారని ఎన్నో ఆశలతో పిల్లని పెద్దవారిగా చేస్తారు తల్లిదండ్రులు. అటువంటి తల్లిదండ్రుల కళ్ల ఎదుటే తమ ముగ్గురు కొడుకులు 30 ఏళ్ల లోపే హఠాన్మరణం చెందారు. దీంతో ఆ కుటుంబం రోడ్డు పాలు అయింది.  ఈ విషాద ఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణం లోని శ్రీరామ్ నగర్ లోని జోగు నర్సయ్య కు 4 గురు కొడుకులు పెద్ద కొడుకు నరేందర్ గత 20 ఏళ్ల క్రితం కరెంట్ స్తంభం ఎక్కి మృత్యువు కబలించడంతో కరెంట్ స్తంభం మీదే కరంట్ షాక్ తో మృతి చెందాడు. ఈ విషాదం నుండి కుటుంబం తేరుకునేలోగానే.. రెండవ కొడుకు రాజేందర్ 7 ఏళ్ల క్రితం గుండె పోటుతో అకస్మాత్తుగా మృతి చెందాడు. తాజాగా మూడవ కొడుకు రవి సైతం అలాగే మృతి చెందడంతో ఆ కుటుంబాన్ని ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు.

నిర్మల్ జిల్లా ఖానాపూర్ శ్రీరాం నగర్ కాలనీకి చెందిన రవి.. గల్ప్ లో పని చేస్తున్నాడు. కుటుంబాన్ని బాగా చూసుకోవాలని భవిష్యత్తుపై కోటి ఆశలతో గల్ప్ వెళ్లిన రవి సెలవులో సొంత ఊరు కొచ్చాడు. ఉన్నంతలో ఓ కొత్త ఇళ్లు‌ కట్టుకున్నాడు. మూడు రోజుల క్రితం చుట్టాలను, కుటుంబ సభ్యులను ఆహ్వనించి గృహ ప్రవేశం చేశాడు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపిన రవి (34) .. మంగళ వారం అర్థరాత్రి సోపాలో పడుకుని అలాగే కన్నుమూశాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు షాక్ లు గురయ్యారు.

ఇవి కూడా చదవండి

నెల రోజుల సెలవుపై డిసెంబరు 6న స్వదేశానికి వచ్చిన రవి.. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపాడు. కొత్త ఇంటి పనులను చకచక పూర్తి చేసి బంధువులందరిని పిలిపించుకొని ఆనందోత్సాహాల మధ్య ఈ నెల 17న ఆదివారం నూతన గృహప్రవేశం చేశాడు. సోమవారం ఇంట్లో వ్రతాలు, పూజలు నిర్వహించాడు. పనులన్నీ విజయవంతంగా పూర్తయ్యాయని తన కలనెరవేరిందని మంగళవారం రాత్రి కుటుంబసభ్యులతో కలసి సరదగా గడిపాడు.

రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసి.. సోఫాపై నడుంవాల్చిన రవి.. అలాగే శాశ్వత నిద్రలోకి జారిపోయాడు. రవి మృతితో.. శుభకార్యానికి వేసిన షామియానాలు, కుర్చీలు కాస్త.. తన చివరి మజిలీకి వినియోగించాల్సి రావడంతో బంధువులు, కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. రవి మరణంతో ఆయనపైనే ఆదారపడి జీవనం సాగిస్తున్న ఆయన తల్లిదండ్రులు.. భార్య ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. రవి అన్నదమ్ములిద్దరు కూడా గతంలో ఇలాగే హఠాన్మరణం పొందడంతో ఆ కుటుంబాన్ని విధి పగబట్టిందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు‌.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..