Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dattatreya Jayanti: యోగ, ప్రాణాయామ మూలకర్త దత్తాత్రేయుడు జయంతి విశిష్టత, శుభ సమయం ఎప్పుడంటే..

మార్గశిర మాసం పౌర్ణమి రోజున దత్తాత్రేయుని అనుగ్రహం కోసం ఉపవాసం చేయడం, పూజించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. దత్తాత్రేయుడిని పూజించడం ద్వారా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి అవుతాయని విశ్వాసం. సంతానం కోసం ఎదురుచూసే దంపతులు దత్తాత్రేయుడిని పూజించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. దత్తాత్రేయుడిని ఆరాధించడం వల్ల జీవితంలో సుఖ సంతోషాలు లభిస్థాయి. అన్ని సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.

Dattatreya Jayanti: యోగ, ప్రాణాయామ మూలకర్త దత్తాత్రేయుడు జయంతి విశిష్టత, శుభ సమయం ఎప్పుడంటే..
Dattatreya Jayanti 2023
Follow us
Surya Kala

|

Updated on: Dec 21, 2023 | 11:50 AM

హిందూ క్యాలెండర్ ప్రకారం భగవాన్ దత్తాత్రేయ జన్మదినోత్సవాన్ని మార్గశిర మాసంలో శుక్ల మాసంలోని పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది డిసెంబర్ 26వ తేదీ మంగళవారం దత్తాత్రేయ భగవానుడి జయంతిని జరుపుకోనున్నారు. పురాణాల ప్రకారం దత్తాత్రేయుడిని ముక్కోటి దేవతల అవతారంగా భావిస్తారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల కలయిక దత్తాత్రేయుని రూపం అని విశ్వాసం.

దత్తాత్రేయ భగవానుడు ఈ రోజున జన్మించాడని హిందువుల నమ్మకం. దత్తాత్రేయుడు దేవుడు, గురువు  రెండు రూపాలను కలిగి ఉంటాడు. అందుకే శ్రీ గురు దేవదత్త అని కూడా పిలుస్తారు. మార్గశీర్ష మాసం పౌర్ణమి రోజున ప్రదోష కాలంలో జన్మించాడు. పురాణాల ప్రకారం దత్తాత్రేయుడు 24 మంది గురువుల నుండి విద్యను పొందారు. దత్తాత్రేయుడు పేరుతో దత్త శాఖ ను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మహారాష్ట్రలో దత్తాత్రేయ స్వామిని ప్రత్యేకంగా పూజిస్తారు. అయితే దక్షిణ భారతదేశంలో దత్తాత్రేయుడికి సంబంధించిన అనేక ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి.

దత్తాత్రేయ జయంతి ప్రాముఖ్యత

మార్గశిర మాసం పౌర్ణమి రోజున దత్తాత్రేయుని అనుగ్రహం కోసం ఉపవాసం చేయడం, పూజించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. దత్తాత్రేయుడిని పూజించడం ద్వారా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి అవుతాయని విశ్వాసం. సంతానం కోసం ఎదురుచూసే దంపతులు దత్తాత్రేయుడిని పూజించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. దత్తాత్రేయుడిని ఆరాధించడం వల్ల జీవితంలో సుఖ సంతోషాలు లభిస్థాయి. అన్ని సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

మూడు చేతులు, మూడు ముఖాలను కలిగి ఉన్న దత్తాత్రేయుడు త్రిమూర్తుల అంశంగా జన్మించినట్లు విశ్వాసం. దత్తాత్రేయుడుఅనేక మంది గురువులను కలిగి ఉన్నాడు. దత్తాత్రేయుడు అనఘాదేవి దంపతులకు చాలా మంది పిల్లలు. వారిలో ఒకరు పరశురాముడు. యోగా, ప్రాణాయామం మూలకర్త దత్తాత్రేయ అని చెబుతారు. అతని ఆలోచనే విమానానికి జన్మనిచ్చింది. నరసింహ రూపంలో హిరణ్యకశిపుని చంపింది కూడా దత్తాత్రేయుడు అని చాలామంది నమ్మకం.

గురు దత్తాత్రేయుడిని మార్గశీర్ష పూర్ణిమ రోజున ఎంతో వైభవంగా పూజిస్తారు. ఈ రోజున పవిత్ర నదులలో స్నానమాచరిస్తారు. దత్తాత్రేయుని విగ్రహానికి ధూప, దీపం, నైవేద్యాలతో పూజలను చేస్తారు. ఈ రోజున దత్తాత్రేయుడు గంగా స్నానం చేయడానికి వస్తాడని నమ్ముతారు. అందుకే గంగానది ఒడ్డున దత్త పాదుకలను కూడా పూజిస్తారు. ఈ రోజున దత్తాత్రేయుడిని గురువుగా ఆరాధించడం విశేష ఫలితాలను ఇస్తుంది.

దత్తాత్రేయ జయంతి నాడు ఇలా పూజించండి

మార్గశీర్ష మాసం పౌర్ణమి నాడు తెల్లవారుజామున నిద్రలేచి అన్ని పనుల చేసుకున్న అనంతరం నది స్నానం ఆచరించిన అనంతరం శుభ్రమైన దుస్తులు ధరించాలి. ఆ తర్వాత పూజా స్థలాన్ని శుభ్రం చేసి, ఉపవాసం ఉంటానని ప్రతిజ్ఞ చేయాలి. ఆలయంలో దత్తాత్రేయుని విగ్రహం లేదా విగ్రహాన్ని ప్రతిష్టించి తిలకాన్ని తీర్చిదిద్దాలి. పసుపు పువ్వులు, పసుపు వస్తువులను సమర్పించండి. దీని తరువాత దత్తాత్రేయుడికి సంబంధించిన మంత్రాలను జపించండి. కోరిన కోరికల నెరవేర్చమని ప్రార్ధించండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు